విజయవాడలో కుటుంబం అదృశ్యం | family missing in viajayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో కుటుంబం అదృశ్యం

Published Fri, Jun 30 2017 11:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

family missing in viajayawada

విజయవాడ: నగరంలో ఓ కుటుంబం అద​శ్యమైన సంఘటన కలకలం రేగుతోంది. కృష్ణలంక భ్రమరాంబ కాలనీకి చెందిన హుస్సేన్‌ భార్య, కుమారుడితో కలిసి సోదరి ఇంటికి వెళ్లి అదృశ్యమయ్యారు. స్థానిక స్వర్ణపురి రోడ్‌లో నివాసముంటున్న హుస్సేన్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
 
రంజాన్‌ సందర్భంగా హుస్సేన్‌ భార్య షబానా, కుమారుడు షాహీన్‌తో కలిసి బుధవారం వన్‌టౌన్‌లోని సోదరి ఇంటికి వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో హుస్సేన్‌ సోదరి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement