fan dies
-
అభిమానికి స్టార్ హీరో అశ్రు నివాళి
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ శింబు(శిలంబరసన్) హిట్ కొట్టి దశాబ్దంపైనే అవుతోంది. అయినా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా ఆ అభిమానులే ఆయనకు అండగా నిలిచారు. అలాంటి ఫ్యాన్స్ కోసం శింబు కూడా అదే స్థాయిలో స్పందిస్తుంటాడు. ఆర్థికంగా ఎందరినో ఇప్పటికే ఆదుకున్నాడు కూడా. తాజాగా మరో అభిమాని కోసం శింబు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. టీనగర్‌కు చెందిన మదన్ అనే వ్యక్తి పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మదన్ ఎస్టీఆర్(శింబు) ఫ్యాన్ క్లబ్ కార్యదర్శి. బీప్ సాంగ్ వివాద సమయంలో మదన్ శింబుకు మద్ధతుగా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడిపాడు కూడా. అలాంటి మదన్ మృతి చెందంటంతో శింబు చలించిపోయాడు. అయితే ఆ సమయంలో దుబాయ్‌లో షూటింగ్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. తిరిగొచ్చాక ఆశ్రునివాళి పేరిట పోస్టర్లను రూపొందించి నగరంలో మొత్తం అంటించాలని ఫ్యాన్స్ అసోషియేషన్‌కు సూచించాడు. అంతేకాదు తానే స్వయంగా ఆ కార్యక్రమంలో శింబు పాల్గొన్నాడు. మదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, వారికి చేతనైనంత సాయం అందిస్తానని శింబు మీడియాకు తెలిపాడు. -
రోడ్డు ప్రమాదంలో పవన్ అభిమాని దుర్మరణం
నార్పల : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అభిమాని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూగూడుకు చెందిన దాసరి సూరి (28) గురువారం సాయంత్రం అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభకు వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. నరసాపురం మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సూరి రోడ్డు పక్కన గుంతలోకి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వ్యవసాయ కూలీలు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
భీమవరం బుల్లోడు ఆడియో వేడుకలో అభిమాని మృతి