
హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘గామి, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ, లేడీస్ నైట్’ వంటి చిత్రాలు చేస్తున్న ఆయన మంగళవారం(మార్చి 29) తన పుట్టినరోజుని పురస్కరించుకుని త్రిబుల్ ధమాకాలా మరో మూడు చిత్రాల అప్‌డేట్స్ ఇచ్చారు. గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రంలో ఆయన చేసిన లాయర్ విశ్వామిత్ర పాత్ర లుక్‌ని రిలీజ్ చేశారు. ఎస్‌కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
కాగా ‘ఫలక్‌నుమా దాస్ 2’, ‘స్టూడెంట్ జిందాబాద్’ అనే రెండు కొత్త చిత్రాలను సైతం ప్రకటించాడు. ‘‘ఈ నగరానికి ఏమైంది’లో నటించినప్పుడు నాకు 22 ఏళ్లు. ఇప్పుడు 27 ఏళ్లు. అప్పుడే ఐదేళ్లు అయ్యాయా అనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు’. అలా నా సినిమాలు ఉంటాయి’’ అన్నారు విశ్వక్ సేన్.
చదవండి: అప్పుడే ఓటీటీలోకి వస్తున్న స్టాండప్ రాహుల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment