Fast track
-
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
కాళేశ్వరానికి మెగా పవర్
సాక్షి, హైదరాబాద్ : వచ్చే వానాకాల సీజన్‌కు నీరందించే లక్ష్యంతో సిద్ధం చేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా పనులు ఊపందుకున్నాయి. ఏప్రిల్ నెలాఖరుకు విద్యుత్ అందించేలా సబ్స్టేషన్ల నిర్మాణం, ప్రత్యేక లైన్ల ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రాజెక్టుకు మొత్తంగా 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. ఇందులో మేడిగడ్డ నుంచి సుందిళ్ల పంప్ హౌజ్‌కు నీరు తరలించడానికి 1,120 మెగావాట్ల అవసరమవనుంది. ఈ విద్యుత్‌ను మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి పవర్‌ప్లాంట్ ద్వారా అందించేందుకు రూ.486 కోట్లతో పనులు చేపట్టారు. అన్ని పనులూ సమాంతరంగా.. కాళేశ్వరం ద్వారా ఖరీఫ్ నాటికి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీరు ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో 5.81 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. 80 శాతం సిమెంట్, కాంక్రీటు పనులూ పూర్తయ్యాయి. అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 86, సుందిళ్లకు 74 గేట్లు అమర్చాల్సి ఉండగా శనివారం అన్నారం బ్యారేజీకి తొలి గేటు బిగించారు. జూన్ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తి చేసేలా వేగం పెంచారు. పంప్‌హౌజ్‌లకు అవసరమైన యం త్రాల రవాణా జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలైంది. మరో 10 రోజుల్లో ఇవి దిగుమతి కానున్నాయి. వీటిని అమర్చేలోగా మోటార్ల డ్రై రన్, ట్రయల్ రన్ల నిర్వహణకు వీలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థ సిద్ధం చేయాలి. విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మేడిగడ్డ–సుందిళ్లకు తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ఎత్తిపోతలకు మొత్తంగా 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరముంది. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ నుంచి సుందిళ్ల పంప్ హౌజ్‌ల పరిధిలోనే 1,120 మెగావాట్లు అవసరం. ఈ నేపథ్యంలో తొలి లింక్‌గా ఉన్న మేడిగడ్డ–సుందిళ్ల మధ్య విద్యుత్ సరఫరాకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి పంప్ హౌజ్ వరకు 80 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల ఏర్పాటు జరుగుతోంది. పంప్ హౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యంతో 11 మోటార్లకు 440 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ఇందుకుగాను 220/11 కె.వి. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు 80 శాతం, విద్యుత్ లైన్ పనులు 40 శాతం పూర్తయ్యాయి. రూ.180.56 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయి. అన్నారం పంప్ హౌజ్‌కు 40 మెగావాట్ల సామర్థ్యమున్న 8 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 320 మెగావాట్ల విద్యుత్ అవసరముంది. ఇక్కడ 220/11 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు 80 శాతం, విద్యుత్ లైను పనులు 45 శాతం పూర్తయ్యాయి. ఈ పనులను రూ. 99.48 కోట్లతో చేపట్టారు. సుందిళ్ల పంప్ హౌజ్ కోసం జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి 6 కిలోమీటర్ల మేర విద్యుత్ లైను పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థ్యంతో 9 మోటార్లకు గాను 360 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ఇందుకు 220/11 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. రూ. 205.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు 60 శాతం పూర్తయ్యాయి. అంతరాయం లేకుండా.. వచ్చే నెలాఖరుకు విద్యుత్ సరఫరా వ్యవస్థను సిద్ధం చేసేలా ట్రాన్స్‌కో పనులు చేస్తోంది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు అంతరాయం లేకుండా ఒకే కేంద్రం నుంచి కాకుండా వేర్వేరు జనరేషన్ స్టేషన్ల ద్వారా విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంతో దక్షిణాది రాష్ట్రాలతో విద్యుత్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి విద్యుత్ గ్రిడ్ అనుసంధానం పూర్తయ్యే దృష్ట్యా ప్రాజెక్టు విద్యుత్ సరఫరాకు ఢోకా ఉండదని ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. -
బ్యాంకింగ్‌లో ఇక విలీనాల జోరు..!
