నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
గార్లదిన్నె: మర్తాడులో నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మర్తాడు గ్రామానికి చెందిన బాషా, భాను కుమార్తె షకీదా (5) ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో కనిపించడం లేదు. దీంతో బంధువులు చుట్టు పక్కల అంతా వెతికారు. ఆఖరికి బాషా ఇంటి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో షకీదా మృతదేహాన్ని కనుకున్నారు. నీళ్లలో విగత జీవిలా పడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.