familys
-
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
-
15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ
ఇజ్రా చిట్టెంపల్లి.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఓ చిన్న గ్రామం. 300 కుటుంబాలు ఉన్న గ్రామంలో అందరూ గిరిజనులే. అందరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. అలాంటి పల్లె దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఉదయాన్నే దూసుకొచ్చిన మృత్యుశకటం ఐదు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఐదుగురివి పేద కుటుంబాలే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు సమీప బంధువులు, దాయాదులు. మృతులు జాటోత్ సోనాబాయి, నితిన్, జాటోత్ శేనిబాయి, జాటోత్ రేణుకాబాయి దాయాది కుటుంబాలకు చెందినవారు కాగా, రమావత్ సంధ్య వీరికి సమీప బంధువు. – మోమిన్‌పేట 15 రోజుల్లో పెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన కమల్, శవంత దంపతులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకూతురు సంధ్య వికారాబాద్ కొత్తగడి సమీపంలో ఉన్న సమీకృత హాస్టల్లో ఉంటూ నలంద కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి టాపర్ అయిన సంధ్య కరాటే కూడా నేర్చుకుంది. కరోనా కారణంగా కళాశాలకు సెలవు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి ఆసరాగా రోజూ కూలిపనులకు వెళ్తోంది. కమల్ సోదరి కుమారుడితో జనవరి 10న సంధ్య వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం ఆమెతో వికారాబాద్‌లో పూజలు చేయించాలనుకున్నారు. పెళ్లి బట్టలు కొనడంతోపాటు పత్రికలు రాసుకునేందుకు సిద్ధ మయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూలిపనులకు బయలుదేరి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. చదవండి: (మృత్యుశకటం!) తిరిగిరాని లోకాలకు చదువులతల్లి.. కమల్, జీనిబాయిల రెండో కుమార్తె సోనీబాయి(16)కి చదువుల తల్లిగా గ్రామంలో పేరుంది. ప్రస్తుతం ఆమె వికారాబాద్ కొత్తగడి సమీకృత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్దే ఉంటూ కూలిపనులకు వెళ్తోంది. ఈ క్రమంలోనే శనివారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. సోనిబాయి అక్క స్వప్నకు మాటలు రావు. త మ్ముడు చిన్నవాడు. దీంతో సోనిబాయిని బాగా చదివించి ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావిం చారు. కానీ రోడ్డు ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. కూలిపనులకు వద్దన్నా వెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన శేనిబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లిళ్లు అయిపోయాయి. భర్త బాబు వ్యవసాయ కూలీ. శేనిబాయి పెద్దకుమారుడు వినోద్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా డబ్బులు పంపిస్తానని, కూలిపనులకు వెళ్లొద్దని తల్లిని నిత్యం వారించేవాడు. అయినా ఆమె వినిపించుకునేది కాదు. 10 రోజుల క్రితం కూడా తల్లితో మాట్లాడిన వినోద్.. కూలికి వెళ్లవద్దని నచ్చజెప్పాడు. కొడుకు వారిస్తున్నా వినకుండా శనివారం పనులకు బయలుదేరి, ప్రాణాలు కోల్పోయింది. పిల్లలను వదిలి.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేణుకాబాయికి ఐదేళ్ల కూతురు సింధు, మూడేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నారు. భర్త వినోద్ వ్యవసాయ కూలీ. రేణుకాబాయి రోజు మాదిరిగానే పనులకు బయలుదేరి వెళ్లి ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ఆలనాపాలనకు దూరమయ్యారు. నానమ్మ దశదినకర్మ మరుసటిరోజే.. నానమ్మ దశ దినకర్మ మరుసటిరోజే మనవడు మృతిచెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. చిట్టెంపల్లికి చెందిన మోతీలాల్, మంగీబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారిలో జాటోత్ నితిన్(16) చిన్నవాడు. నితిన్ రంగారెడ్డి జిల్లా యాచారంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా ఇంటివద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు. ఇటీవల నానమ్మ మంకీబాయి మృతి చెందటంతో పది రోజులుగా పనులకు వెళ్లడంలేదు. శుక్రవారం దశదినకర్మ ముగియటంతో శనివారం ఉదయం పత్తి తీసేందుకు బయలుదేరి విగతజీవుడయ్యాడు. ఆటో డ్రైవర్ హరి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావించిన నితిన్ తండ్రి మోతీలాల్.. అతడి ఇంటి పైకప్పు కూల్చివేశాడు. -
అమ్మ నటి.. నేను పెయింటర్
సినిమా కుటుంబాలు రెండు రకాలు. పిల్లలను తిరిగి సినిమాల్లోనే ప్రవేశపెట్టే కుటుంబాలు కొన్ని. సంతానాన్ని కొత్త దారుల్లో నడిపించే కుటుంబాలు కొన్ని. సినిమాల్లో కొనసాగుతున్నవారు ఎలాగూ తెలుస్తారు. పరిశ్రమకు దూరంగా ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలనాటి సూపర్‌స్టార్ జమున పిల్లలు ఏం చేస్తున్నారు? కుమారుడు వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కుమార్తె స్రవంతి హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు. ఆమె తన జీవితం గురించి, తల్లితో అనుబంధం గురించి ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో... నా చిన్నప్పుడు అమ్మ నటిగా, ఎంపీగా, సోషల్ యాక్టివిస్ట్‌గా చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమె ఆ పనుల నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాకే ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఆమె నన్ను ఒక సెలబ్రిటీ కూతురులా కాకుండా సాధారణమైన అమ్మాయిగానే పెంచింది. టైమ్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, స్వేచ్ఛ అన్నీ అలవాటు చేసింది. నేను ఫలానా వాళ్ల అమ్మాయినని చెప్పుకుని ప్రయోజనాలు పొందకూడదు అనేది. తప్పు చేయొద్దని, పనులన్నీ సొంతంగా చేసుకోవాలని చెప్పేది. ప్రోగ్రెస్ కార్డు వచ్చిన రోజు దెబ్బలే... నా చిన్నప్పుడు సినిమా వాళ్ల పిల్లలు సినిమా తారలు అవుతారు అనుకునేదాన్ని. స్కూల్లో టీచర్లు కూడా ‘నువ్వు చదువుకోకపోయినా పరవాలేదు, మీ అమ్మగారు పెద్ద హీరోయిన్ కదా, నువ్వు కూడా హీరోయిన్‌వి అయిపోతావు’ అనేవారు. నేను అదే నిజం అనుకున్నాను. చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. కాని అమ్మ ఊరుకునేది కాదు. తక్కువ మార్కులు వస్తే బెత్తం అందుకునేది. అందుకని నా రిపోర్టు కార్డు నాన్న స్వయంగా తీసుకునేవారు. ఆ టైమ్‌లో అమ్మకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నించేదాన్ని. ఒక్కోసారి చెట్టు ఎక్కేసేదాన్ని. అమ్మ చేతికి చిక్కగానే రెండు దెబ్బలు పడేవి. నాకు ఇంగ్లీషు, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇష్టం. నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఏ. పూర్తి చేశాను. అమ్మ ఎంత బిజీగా ఉన్నా నేను స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి నా చేత సత్యభామ వేషం వేయించి, తనే కొత్త డ్రెస్ కుట్టించి, మేకప్ చేసి, పద్యాలు నేర్పించేది. మా స్కూల్‌కి వచ్చేది. అమ్మని ప్రత్యేక అతిథిగా వేదిక మీదకు ఆహ్వానించేవారు. తెలుగుతో సూర్యోదయం... తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే అమ్మ నిద్ర లేచి నాకు హిందీ, తెలుగు నేర్పించేది. ఎంత ఆధునికంగా ఉన్నా, సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదని, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని అమ్మనాన్న ఇద్దరూ చెప్పేవారు. పూజ, మడి, ప్రసాదం తయారు చేయడం, నైవేద్యం పెట్టడం... అన్నీ నేర్పింది. అందరితో కలసిమెలసి ఉండాలని చెప్పేది, కలవనిచ్చేది. ఒత్తులు సరిగా పలక్కపోతే ఒప్పుకునేది కాదు. మా అబ్బాయికి కూడా అమ్మే తెలుగు నేర్పిస్తూ, తెలుగులో మాట్లాడాలని చెబుతుంది. మా చిన్నతనం నుంచి అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు మా విషయాలు పట్టించుకునేవారు. పాటలు – పాత్రలు... అమ్మకి జ్ఞాపకం బాగా ఎక్కువ. ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగిందీ, అక్కడ సెట్లో వాళ్లు ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారో అన్నీ నాకు చెప్పేది. నేను, నాన్న ‘మీరజాలగలనా’ పాటను పాడుతూ అమ్మను ఆట పట్టించేవాళ్లం. అమ్మ నటించిన ‘గుండమ్మ కథ’ నా ఫస్ట్ ఫేవరేట్. అందులో అమ్మ వేసిన సరోజ పాత్రలో నన్ను నేను చూసుకుంటాను. నేను కూడా ఆ సినిమాలోలాగే నిద్ర మంచం మీద నుంచే ‘అమ్మా! కాఫీ’ అనేదాన్ని. ‘కిందకి వచ్చి తాగు’ అని అమ్మ గట్టిగా అనేది. ఈ సినిమాలో రెండోభాగంలో ఒక సామాన్యుడి భార్యగా అమ్మని చూడటం నాకు నచ్చేది కాదు. ఒక సినిమాలో అంత వేరియేషన్ రావడం ఆ తరవాతి రోజుల్లో నాకు బాగా నచ్చింది. పరిశ్రమలో వేరెవ్వరికీ ఇటువంటి పాత్రలు లేవేమో అనుకుంటాను. అమ్మ వేసిన పాత్రలలో ‘మూగమనసులు’ చిత్రంలోని గౌరి కూడా నాకు ఇష్టం. ఆ చిత్రంలో అమ్మని ముసలిగా చూడలేకపోయేదాన్ని. చిన్నప్పుడు ఈ సినిమా అమ్మతో కూర్చుని చూశాను. అమ్మ నటించిన ‘మూగనోము’ చిత్రాన్ని చూస్తూ, నాన్న ఏడ్చేవారు. నేను ఆ సినిమా చూడలేదు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’లో మహిళాశక్తి, స్త్రీ త్యాగం చూపారు. హిందీలో ‘మిలన్’, ‘మిస్ మేరీ’ సినిమాల్లో అమ్మ బాగా చేసింది. ఆధ్యాత్మిక పాత్రలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పాత్రలు, పౌరాణికాలు... ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసినది బహుశ అమ్మ ఒక్కరేనేమో. అమ్మ సినిమా జీవితంలో పడిన కష్టాలు విని ఆశ్చర్యపోయాను. అమ్మను సినిమా షూటింగ్లో ఎప్పుడూ చూడలేదు. తీసుకెళ్లేది కాదు. దసరా బొమ్మల కొలువు... అమ్మ తన బాల్యం నుంచి ఇప్పటివరకు దసరాకు బొమ్మల కొలువు పెడుతూనే ఉంది. వందేళ్లనాటి మా అమ్మమ్మ ఆడుకున్న బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. అమ్మ పెట్టే బొమ్మల అమరికలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అమ్మమ్మ... అమ్మ... నేను... మా అబ్బాయి... పరంపర కొనసాగుతోంది. ఆ సంవత్సరం గృహిణిగా... నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మని ఎన్నడూ కిచెన్‌లో చూడలేదు. ఒకసారి ఒక సంవత్సరం పాటు వంట మనిషి దొరకలేదు. దానితో ఏడాదిపాటు అమ్మ తన పనులన్నీ మానేసి, కెరీర్‌కి సెలవు పెట్టేసింది. వంటల పుస్తకాలు తెప్పించుకుని, చదివి, చేసేది. అమ్మ చేసిన వాటిలో క్యాలీఫ్లవర్ బజ్జీ, వెజిటబుల్ అగ్రెట్టా (ఇటాలియన్) నాకు బాగా ఇష్టం. ప్రతిరోజూ నా బాక్స్‌లో లంచ్ నా స్నేహితులు తీసుకుని తినేసేవారు. ఇంటికి వచ్చాక అమ్మ, ‘ఈ రోజు లంచ్ ఎలా ఉంది’ అని అడిగితే, నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని. ఆ ఏడాది అమ్మని అచ్చమైన గృహిణిగా చూశాను. వ్యక్తిత్వం నిలబెట్టుకుంది... సినిమా రంగంలో వ్యక్తిత్వం నిలబెట్టుకున్న అమ్మ దగ్గర ఎవ్వరూ వెకిలి జోకులు వేసేవారు కాదు. అలా నిలదొక్కుకోవడం చాలా కష్టమని చెప్పేది. మా అబ్బాయితో రెజ్లింగ్ చేస్తుంది. అమ్మ డైట్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇప్పటికీ మాకు ఆహారపు అలవాట్ల గురించి క్లాసు పీకుతుంది. అమ్మ నుంచి జెనెటిక్‌గా నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. అమ్మకు కోపం ఎంత త్వరగా వస్తుందో, అంత త్వరగా పోతుంది. పర్ఫెక్షన్ కోసమే అమ్మకి కోపం వస్తుంది. అన్నయ్య, నేను సినిమాలలోకి వెళ్లకపోయినా, మనవడైనా సినిమాలలోకి ప్రవేశించి, తన పేరు నిలబెట్టాలని కోరుకుంటోంది అమ్మ. – సంభాషణ:డా. వైజయంతి పురాణపండ ఫొటోలు: శివ మల్లాల గ్లాస్ పెయింటర్ని... బి.ఏ. పూర్తయ్యాక కొంతకాలం శాన్ఫ్రాన్సిస్కోలో అన్నయ్య దగ్గరున్నాను. ఆ సమయంలోనే బర్కిలీలో గ్లాస్ ఆర్ట్ మీద కోర్సు చేశాను. ఇదే నా కెరీర్ అని అర్థం చేసుకుని, పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టాను. గ్లాస్ పెయింటింగ్ వర్క్ అర్ధరాత్రి వరకు చేస్తుండేదాన్ని. చేతులు కోసుకుపోతుండేవి. నా చేతులు చూసి, అమ్మ గోరుముద్దలు తినిపించేది. నవ రసాల మీద తొమ్మిది పెయింటింగులు వేసి, ‘త్వమేవాహమ్’ పేరు పెట్టాను. ‘నిత్య విద్యార్థి’లా ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. అమ్మ తనను తాను అలాగే అనుకుంటుంది. – స్రవంతి -
ఫ్యామిలీ తోడుగా.. ప్రచారం జోరుగా..
సాక్షి, యాదాద్రి : ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు గెలుపుకోసం శక్తియుక్తులొడ్డుతున్నారు. మరోవైపు అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు, బంధుగణం ప్రచారబాట పట్టింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి ఓటు అడుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నారు. కొందరు ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా ప్రచారం చేస్తుండగా మరికొందరు వినూత్న రీతిలో దూసుకుపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల కుటుంబాలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి.జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి కుటుంబాలు రంగంలోకి దిగడంతో ప్రచారం మరింత వేడెక్కింది. అభ్యర్థుల భార్యలు, తనయులు, సోదరులు, అల్లుళ్లు ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో ప్రచారం పో టాపోటీగా సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓ టర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితారెడ్డి, కుమార్తె మాన్వితారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున భార్య కిరణ్‌జ్యోతిరెడ్డి, కుమారుడు శ్రీరామ్‌రెడ్డి, కుమార్తెలు కీర్తిరెడ్డి, స్పూర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తరఫున ఆమె భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి, అల్లుడు అక్షయ్‌రెడ్డి, కుమార్తె అంజనీరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ తరపున ఆయన సతీమణి బూడిద సువర్ణ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి సతీమణి అనురాధ, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సతీమణి అరుణ, కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి.. అభ్యర్థుల తరఫున వారి భార్యలు, కుటుంబంలో ని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టు పెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకే బయటకు వెళ్లి సాయంత్రం వరకు బృందాలుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారానికి మరో పది రోజులే మిగిలి ఉండడంతో ఎక్కడెక్కడ ప్రచారంలో చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కుటుంబసభ్యులు, బంధుగణంతో ప్రచారం మరింత వేడెక్కింది. -
శవం.. ఏడుస్తోంది!
వందల ఏళ్ల చరిత్ర.. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీ.. సుమారు లక్ష జనాభా.. అన్నింటికీ మించి రాష్ట్రమంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం.. అభివృద్ధి పనుల కోసం అడగకుండానే నిధులు విడుదల చేస్తున్న వైనం.. అయినా మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కనీసం మృతదేహాన్ని ఉంచే స్థలంలేదు.. అద్దెఇళ్లలో బతుకీడుస్తున్న నేతకార్మిక కుటుంబాలు దశాబ్దాలుగా శవాలను రోడ్డుపైనే పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.. మృతదేహాన్ని తమ ఇంటి ఎదుట వేస్తే.. అరిష్టమనే మూఢనమ్మకాలతో కొందరు ఇళ్ల యజమానుల తీరు బాధిత కుటుంబాలకు తీరని విషాదం కలిగిస్తోంది. సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రంలో మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాలే ఉన్నాయి. వీరిలో చాలామందికి సొంతిళ్లులేవు. కుటుంబలో ఎవురైనా చనిపోతే రోడ్లే దిక్కవుతున్నాయి. తరచూ తలెత్తే ఇలాంటి ఘటనల్లోంచి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రత్యేక భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయన సదాశయాన్ని ఆచరణలో పెట్టడంలో సంబంధిత శాఖ అధికారులు సఫలీకృతులు కాలేకపోతున్నారు. కార్మికక్షేత్రంలో సుమారు 8 వేల కుటుంబాలు అద్దెఇళ్లతోనే నెట్టుకు వస్తున్నాయి. మొత్తానికే ఇల్లులేని వారు కనీసం 3 వేల మంది ఉంటారని అంచనా ఉంది. ఇట్లాంటి వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు పూర్తిచేసేవరకైనా ప్రత్యేక వసతి కల్పించాలని అధికారులను కోరుతున్నారు. మరికొన్ని దయనీయ ఘటనలు.. బీవైనగర్‌కు చెందిన ఠాకూర్ రవీందర్(50) నేతకార్మికుడు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా భార్య జమున అద్దె ఇంటిని ఖాళీ చేసి తల్లిగారింటికి చేరింది. భర్తను సర్కారు ఆస్పత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయిస్తుండగా గత శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. జమున పుట్టింటి వారిక్కూడా సొంతిల్లు లేక రవీందర్ మృతదేహాన్ని తెల్లార్లూ రోడ్డుపైనే ఉంచారు. స్థానికులు చందాలు పోగేసి మరుసటి రోజు అంత్యక్రియలు జరిపించారు. నెహ్రూనగర్‌కు చెందిన దోమల రమేశ్ నేతకార్మికుడు. అప్పులు, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల గురించి చెబుతూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసి గతేడాది డిసెంబర్ ఒకటిన ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతిల్లు లేక రమేశ్ ఖర్మకాండలు చేసేందుకు కుటుంబసభ్యులు నానాయాతన అనుభవించారు. బీవైనగర్‌కు చెందిన గాజుల అంబదాస్–భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి చదువులు, ఇంటిఅవసరాల కోసం రూ.లక్షల్లో అప్పు చేశారు. వాటిని తీర్చడానికి ఇల్లు అమ్మినా సరి పోలేదు. దీంతో రెండేళ్ల క్రితం వేములవాడ గుడి చెరువులో దూకి చనిపోయారు. వారి శవాలను సైతం రోడ్డుపైనే ఉంచి మరుసటి రోజు శ్మశాన వాటికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏప్రిల్‌లో పనులుపూర్తి వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ముక్తిధామం పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. విద్యానగర్, నెహ్రూనగర్‌లో రూ.45 లక్షలు, కొత్తచెరువు ప్రాంతంలో రూ.20 లక్షలు, జేపీనగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ముక్తిధామాలు నిర్మిస్తాం. విద్యానగర్‌లోని శ్మశానవాటిక నిర్మాణం ఏప్రిల్‌లోగా పూర్తి చేయిస్తాం. – సామల పావని, మున్సిపల్ చైర్పర్సన్ శిలాఫలకానికే పరిమితం.. మానేరు శివారులో ముక్తిధామం నిర్మాణానికి 22 అక్టోబర్ 2002లో అప్పటి ఎంపీ విద్యాసాగర్‌రావు శకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన మున్సిపల్ పాలకవర్గం.. శ్మశానవాటి నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. కోర్టు కేసులు అడ్డుగా మారాయి. శ్మశానవాటిక లేకపోవడంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సత్వరమే శ్మశానవాటిక నిర్మించాలని ప్రస్తుత పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థల వివాదం సమసిపోయినా పనులు ప్రారంభంకాలేదు. ఐదు విడతలు.. రూ.2.18 కోట్లు.. పట్టణ శివారులో శ్మశానవాటికి నిర్మాణానికి నాలుగు దఫాల్లో రూ.2.18 కోట్లు మంజూరయ్యాయి. తొలివిడతలో రూ.22 లక్షల వ్య యంతో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రహరీ, మానేరువాగువైపు రిటైనింగ్‌వాల్ నిర్మించారు. మరో దఫాలో రూ.38 లక్షలు వెచ్చించి స్టోర్ రూంలు, హాల్ కట్టించారు. తర్వాత పంచా యతీరాజ్ ద్వారా రూ.54 లక్షలు కేటాయించి నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫారమ్స్, స్టోర్ రూమ్స్, టాయిలెట్స్ తదితర పనులు చేపట్టారు. నాలుగు, ఐదు విడతలో మున్సిపల్ ఆధ్వర్యంలో రూ.1.04 కోట్లు కేటాయించి అన్నదానంహాల్, ఖర్మకాండల గదులు, అదనపు గదులు, ఆరాధన క్షేత్రాలు, గ్రీనరీ, విద్యుద్దీకరణ, ఫ్లోరింగ్, ఫౌంటేన్లు, ఆర్చీల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేశారు. కానీ, పనులు నేటికీ మొదలుకాలేదు. ఇప్పటికీ పలుసార్లు కేటాయించిన నిధుల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల సుందరయ్యనగర్‌కు చెందిన నేతకార్మికుడు నాగభూషణం ఆర్థిక ఇబ్బందులు తాళలేక నవంబర్ 7న ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆస్పత్రిలో ఉన్న శవాన్ని అద్దెఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు యత్నించినా ఇంటియజమానులు నిరాకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బంధువులు.. అట్నుంచి అటే శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. సిరిసిల్ల బీవైనగర్‌కు చెందిన చిలుక నిర్మల(70) బీడీకార్మికురాలు. డిసెంబర్ ఒకటిన గుండెపోటుతో చనిపోయింది. మృతదేహాన్ని తన ఇంటిఎదుట వేయొద్దని యజమానురాలు ఆదేశించింది. చేసేదిలేక కుటుంబసభ్యులు శివనగర్ మహిళా భవన్ ఎదుట రోడ్డుపై టెంటు వేసి శవాన్ని ఉంచారు. ఆమె కూతుళ్లు లక్ష్మి, అనితకూ సొంతిళ్లులేవు.. తెల్లవార్లూ శవం వద్ద జాగరణ చేశారు.. మరుసటిరోజు స్థానికులు విరాళాలు పోగుచేసి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలపై సర్వే
పరకాల/సంగెం/జఫర్‌గఢ్ : అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల స్థితిగతులపై వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం సర్వే చేశారు. ఆయా రైతు కు టుంబాలపై సర్వే చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించింది. డాక్టర్ నాగేశ్వర్రావు, కేవీ గిరిబాబు, కె.రాంబాబు, కె.రాము, బి.కృష్ణతో కూడిన అధికార బృందం మండలంలో పర్యటించింది. వెల్లంపల్లిలో బొజ్జం కొమురయ్య, సీతారాంపురంలో పేరబోయిన సంపత్, వరి కోల్లో కొలిపాక శ్రీహరి, రాసమల్ల అంజయ్య, సంగెం మండలం కాట్రపల్లిలో చోల్లేటి సుద¯ŒSరెడ్డి, పల్లారుగూడ గ్రామంలో పోడేటి ఐలయ్య కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఇంటి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అం దిస్తామని తెలిపారు. వారితో పరకాల ఇ¯ŒSచార్జి జేడీఏ ఎగ్గిడి నాగరాజు, ఏఈవో అనిల్‌కుమార్, విశాఖపట్టణం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ సభ్యులు డాక్టర్ ఎం.నాగేశ్వర్రావు, డాక్టర్ కేవీ.గిరి, డాక్టర్ కె.రాంబాబు, డాక్టర్ పి.రాము, డాక్టర్ బి.క్రిష్ణ, జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీరూనాయక్, ఏఓ ఆర్.వేణుగోపాల్ పాల్గొన్నారు. -
డెంగీ బాధితులను ఆదుకుంటాం
ముచ్చింతాల (పెనుగంచిప్రోలు) : డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు అనిల్‌కుమార్, సుష్మలకు సూచించారు. డీఎంహెచ్‌వో నామల్లేశ్వరి కూడా గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, తహసీల్దార్ కె నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గింజుపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందాల లోగిళ్లు
ఆనందాల లోగిళ్లు పల్లెల వాకిళ్లలో ఆనందాల రంగవల్లులు కళకళలాడుతున్నాయి. సంబరాల భోగి మంటలు అనుబంధాల వెచ్చదనాన్ని పంచి ఇస్తున్నాయి. గొబ్బిళ్లలో విరిసిన బంతి పూలు చిన్నారుల దరహాసాల్లా కాంతులీనుతున్నాయి. కుటుంబాలతో తరలివచ్చిన కొడుకులు, కూతుళ్ల కోలాహలాన్ని తిలకించిన తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాల సిరులు రాశుల్లా వెల్లివిరుస్తున్నాయి. పలకరింపులు, పరాచకాలు, పరవశాలతో పల్లెల్లో వీధివీధీ ప్రతిధ్వనిస్తున్నాయి. గంభీరంగా తల ఊచే గంగిరెద్దు ఆశీస్సులతో ఇళ్లన్నీ ఆనందాల లోగిళ్లుగా అవతరిస్తున్నాయి. కొలువుతీరిన ‘అగ్రహారం’ కె.కోటపాడు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో ఆర్.వై.అగ్రహారంలో పలు కుటుంబాలు కలిసిమెలసి ఉంటున్నాయి. రాన్రాను ఇక్కడి కుటుంబాల్లో వారు ఉన్నత ఉద్యోగాల పేరిట హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా పై ప్రాంతాల్లో ఉన్న వీరంతా సంక్రాంతి పండుగకు రెండ్రోజులు ముందుగానే గ్రామానికి చేరుకొని పండగను ఘనంగా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్.వై.అగ్రహారంలోని నేమాని వెంకటేశ్వరశర్మ, మండ మల్లికార్జునరావు, రమణమూర్తి కుటుంబసభ్యులు గ్రామానికి చేరుకోవడంతో ఈ కుటుంబాల బంధుగణమంతా ఒకేచోటకు చేరుకొని కబుర్లుతో మునిగితేలారు. కుటుంబ పెద్ద నేమాని వెంకటేశ్వరశర్మ ఆనందం ఆయన మాటల్లోనే... ‘నా కుమారుడు మల్లిఖార్జున్‌కు ఇటీవలే వివాహం అయ్యింది. వీరు కువైట్‌లో ఉంటున్నారు. పండగ సందర్భంగా ఇంటికి రావడం చెప్పలేని ఆనందం కలిగించింది. ఇంటిల్లిపాదికి వస్త్రాలను విజయనగరం నుంచి కొనుగోలు చేసి తేవడం జరిగింది. మా బావ గారు వివి రమణమూర్తి విశాఖపట్నంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నాం. పిల్లలు పెద్దలు సందడిగాా తిరుగుతూ ఉంటే మాకు నిజమైన పండుగ. పల్లెలో సంక్రాంతి పండుగ సంప్రదాయబద్దంగా ఉంటుంది. అందుకే ఏటా ఇక్కడే మాకు పండగ...’ అని వివరించారు శర్మ. దరి చేర్చిన అనుబంధం చోడవరం టౌన్, న్యూస్‌లైన్ : పొట్ట చేత పట్టుకుని దేశాలు దాటినా అనుబంధాలు మాత్రం వీడిపోవు....ఏళ్లయినా...దశాబ్దాలైనా రక్త సంబంధం గుండె తలుపు తడుతుంది. పండగకు రమ్మంటుంది.... ఆత్మీయత కురిపిస్తుంది...దీనికి ఈ కుటుంబమే నిదర్శనం. ‘సంక్రాంతి పండుగ అంటేనే మా ఇంట్లో సందడి నెలకొంటుంది. చోడవరం ఎప్పుడు వస్తామా అని ఒక్కటే సరదా.... 20 ఏళ్ల క్రితం అస్సాంలో స్థిరపడ్డాం... అప్పట్నుంచీ ప్రతి ఏటా సంక్రాం తికి కుటుంబంతో సహా సంక్రాంతికి వస్తాం... బంధువులందరినీ కలుసుకొని పండుగ అనంతరం తిరిగి అస్సాం వెళ్లిపోతాం...’ అంటూ పాతాళం చిలకమ్మ, ఆమె పెద్ద కుమారుడు పాతాళం రాము, చిన్న కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. చోడవరంలోని కో ఆపరేటివ్ కాలనీకి చెందిన పాతాళం దుర్గాప్రసాద్ ఇంట్లో బంధువులు సందడి చేశారు. ఉద్యోగరీత్యా రాము ఇండియన్ టుబాకో కంపెనీలోను, శ్రీనివాస్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలోను ఉంటున్నారు. వీరంతా భార్యాపిల్లలతో ప్రతి ఏటా తన తమ్ముడు దుర్గాప్రసాద్ ఇంటికి సంక్రాంతి పండగకు వచ్చి ఆనందం, ఆత్మీయతలు పంచుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇంట సంక్రాంతి సందడి చేస్తోంది. సొంతూరులోనే సంక్రాంతి పాడేరు, న్యూస్‌లైన్ : పొట్ట చేత పట్టుకుని వలసపోయినా...సొంతూరులో సంక్రాంతి పండగను మాత్రం వారు మరిచిపోలేదు. పేద కుటుంబమైనా ఏటా ఈ పెద్ద పండగను ఘనంగా జరుపుకొంటారు. పండగ మూడు రోజులూ గ్రామంలో సరదాగా గడిపి తిరిగి కూలికెళ్లిపోతారు. ఏటా ఈ పండగ తమ బతుకుల్లో కొత్త వెలుగు నింపుతుందని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు...గన్నేరుపుట్టు గ్రామానికి చెందిన మఠం బొంజుబాబు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ‘సొంతూరులో పండగ చేసుకోవడం నాకెంతో సంతోషం. భార్య, కొడుకులు, కోడలు, మనవరాళ్లతో కలిసి గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కొల్లిపొర గ్రామానికి వలస పోయాను. అక్కడ కోళ్లుఫారంలో కుటుంబమంతా పనిచేస్తున్నాం. సంక్రాంతి పండగతో సొంతూరైన గన్నేరు పుట్టు వచ్చాం. పేద కుటుంబమైనప్పటికీ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. బంధువులకు కూడా స్థోమతకు తగ్గట్టూ కొత్త బట్టలు తీశాం. మా కుటుంబం పండగకి గ్రామానికి రావడంతో సాటి గిరిజనులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు..మేం కూడా మిగతా బంధువులందరిని ఇంటికి పిలిచి సంక్రాంతికి కడుపునిండా భోజనం పెడతాం. పండగ రోజులు వారితోనే సరదాగా గడుపుతాం. అందరూ కలిస్తే...చిన్ననాటి ముచ్చట్లే అనకాపల్లి, న్యూస్‌లైన్ : ఆ ఇంట కుటుంబమంతా కలిస్తే పండగే. అందులోనూ పెద్ద పండగ వస్తే...చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకుంటారు... ‘మా చిన్నప్పుడు సంక్రాంతి వస్తే...ఓహో... హరిదాసులు, తప్పెటగుళ్లు, తీర్థాలు’ అని నెమరవేసుకుంటూ రిటైర్డ్ తెలుగు లెక్చరర్ కొట్టె కోటారావు తన కుటుంబీకులకు సంక్రాంతి పర్వదినాన్ని నేపధ్యాన్ని వివరించారు. పెద్ద పండగ నేపథ్యంలో ఆ ఇంట తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పిల్లాపాప, పెద్దలు నవ్వులు చిందించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఎస్బీఐ క్వార్టర్స్‌లో నివసిస్తున్న కోటారావు ఏఎంఏఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తునికి సమీపంలోని తేటగుంట పరిధిలోని తిమ్మాపురం వాసియైన కోటారావు తన చిన్నప్పుడు సంక్రాంతి వస్తే వారం రోజుల ముందు నుంచే హడావుడి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఒరిస్సా సరిహద్దులోని ఒనకఢిల్లీ వద్ద తెలుగు మాస్టార్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు రాజేష్ స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలోపనిచేస్తున్నారు. అల్లుడు కొవ్వూరులో తెలుగు మాస్టార్‌గా పనిచేస్తున్నారు. వీరంతా పండగకు ఒక్కచోట చేరారు. కోటారావు దంపతులు, కుమారులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, సోదరి, మనుమడు, మనుమరాలితో సంక్రాంతి కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోయారు. పండగనాడు దేవాలయానికి, కాసింత సేదదీరేందుకు పార్కుకు వెళతామని కోటారావు చెబుతూ వారి సంక్రాంతిలో ఎలా గడుపుతారో వివరించారు. జవాను ఇంట వేడుక తగరపువలస రూరల్, న్యూస్‌లైన్ : ‘సంక్రాంతి పండగ మాకు వెలుగు నింపడానికి కారణం మా అబ్బాయి బాలు. ఆర్మీ నుండి సెలవులపై ఇంటికి రావడంతోనే మా ఇంటికి కళ వచ్చింది... ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నాం...’ అంటున్నారు.. భీమునిపట్నం రూరల్ మండలం పాత మూలకుద్దుకి చెందిన ఓ ఆర్మీ ఉద్యోగి బాలు కుటుంబ సభ్యులు బోర రమణమ్మ, సంతోషి. బాలు ఆరు నెలలు క్రితం ఉద్యోగానికి వెళ్లాడు. పండగకి సెలవులో వస్తాడనుకోలేదు...అతను ఆదివారం రావడంతోనే మా ఇంటికి కళ వచ్చింది. పండగ సందడి, పిండి వంటలు ప్రారంభమయ్యాయి...బాలు లేకపోతే అన్నీ ఉన్నా పండగ సందడి మాత్రం ఉండేది కాదు...అని ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు ప్రస్తుతం సెలువు దొరుకుతుంది అనుకోలేదు....దేవుడి దయ వల్ల సెలవు దొరికింది...నా కుటుంబ సభ్యుల ఆనందం కోసమే ఈ పండగకు సెలవుమీద వచ్చాననని ఆర్మీ ఉద్యోగి బాలు తెలిపారు. బాంధవ్యాలు బలపడేలా... ఎస్.రాయవరం, న్యూస్‌లైన్ : పండగంటే ఇళ్లంతా బంధువులతో కళకళలాడాలి. ఏడాదికొక్కసారైనా కుటుంబ సభ్యులంతా కలుసుకోవాలి..అందుకే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఒక్కొక్కరుగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.. గుడివాడలో ఒక కుటుంబం ఇలా పండక్కి సొంతింట్లో గడిపేందుకు వచ్చారు. పేరిచర్ల సత్యనారాయణరాజు దాదాపు ఎనిమిదేళ్లక్రితం విజయవాడలో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. అతని తమ్ముడు విశాఖలో వ్యాపారం చే స్తూ అక్కడే ఉంటున్నాడు... తమ సొంతూరు గుడివాడలో అమ్మనాన్న ఉంటున్నారు...ఇలా కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా...పెద్ద పండగకు మాత్రం ఒక్కచోట చేరతారు. అమ్మానాన్నల దగ్గరికి వస్తేనే వారికి పండగ. ‘మిగతా పండగల్లో మాత్రం ఎవరికి వీలుంటే వారు వచ్చి అమ్మనాన్నలను పలకరించి వెళ్తుంటాం...సంక్రాంతినాడు మాత్రం అందరం కలుసుకుంటాం. పిల్లలంతా ఆటపాటలతో మునిగితేలడం, కుటుంబమంతా ఒకే చోట కలసి భోజనాలు చేయడం, ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకోవడం చూస్తే అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. అంటూ తమ పండగ విశేషాలు చెప్పుకొచ్చారు సత్యనారాయణరాజు. కలసిమెలసి ఉంటే ఇంటింటా సంక్రాంతి నక్కపల్లి/నక్కపల్లిరూరల్,న్యూస్‌లైన్: ‘సొంతూరు కన్నతల్లిలాంటిదంటారు...ఎంతబిజీగా ఉన్నా, ఎన్ని వ్యాపకాలున్నా సంక్రాంతికి మాత్రం అందరం ఇక్కడ కలుసుకోవాల్సిందే...అని చినదొడ్డిగల్లుకు చెందిన బండారు గోవిందరావు తమ కుటుంబంలో సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. పెద్ద పండగ తమ కుటుంబంలో అనుబంధాలను ఎలా పెనవేస్తుందో తెలిపారు. ‘మా తల్లిదండ్రులకు ఇద్దరు మగ, ఇద్దరు ఆడ సంతానం. అన్నయ్య నర్సీపట్నంలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాను, తోబుట్టువులకు పెళ్లిళ్లు చేశాం.. ఒక అక్క ఈ వూర్లోనే ఉంటోంది. మరోసోదరి విశాఖలో ఉంటోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. బెంగళూరులో స్థిరపడినా ఈ వూళ్లో సొంతిల్లు నిర్మించుకున్నాను. ప్రతి సంక్రాంతికి నేను, భార్య, పిల్లలు , చినదొడ్డిగల్లు వస్తాం, మాతోపాటు మా అత్త,మామగారిని మా సొంతవూరుకు ఆహ్వానిస్తాం. సంక్రాంతికి మూడురోజులు ముందుగానే చేరుకుంటాం. అన్నయ్య, వదిన పిల్లలు సాయంత్రానికి చేరుకుంటారు...రక్తసంబంధీకులతోపాటు, బందువులు,స్నేహితులతో ఉల్లాసంగా గడిపి పండగ అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీఅవుతాం. అందుకే మిగతా పండగలకు పెద్దగా రాకపోయినా సంక్రాంతికి మాత్రం కచ్చితంగా అందరం కలుసుకోవాల్సిందే...’ అంటూ ఆనందంగా వివరించారు. పుట్టిల్లు పిలిచింది... రోలుగుంట, న్యూస్‌లైన్ : కలిసి చదువుకున్నారు...కలిసిమెలిసి పెరిగారు...పెళ్లిళ్లై అత్తారిళ్లకు వెళ్లారు..కన్నవాళ్లకు, కన్న ఊ రికి దూరమయ్యారు. కానీ ఆ అనుబం ధం విడిపోలేదు...ఏటా పుట్టింటి తలుపుతడుతుంది....ఆనందం పంచుకుంటుం ది. నేస్తాలను పలకరిస్తుంది. ఆ ఆనందానికి నిదర్శనమే ఈ స్నేహితులు, గ్రామానికి చెందిన పి.రోజాకుమారి విశాఖజిల్లా సబ్బవరంలోను, మావూరి తులసి విజయనగరంలోను, జి.మణి తూర్పు గోదావరి జిల్లా తునివలస లో, ఎస్.రామలక్ష్మి హైదరాబాద్‌లోను వివాహాలు చేసుకొని అక్కడ ఉంటున్నారు. వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామం వచ్చారు. అందరూ కలిసి స్థానిక శ్రీ విజ్ఞాన్ కాన్వెంట్ వద్దకు వచ్చి కలుసుకున్నారు...చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు...ప్రతి సంక్రాంతి ఇలాగే ఆనందం పంచాలని, ఏడాదికొక్కసారైనా ఇలా కలుసుకోవాలని కోరుకున్నారు. ఆనందం తలుపుతట్టిన వేళ... నర్సీపట్నం/గొలుగొండ, న్యూస్‌లైన్ : ఎక్కడెక్కడో పట్టణాల్లో జీవి స్తున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఒక్కసారే కలిసేది పెద్ద పండగకే.. పండగ మూడు రోజులూ ఇళ్లంతా సందడితో ఆనందంగా గడపడం ఆనవాయితీ... మనుమలు, మనుమరాళ్లతో తాతలు ఆడి పాడుకునే సరదా పండగ ఈ సంక్రాంతి... అందుకే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు ప్రీతైన పండగ ఇది... కుటుంబమంతా కలిసేది ఇప్పుడే సంక్రాంతి పండగ కుటుంబ సభ్యు లు, బంధుమిత్రులతో ఆనందంగా గడుస్తుంది. ప్రతి ఏటా కూతు రు, అల్లుడు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు వస్తారు. పండగ మూడు రోజులు సందడిగా ఉంటుంది. వివిధ రకాలైన పిండి వంటలు చేసి ఆనందంగా గడుపుతాం. ప్రతి ఏటా అందరూ ఒకేసారి కలిసేది ఈ పండక్కే. మూడు రోజులూ మనుమలు, మనుమరాళ్లతో కలిసి పట్టణంలో జరిగే తీర్థాలకు వెళతాను. అయ్యప్పస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమాలను కుటుం బమంతా కలిసి వీక్షించి సంతోషంగా గడుపుతాం. -పసుపులేటి విలాసకుమారి, బీసీ కాలనీ, నర్సీపట్నం సందడంతా మనవళ్లతోనే నాకు ఇద్దరు కుమారులు. నా కొడుకు, కూతుళ్లు, మనవళ్లతో పాటు చెల్లెల పిల్లలు అంతా కలిసి భోగి ముందు రోజుకే చేరుకుంటారు. కుటంబ మంతా కలిసి మూడు రోజుల పాటు జరిగే భజన కార్యక్రమాల్లో పాల్గొంటాం. గ్రామంలో జరిగే తీర్థానికి అంతా కలిసి వెళ్లి పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులను కొని వారికిస్తుంటాను. వారి ఆనందం చెప్పనలవి కాదు...ఈ పండగ సందడంతా పిల్లలతోనే. -సుర్ల అచ్చియ్యనాయుడు చీడిగుమ్మల, గొలుగొండ