♦ మొండిబకాయిల పరిష్కార వ్యూహమే కారణం... ♦ బలహీన బ్యాంకులకు ప్రొవిజనింగ్ కష్టాలు ♦ పెద్ద బ్యాంకుల్లో విలీనమవ్వక తప్పని పరిస్థితి ♦ పరిశీలకుల అంచనాలు న్యూఢిల్లీ: భారీ మొండి బకాయిల సమస్యను సత్వరం పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు .. దేశీ బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. బలహీన బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్ నిబంధనల కారణంగా మరింతగా నష్టాలు మూటగట్టుకునే ముప్పు ఉందని, చివరికి పెద్ద బ్యాంకుల్లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబకాయిల్లో సింహభాగం 40–50 ఖాతాలకే పరిమితం కావడంతో ముందుగా వాటిని సత్వరం 6–9 నెలల్లో పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు మూలధనం కొరతతో సతమతమవుతుంటే మరోవైపు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన బాకీలను రాబట్టుకోవాల్సి రావడం చిన్న బ్యాంకులకు తలకు మించిన భారంగా మారనుంది. ఒకవేళ బ్యాంకులు మొండిబాకీలకు ప్రతిగా కనీసం 40 శాతం మేర ప్రొవిజనింగ్ చేసినా బ్యాంకింగ్ వ్యవస్థకు రూ. 70,000 కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని అంచనా. సమస్యాత్మక రుణ ఖాతాల్లో 60 శాతం మేర మొత్తాన్ని రైట్ డౌన్ చేస్తే మొత్తం మూలధన అవసరాలు రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉండగలవని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పార్ట్నర్ అబిజర్ దీవాన్‌జీ పేర్కొన్నారు. చాలా మటుకు కేసుల్లో ఇదే జరిగే అవకాశముందని తెలిపారు. ఇదే జరిగితే చిన్న బ్యాంకులు మరింతగా నష్టపోక తప్పదని, కన్సాలిడేషన్ ఒక్కటే వాటికి మిగిలే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం కష్టమే .. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు సత్వర ఫలితాలు ఇవ్వలేకపోవచ్చని మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకరేజి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కార్పొరేట్ల ఆదాయాలు .. లాభదాయకత అంతంత మాత్రంగానే ఉండటం, బ్యాంకులకు ప్రభుత్వం నుంచి మరింతగా మూలధనం లభించకపోవడం వంటి పరిణామాలతో ఫాస్ట్ ట్రాక్‌లో ఎన్పీఏల పరిష్కారం కుదరకపోవచ్చని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకి రుణాలిచ్చిన బ్యాంకులకన్నా రిటైల్ రుణాల బ్యాంకులే మెరుగ్గా ఉండొచ్చని తెలిపింది. అటు మోతీలాల్ ఓస్వాల్ సైతం బాకీల పరిష్కార చర్యలు సానుకూలమైనవే అయినప్పటికీ అమలు కావడంలో జాప్యం జరగొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలైన వాటిపై బులిష్‌గా ఉన్నట్లు తెలిపింది. ఏడాదిలో తేలిపోతుంది.. ఓవైపు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాకపోగా.. మరోవైపు మార్కెట్ నుంచి తమంత తాముగా సమీకరించుకోలేకపోయే బ్యాంకులకు పరిస్థితి కష్టంగానే ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆయా బ్యాంకులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించలేని విధంగా పరిమితులు అమల్లోకి వస్తాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా చిన్న బ్యాంకులను.. పటిష్టంగా ఉన్న బ్యాంకుల్లో విలీనం చేసేందుకు దారితీయనున్నాయి. మరోవైపు ఏ బ్యాంకులను స్వతంత్రంగా కొనసాగనివ్వొచ్చు, ఏది ఎందులో విలీనం చేయొచ్చు అన్న దానిపై ప్రభుత్వానికి అవగాహన రావడానికి కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం ఉపయోగపడగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అభిషేక్ భట్టాచార్య తెలిపారు. మొత్తం మీద మొండి బాకీల సమస్య పరిష్కార వ్యూహంతో బైటపడే బ్యాంకులేవీ, నిలబడలేనివేవి అన్నది వచ్చే ఏడాది వ్యవధిలో తేలిపోనుంది. బలహీనంగా ఉన్న వాటిని పటిష్టంగా ఉన్న వాటిలో విలీనం చేయడం వల్ల అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రయోజనం చేకూరగలదని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్ అశ్విన్ పరేఖ్ తెలిపారు. ఈ తరహా విలీనాల విషయంలో ఎదురయ్యే పరిణామాల గురించి ... ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా కేంద్రం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. దీంతో భవిష్యత్‌లో పెద్దగా వ్యతిరేకత లేకుండా ఇలాంటి విలీనాలకు మార్గం సుగమం కావొచ్చన్న అభిప్రాయం నెలకొంది. -
ప్రైవేట్ కంపెనీలకు ఊరట
ఫాస్ట్ ట్రాక్... కొత్త కంపెనీల చట్టానికి త్వరలో సవరణలు న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలపై పాలనా సంబంధ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో దాదాపు 13 సడలింపులను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. షేర్ క్యాపిటల్, ఓటింగ్ హక్కులు, ఆడిటర్, డెరైక్టర్ల నియామకం, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణపై నిషేధం, బోర్డు హక్కులు, డెరైక్టర్లకు రుణాలు, ఉన్నత యాజ మాన్య స్థాయి సిబ్బంది నియామకాలపై పరిమితుల నిబంధనలను సడలించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజలు తమ సూచనలు, వ్యాఖ్యానాలను జూలై 1లోగా పంపాలనీ, తర్వాత నోటిఫికేషన్‌ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతామని ఆ శాఖ ఓ సర్క్యులర్‌లో తెలిపింది. -
అర్హులైన పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పోలీసులలో అర్హులైన వారికి ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను కల్పించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేస్తూనే... దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో ఇస్తున్న పదోన్నతుల పద్ధతిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఎస్ఐలకు గెజిటెడ్ హోదాను కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. పోలీసులకు ప్రత్యేక పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పోలీసు సంఘానికి చెందిన ప్రతి జిల్లా అధ్యక్షుడిని లైజాన్ ఆఫీసర్‌గా గుర్తిస్తామని, తమ జిల్లాల సమస్యలను వీరు నేరుగా తనతో చర్చించవచ్చని చెప్పారు. విభజన ఉద్యమాల సందర్భంగా పోలీసులు నిర్వహించిన పాత్ర ఎనలేనిదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ కొనియాడారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే అత్యుత్తమ పోలీసు శాