‘ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయాలి’
న్యూఢిల్లీ: అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును మహిళా న్యాయవాది ఫర్హా ఫయిజ్ అభ్యర్థించారు. ఏఐఎంపీఎల్బీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళల హక్కులను కాలరాస్తోందని, ఇస్లోమోఫోబియాను వ్యాపింప చేస్తోందని పేర్కొన్నారు. ఛాందవాదుల నుంచి భారత ముస్లింలను కాపాడాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
లింగ సమానత్వం కోసం పోరాడుతున్న ఫర్హా ఫయిజ్.. ట్రిఫుల్ తలాఖ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘రాజ్యాంగం అందరికీ గౌరవప్రదమైన స్థానం కల్పించింది. కానీ ముస్లిం మహిళలు హింస ఎదుర్కొంటూ అభద్రతా జీవితం గడుపుతున్నారు. మతం పేరుతో షరియా కోర్టులు సమాంతర న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. షరియా కోర్టులను రద్దు చేయాల్సిన అవసరముంద’ని ఫర్హా ఫయిజ్ వాదించారు.