family pension
-
పింఛనుకు సంతానాన్నీ నామినేట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
సీపీఎస్ ఉద్యోగులకు పింఛన్ మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) పరిధిలోనికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పింఛన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గతేడాది జూన్ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలతో సర్క్యులర్‌ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కుటుంబానికి పింఛన్ కింద ఇవ్వ నున్నారు. అదేవిధంగా గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్‌ను మినహాయించుకోకపోయినా, పింఛన్ కోసం శాశ్వత అకౌంట్ నెంబర్ (ప్రాన్) లేకపోయినా ఈ పింఛన్ విధానం వర్తించనుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్‌తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్ వర్తించనుంది. తద్వారా 1,500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ మంజూరయ్యేందుకు మార్గం సుగమం అయింది. ఈ ఉత్తర్వుల జారీ పట్ల తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పింఛన్ పథక ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. కుటుంబ పింఛన్ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్‌కు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు. తమ యూనియన్ వినతి మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సంతోషదాయకమని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ౖఅధ్యక్షుడు నరేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆ కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ రాదు.. తెలంగాణ సర్కారు క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ మరణానంతరం జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛను)ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ పొందిన ఆ జీవిత భాగస్వామి మరణిస్తే.. ఆ వ్యక్తిపై ఆధారపడిన వితంతు/ విడాకులు పొందిన కుమార్తె ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అర్హురాలు కాదని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా ఉద్యోగి/పెన్షనర్ మరణిస్తే..అంతకుముందే వారి జీవిత భాగస్వామి మరణించి/ విడాకులు పొంది ఉన్న సందర్భాల్లో మాత్రమే.. వితంతువు/విడాకులు పొందిన కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ జారీ చేయాల్సిందిగా 2010లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఈ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుని ఫ్యామిలీ పెన్షనర్ల మరణానంతరం వారిపై ఆధారపడిన వితంతువు/విడాకులైన కుమార్తెలకు తదుపరిగా ఫ్యామిలీ పెన్షన్లు జారీ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి డి.విజయకుమారి ఇటీవల అకౌంటెంట్ జనరల్ (ఏజీ)తో పాటు ట్రెజరీ విభాగానికి లేఖ రాశారు. -
కుటుంబ పెన్షన్లలో జీవో 152 రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న తెచ్చిన జీవో 152ని హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో తీసుకొచి్చన ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీల్లేదని పేర్కొంది. పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె, విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అనర్హులుగా చేయడం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. పిటిషనర్లందరికీ గతంలో చెల్లించిన విధంగానే కుటుంబ పెన్షన్ చెల్లించాలని అధికారులను ఆదేశించింది. పెన్షన్ నిలిపివేసిన నాటి నుంచి 6 శాతం వడ్డీతో కలిపి వారికి పెన్షన్ చెల్లించాలంది. రెండు నెలల్లో ఈ చెల్లింపులు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. వయసుతోపాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.. పదవీ విరమణ తరువాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె వితంతువు అయినా, విడాకులు తీసుకున్నా వారి కుటుంబ పెన్షన్ విషయంలో నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం 2019 జీవో 152 జారీ చేసింది. ఆ కుమార్తెల పెన్షన్ వయసును 45 ఏళ్లుగా నిర్ధారించింది. వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు తిరిగి వివాహం చేసుకునేంత వరకు లేదా సంపాదన మొదలు పెట్టే వరకు లేదా ఆమె పిల్లల్లో ఎవరైనా మేజర్ అయ్యేంత వరకు లేదా ఆమె మరణం వరకు కుటుంబ పెన్షన్ వస్తుందని జీవోలో పేర్కొంది. ఈ జీవో ఆధారంగా పలువురికి పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై వితంతు, విడాకులు తీసుకున్న పలువురు మహిళలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా పెన్షన్ వయసును 45 ఏళ్లుగా నిర్ణయించడం హాస్యాస్పదమన్న న్యాయమూర్తి, ఆ కారణంగా పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటప్పుడే ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయన్నారు. 45 ఏళ్ల లోపు, 45 ఏళ్లు దాటిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల విషయంలో వివక్ష చూపడం తగదన్నారు. ఈ వర్గీకరణలో హేతుబద్ధత లేదన్నారు. జీవో జారీ చేసే ముందు అధికారులు సామాన్యుడి ఆలోచనా విధానాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో పేర్కొన్నారు. -
భర్తను చంపినా పెన్షన్ ఇవ్వాల్సిందే..
చండీగఢ్: ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిందని తేలితే భార్యకు పెన్షన్ ఇచ్చేది లేదని హర్యానా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాలను తప్పుబడుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. భర్తను భార్యే చంపిందని సాక్షాధారాలతో రుజువైనా, భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే, వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారని, అలాంటిది ఎటువంటి ఆర్ధిక భరోసా లేని భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తే తప్పేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భార్య క్రిమినల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హురాలేనని కోర్టు స్పష్టం చేసింది. భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన బల్జీత్ కౌర్ అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. హర్యానా ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త 2008లో మరణించాడని ఆమె పిటిషన్లో పేర్కొంది. అయితే 2009లో ఆమె తన భర్తను హతమార్చిందని పోలీసులు ఆమెపై హత్యానేరం మోపగా, 2011లో ఆమె దోషిగా తేలింది. 2011 వరకూ హర్యానా ప్రభుత్వం ఆమెకు పెన్షన్ ఇచ్చినా.. ఆతర్వాత దోషిగా తేలడంతో ఆమె పెన్షన్‌ను నిలిపి వేసింది. తాజా విచారణలో హర్యానా ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టిన కోర్టు.. బల్జీత్ కౌర్‌కు పూర్తి బకాయిలతో పాటు పెన్షన్ చెల్లించాలని సంబంధిత శాఖను ఆదేశించింది. కాగా, సీసీఎస్ రూల్స్, 1972 ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారు. భర్త మరణాంతరం భార్య రెండో పెళ్లి చేసుకున్నా, ఆమె ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే. -
రేషన్ కార్డుతో పలు చిక్కులు!
తెలంగాణ రాష్ట్రంలో గడచిన కొంత కాలంగా రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న పరిశీలన సవ్యంగా సాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నియమ నిబంధనలు ఏమీ తెలియని వారితో కార్డుల పరిశీలన జరిపించటం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుంది. ఒక కుటుంబంలో సర్వీస్ పెన్షన్ గాని, ఫ్యామిలీ పెన్షన్ కాని ఉంటే కార్డు రాదని అంటున్నారు. పెన్షన్ అనేది పదవీ విరమణ చెందిన వారి సొంత అవసరాల కోసం ఇచ్చేది. దాన్ని తన కుమారులు, కుమార్తెలకు తనకు తోచిన విధంగా ఇస్తుంటారు. కాని అది కుటుంబానికి సంబంధించిన ఆదాయం కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన ఇండ్లు, ఆస్తులు ఉన్నా తక్కువ ఆదాయం గలవారూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ యజమాని ఆదాయం మాత్రమే పరిగణించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయ పరిమితిని పరగణనలోకి తీసుకొని పరిశీలించాలని ప్రభుతాన్ని, అధికారులను కోరుతున్నాను. వలస పాలనలో ఉన్నటువంటి కార్డులను తెలంగాణ వచ్చిన తర్వాత తీసివేయ డం బాధాకరం. స్వంత ప్రభుత్వంలో తాము మరింత సంతో షంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. - మద్ది ఆనంద్ కుమార్ జమ్మిగడ్డ, సూర్యాపేట