హైదరాబాద్ @ 1 జీబీపీఎస్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు మహానగరం వేదిక కానుంది. 1 జీబీపీఎస్ ఫైబర్ నెట్ కనెక్షన్‌ను దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ రోజు ఐటీ మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా డేటాను వినియోగిస్తోంది నగరవాసులే.
ఇప్పటి వరకు హాంకాంగ్, సియోల్, సింగపూర్‌లాంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది. 1 గిగా స్పీడ్ కనెక్షన్ తీసుకుంటే దానికి కనెక్ట్ అయ్యే అన్ని డివైజులు ఒకే స్పీడ్‌తో పనిచేస్తాయి. సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం అధికార నివాసాలకు వన్ గిగా స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు.