family missing
-
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశమివ్వండి
శివాజీనగర: ఆత్మహత్య లేఖ రాసి ఉంచి కుటుంబం అదృశ్యమైన సంఘటన బెంగళూరు బాగలగుంటలో చోటు చేసుకుంది. గాంధీ, శాలిని దంపతులు, వారి పిల్లలు భానుశ్రీ, హేమశ్రీ అదృశ్యమైనవారు. దంపతుల తనయుడు చిరంజీవి తుమకూరులో చదువుకుంటున్నాడు. రోజూ కుటుంబంతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆగస్టు 12న ఫోన్ చేయగా అందరి ఫోన్లు స్విచ్చాఫ్ అని రావడంతో కంగారుపడిన చిరంజీవి, దగ్గర్లోని స్నేహితునికి సమాచారమిచ్చాడు. అతడు వెళ్లిచూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి యజమానిని విచారించగా, కుటుంబంతో కలిసి వస్తువులన్నింటిని తీసుకొని వెళ్లారని చెప్పాడు. ఇది తెలిసి చిరంజీవి బాగలకుంటెకు వచ్చి తన వద్ద ఉన్న తాళంతో ఇంటి తలుపులు తీయగా, కిటికీ వద్ద డెత్‌నోట్ కనిపించింది. తమకు బతకటం చాలా కాష్టమవుతోంది, ఈ జీవితం అవసరం లేదు. దయచేసి మరణించేందుకు అవకాశం ఇవ్వాలని అందులో రాసి ఉంది. చిరంజీవి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు జరుపుతున్నారు. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ఈ తల్లీపిల్లలు ఏమయ్యారో..?
సాక్షి, తిరుపతి: షాపింగ్‌కంటూ ముగ్గురు పిల్లలతో వెళ్లిన తల్లి అదృశ్యమైన సంఘటన తిరుపతిలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక కెనడీనగర్‌కు చెందిన శివకుమార్, శ్రీలేఖ దంపతులకు దీక్షితశ్రీ, తేజస్విశ్రీ, కార్తీక్ సంతానం. శ్రీలేఖ ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం రిలయన్స్ మార్ట్‌కు వెళ్లింది. షాపింగ్ అనంతరం భర్తకు కాల్ చేసి మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. భార్యాపిల్లల కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శివకుమార్ ఫిర్యాదు చేశారు. (రాళ్లతో దాడికి తెగబడి.. కాల్పులు జరిపేందుకు..) రిలయన్స్ మార్ట్ నుంచి తన ముగ్గురు పిల్లలతో శ్రీలేఖ రోడ్డుపై వెళుతున్నట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలోని కొన్ని ప్రముఖ కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, తన భార్యతో ఎలాంటి గొడవలూ లేవని, ఎవరితో కూడా తమ కుటుంబానికి శత్రుత్వం లేదని శివకుమార్ పేర్కొన్నారు. శ్రీలేఖ తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఇదే మాట స్పష్టం చేశారు. బహుశా తన భార్యాపిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని శివకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ మిస్సింగ్ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
విజయవాడలో కుటుంబం అదృశ్యం
విజయవాడ: నగరంలో ఓ కుటుంబం అదశ్యమైన సంఘటన కలకలం రేగుతోంది. కృష్ణలంక భ్రమరాంబ కాలనీకి చెందిన హుస్సేన్ భార్య, కుమారుడితో కలిసి సోదరి ఇంటికి వెళ్లి అదృశ్యమయ్యారు. స్థానిక స్వర్ణపురి రోడ్లో నివాసముంటున్న హుస్సేన్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా హుస్సేన్ భార్య షబానా, కుమారుడు షాహీన్‌తో కలిసి బుధవారం వన్‌టౌన్‌లోని సోదరి ఇంటికి వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో హుస్సేన్ సోదరి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.