Falaknuma Das Movie
-
బర్త్‌డే రోజు మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చిన విశ్వక్ సేన్
హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘గామి, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ, లేడీస్ నైట్’ వంటి చిత్రాలు చేస్తున్న ఆయన మంగళవారం(మార్చి 29) తన పుట్టినరోజుని పురస్కరించుకుని త్రిబుల్ ధమాకాలా మరో మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు. గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రంలో ఆయన చేసిన లాయర్ విశ్వామిత్ర పాత్ర లుక్‌ని రిలీజ్ చేశారు. ఎస్కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా ‘ఫలక్‌నుమా దాస్ 2’, ‘స్టూడెంట్ జిందాబాద్’ అనే రెండు కొత్త చిత్రాలను సైతం ప్రకటించాడు. ‘‘ఈ నగరానికి ఏమైంది’లో నటించినప్పుడు నాకు 22 ఏళ్లు. ఇప్పుడు 27 ఏళ్లు. అప్పుడే ఐదేళ్లు అయ్యాయా అనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు’. అలా నా సినిమాలు ఉంటాయి’’ అన్నారు విశ్వక్ సేన్. చదవండి: అప్పుడే ఓటీటీలోకి వస్తున్న స్టాండప్ రాహుల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
ఏడు రోజులు.. ఏడు కోట్లు
విశ్వక్సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. వాంగ్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటేరాజు సమర్పణలో విశ్వక్సేన్ సినిమాస్, టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 31న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కరాటేరాజు మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్‌వర్క్ చేసి, ఎంతో కష్టపడి విశ్వక్ సేన్ ‘ఫలక్‌నుమా దాస్’ చేశాడు.. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా సినిమా 7 రోజుల్లో 7 కోట్ల 50 లక్షలు వసూలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అనడంతో రీ ఎడిటింగ్ చేశాం. భారీ క్యాస్టింగ్‌తో ‘ఫలక్‌నుమా దాస్ 2’తో ప్రేక్షకుల ముందుకు వస్తాం’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ ‘ఫలక్‌నుమా దాస్’తో ధమ్కీ ఇచ్చా.. నా తర్వాతి సినిమాతో షాక్ ఇస్తా’’ అన్నారు. ‘‘శివ, చందమామ’ సినిమాల్లో నా పాత్రలకు ఎంత పేరొచ్చిందో, వాటి తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’లో చేసిన పాత్రకూ అంతే పేరొచ్చింది’’ అన్నారు నటుడు ఉత్తేజ్. సహనిర్మాత: మాణిక్యరావు, హీరోయిన్ ప్రశాంతి, నటులు జీవన్, యశ్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ పాల్గొన్నారు. -
దానికి వెరీ వెరీ సారీ
‘‘ఐదు కోట్లు ఖర్చు పెట్టుకుని నేను ఓ కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు. కానీ, చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కు నా సినిమా ఒక మంచి లాంచింగ్ ప్యాడ్లా ఉండాలని 80 మంది కొత్తవాళ్లను పెట్టి, రెండేళ్లు కష్టపడి ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా తీశాం. మా సినిమాపై నెగటివిటీని ప్రచారం చేయడానికి ఓ గ్రూప్ తయారైంది’’ అన్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. డి.సురేశ్‌బాబు సమర్పణలో కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. తన సోషల్ మీడియా అకౌంట్లో విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన వీడియోపై, విజయవాడ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలపై దుమారం రేగింది. దీనిపై విశ్వక్ సేన్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను ఏ రివ్యూ రైటర్ని కానీ మీడియాను కానీ ఏ హీరోనీ కూడా ఏమీ అనలేదు. కానీ కొందరు పని గట్టుకుని మా సినిమాపై నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్‌ను కొందరు చించేయడం బాధ అనిపించింది నేను డబ్బులు ఎక్కువై సినిమా చేయలేదు. అందరి డబ్బూ తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. ఎవరినో ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే చీప్ మెంటాలిటీ నాకు లేదు. నా సినిమాకు పదికోట్లు నష్టం వస్తుందని తెలిసినప్పుడు కంట్రోల్ తప్పి, ఒక మాట అన్నాను. దానికి వెరీ వెరీ సారీ! విజయవాడలో నేను మాట్లాడిన ఫుల్ వీడియో చూపకుండా, కట్ చేసి చూపిస్తున్నారు. అసలు నేను ప్రేక్షకులను ఎందుకు తిడతాను? ఆదివారం సెకండ్ షో కాకుండా 4.80 కోట్ల రూపాయల గ్రాస్‌ను మా సినిమా కలెక్ట్ చేసింది. ఈ వీక్‌లో విడుదలైన సినిమాలన్నింటిలో మాదే హయ్యస్ట్ గ్రాసర్. నేను ఎవరినీ హర్ట్ చేయలేదు.. ఎవరికీ సవాల్ విసరలేదు. ఎవరి ఫ్యాన్స్‌నూ ఏమీ అనలేదు. నాకు అన్నం పెట్టేదే సినిమా. అలాంటిది రివ్యూ రైటర్స్‌ను నేను ఎందుకు విమర్శిస్తాను. నిజంగా నేను వాళ్లని అన్నట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. రేటింగ్స్‌ని పక్కన పెడితే మా సినిమాను ప్రేక్షకులు బతికిస్తున్నారు’’ అన్నారు. -
కంట్రోల్ తప్పి మాట జారా.. క్షమించండి : హీరో
ఫలక్‌నుమాదాస్ సినిమాపై సోషల్‌మీడియాలో నెగటివ్ ప్రమోషన్ చేస్తున్నవారిపై హీరో విశ్వక్ మండిపడ్డారు. 80 మంది కొత్తవారిని పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి సొంత డబ్బుతో సినిమా తీస్తే, పనిగట్టుకుని నెగటివ్ ప్రమోషన్ చేయడంతో కంట్రోల్ తప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట జారానని అన్నారు. అందుకు సారీ చెబుతున్నానని చెప్పారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చివరి 6 సెకన్లు ఎవరిని తిట్టానని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 'నేను ఏ రివ్యూ రైటర్‌ను తిట్టలేదు. ఏ మీడియాను, ఏ హీరోను ఉద్దేశించి అలా అనలేదు. మూడు రోజుల నుండి సినిమాకు సంబంధించి 180 పైరసీ లింకులను పెట్టారు. ఇంటర్నెట్లో తీసేసినా, మళ్లీ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సహకరించిన ఫిలించాంబర్ సైబర్ క్రైమ్‌కు కృతజ్ఞతలు. పోస్టర్లు చింపడం, నెగటివ్ పబ్లిసిటీ, పైరసీ వల్ల సినిమాకు నష్టమొచ్చిందని క్లియర్‌గా కనిపిస్తుంటే, కంట్రోల్ తప్పి మాట జారా. అందుకు సారీ చెబుతున్నా. అలా అనాల్సి ఉండొద్దు. మూడు రోజుల నుండి నిద్రలేకుండా గడుపుతున్నా. ఒకరిని దృష్టిలోపెట్టుకుని మాట్లాడితే, హైప్ వస్తుంది కామెంట్ చేసే వాడిని కాదు. నా సినిమాతోనే పేరు రావాలని అనుకునే వాడిని కానీ, చీప్ ట్రిక్స్‌తో ఒకరిని తిట్టితే పైకొస్తమనుకునే వాడిని కాదు. అలాంటి ఉద్దేశ్యం లేదు' అని విశ్వక్ తెలిపారు.