Fake suicide note
-
సూసైడ్‌నోట్ రాసి ప్రియుడితో వెళ్లిపోయింది..
సాక్షి, కాచిగూడ: ‘నాన్నా నా శవాన్ని తీసుకెళ్లు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ యువతి రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపింది. దీంతో నారాయణగూడ పోలీసు కేసుని చాలెంజ్‌గా తీసుకుని యువతి ఆడింది నాటకమని తేల్చారు. నిజామాబాద్ జిల్లా నబీపేటకు విద్యార్థిని(19) హిమాయత్‌నగర్ గౌడ బాలికల హాస్టల్లో ఉంటూ కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మణిరత్నం హిమాయత్‌నగర్ గౌడ బాయ్స్‌హాస్టల్‌లో ఉంటూ కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీలోనే చదువుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరనే నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజులు ఇక్కడ కనిపించకుండా వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచనతో గత నెల 27వ తేదీన ‘ నా శవాన్ని తీసుకెళ్లు నాన్న’ అంటూ తండ్రికి సూసైడ్ నోట్ రాసి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్లో ఉంటున్న మణిరత్నం కూడా కనిపించకుండా పోయాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో ప్రత్యక్షం... మణిరత్నంకు వరసకు బావమరిది అయ్యే వ్యక్తి గుంటూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ ఇంటర్ సిటీ ట్రైన్లో గుంటూరు వెళ్లారు. మణిరత్నం బావమరిది దగ్గర ఉన్నారు. మరో మూడురోజులు దాటితే మణిరత్నం మేజర్ కానున్నాడు. వీరిద్దరి కాల్ లిస్ట్‌ని, సీసీ పుటేజీలను పోలీసులు పరీశిలించారు. ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి ఆదివారం గుంటూరులోని బిగ్‌బజార్ వద్ద సంచరిస్తున్న ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నేడు పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. (చదవండి: ‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’) -
నకిలీ సూసైడ్ నోట్‌తో పోలీసులకు బురిడీ ?
కాంట్రాక్టర్ ఆత్మహత్యలో కొత్త కోణం ఆరా తీస్తున్న నిఘా విభాగం విజయవాడ సిటీ : కేబుల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తన వేధింపులు బయటకు పొక్కకుండా చూసే క్రమంలో నకిలీ సూసైడ్ నోట్‌ను కాల్‌మనీ వ్యాపారి తన స్నేహితుల ద్వారా సృష్టించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఁకాటేసిన కాల్‌మనీ* శీర్షికతో ఁసాక్షి*లో శనివారం ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. గాంధీనగర్‌లోని జంట థియేటర్ల ప్రాంతానికి చెంది కాల్‌మనీ వ్యాపారి ఆగడాలకు కేబుల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సాక్షి కథనం ఆధారంగా పోలీసు నిఘా విభాగం ఈ ఘటనపై లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మృతుడు రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ కూడా నకిలీదేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్యనారాయణపురానికి చెందిన బీఎస్ఎన్ఎల్ కేబుల్ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ మూడు రోజుల కిందట తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రూ.2లక్షలు కాల్‌మనీగా తీసుకొని సకాలంలో చెల్లించలేకపోయాడు. కాల్‌మనీ వ్యాపారి వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాల్‌మనీ వ్యాపారి రంగంలోకి దిగి తన పేరు బయటకు పొక్కకుండా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. తన స్నేహితులను పంపి మృతుని కుటుంబ సభ్యులను సున్నితంగా హెచ్చరించడంతో పాటు చంద్రశేఖర్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ ఓ లేఖను కూడా తయారు చేసి సంఘటనా స్థలంలో వదిలేసినట్టు చెపుతున్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తే అనేక విషయా లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. రంగంలోకి నిఘా విభాగం కాంట్రాక్టరు ఆత్మహత్య ఘటనలో నిజాలను వెలికి తీసేందుకు పోలీసు నిఘా విభాగం రంగంలోకి దిగినట్టు విశ్వసనీయంగా తెలి సిం ది. చంద్రశేఖర్ వివరాలను ఈ విభాగం సేకరించింది. గాంధీనగర్ కేంద్రంగా కాల్‌మనీ చేసే వ్యాపారికి సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో పడ్డారు. చంద్రశేఖర్ ఆర్థిక పరిస్థితి, కాల్‌మనీ వ్యాపారికి ఇవ్వాల్సిన మొత్తం తదితర వివరాలతోపాటు వ్యాపారి ఆగడాల గురించి కూడా వీరు తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా కాల్‌మనీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలిసింది. సత్యనారాయణపురం పోలీసులు కొందరు సాక్షులను పిలిపించి చంద్రశేఖర్ ఆత్మహత్యపై విచారణ జరిపారు.