తెలంగాణ రాష్ట్రంలో గడచిన కొంత కాలంగా రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న పరిశీలన సవ్యంగా సాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నియమ నిబంధనలు ఏమీ తెలియని వారితో కార్డుల పరిశీలన జరిపించటం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుంది. ఒక కుటుంబంలో సర్వీస్ పెన్షన్ గాని, ఫ్యామిలీ పెన్షన్ కాని ఉంటే కార్డు రాదని అంటున్నారు. పెన్షన్ అనేది పదవీ విరమణ చెందిన వారి సొంత అవసరాల కోసం ఇచ్చేది.
దాన్ని తన కుమారులు, కుమార్తెలకు తనకు తోచిన విధంగా ఇస్తుంటారు. కాని అది కుటుంబానికి సంబంధించిన ఆదాయం కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన ఇండ్లు, ఆస్తులు ఉన్నా తక్కువ ఆదాయం గలవారూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ యజమాని ఆదాయం మాత్రమే పరిగణించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయ పరిమితిని పరగణనలోకి తీసుకొని పరిశీలించాలని ప్రభుతాన్ని, అధికారులను కోరుతున్నాను. వలస పాలనలో ఉన్నటువంటి కార్డులను తెలంగాణ వచ్చిన తర్వాత తీసివేయ డం బాధాకరం. స్వంత ప్రభుత్వంలో తాము మరింత సంతో షంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- మద్ది ఆనంద్ కుమార్ జమ్మిగడ్డ, సూర్యాపేట
రేషన్ కార్డుతో పలు చిక్కులు!
Published Sun, Dec 14 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement