fare changes
-
వందే భారత్: సికింద్రాబాద్ టూ విశాఖ.. పలు స్టేషన్ల ఛార్జీల వివరాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సంక్రాంతి రోజున ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనుండగా, సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తొలి పరుగు ప్రారంభించనుంది. సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి 697 కి.మీ. (రైలు మార్గం) దూరంలో ఉన్న విశాఖకు చేరుకునేందుకు ప్రస్తుతం మిగతా సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సగటున 12 గంటలు పడుతోంది. కానీ వందేభారత్ వాటి కంటే మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల ముందే చేరుకునేలా పరుగుపెట్టనుంది. జనవరి 15న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదే ఇక, సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వందే భారత్ రైలుకు శనివారం నుంచే ఐఆర్సీటీసీలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఛార్జీలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ టు వరంగల్ - 520/- సికింద్రాబాద్ టు ఖమ్మం - 750/- సికింద్రాబాద్ టు విజయవాడ - 905/- సికింద్రాబాద్ టు రాజమండ్రి - 1365/- సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 1665/-(CC) సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 3120/-(EC). గుర్తుకొచ్చేది వేగమే... వందే భారత్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దాని వేగమే. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అయితే, దాని వేగం అధికంగానే ఉన్నా, అంత వేగాన్ని తట్టుకునే ట్రాక్ సామర్థ్యం మనకు లేదు. ఈ మార్గంలో రైళ్ల గరిష్టవేగ పరిమితి 130 కి.మీ. మాత్రమే ఉంది. కానీ గరిష్ట పరిమితితో కాకుండా వందేభారత్ రైలు సగటున 90–100 కి.మీ. వేగంతోనే పరుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇతర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల సగటు గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. మాత్రమే ఉంది. -
ప్రైవేట్ రైళ్లలో చార్జీలపై పరిమితి లేదు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ చార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చార్జీలపై నిర్ణయం ప్రైవేట్ సంస్థలదేనని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లను 35 ఏళ్లపాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల విషయంలో ప్రైవేట్ బిడ్డర్లు పలు సందేహాలు లేవనెత్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ప్రైవేట్ సంస్థలే చార్జీలను నిర్ధారించవచ్చని తాజాగా రైల్వే శాఖ తెలియజేసింది. రైల్వేస్ యాక్ట్ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లేదా పార్లమెంట్ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా రైలు చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి. ప్రైవేట్ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ చార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలు సొంతంగానే తమ వెబ్సైట్ల ద్వారా రైల్ టికెట్లు అమ్ముకోవచ్చు. కానీ, ఈ వెబ్సైట్లను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ఈ–ఆఫీస్ జోరు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ 4 నెలలుగా ఈ–ఆఫీస్‌కు పెద్దపీట వేస్తోంది. పత్రాలు, ఫైళ్లను డిజిటల్ రూపంలోకి మార్చేసి, ఆన్లైన్లోనే పంపించింది. లేఖలు, బిల్లులు, ఆఫీస్ ఆర్డర్లు వంటి 12 లక్షలకు పైగా డాక్యుమెంట్లను, మరో 4 లక్షల ఫైళ్లకు డిజిటల్ రూపం కల్పించారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రైల్వే శాఖ ఆన్లైన్లో 4.5 లక్షల ఈ–రసీదులు జారీ చేయగా, 2020లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 16.5 లక్షల ఈ–రసీదులను జారీ చేసింది. ఈ–ఫైళ్ల సంఖ్య 1.3 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగింది. -
రైల్వేలో పట్టాలెక్కబోతున్న మరో సంస్కరణ
రైల్వేలో మరో రెండో అతిపెద్ద సంస్కరణ పట్టాలెక్కబోతోంది. 92 ఏళ్ల సంస్కృతికి చరమగీతం పాడుతూ రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రప్రభుత్వం, చార్జీల మార్పునకు ప్రత్యేక ఏజెన్సీ నియమించాలని యోచిస్తోంది. చార్జీల ప్రతిపాదనకు ఓ స్వతంత్ర ఏజెన్సీ నియమించాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కేబినెట్‌ను ప్రతిపాదించనున్నారట. చైర్మన్‌తో కూడిన నలుగురు సభ్యుల డెవలప్మెంట్ అథారిటీని నియమించాలని రైల్వే ప్రతిపాదించింది. మంత్రి ఆమోదంతో ఈ వారంలోనే ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు రాబోతుందట. వచ్చే వారంలోనే కేబినెట్ దీన్ని ఆమోదించబోతుందని తెలుస్తోంది. దీంతో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద సంస్కరణ కాబోతుంది. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే శాఖ వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను, నీతి ఆయోగ్ కామెంట్లను కూడా స్వీకరించింది. ప్రయాణికులకు అందిస్తున్న సబ్సిడీలతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరున్న రైల్వేలు రూ.33,000 కోట్ల నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ అధికారులతో సురేష్ ప్రభు చర్చించారు. వారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. మార్కెట్ డిమాండ్ బట్టి చార్జీల హేతుబద్దీకరణ చేపట్టనున్నట్టు రైల్వే తెలుపుతోంది.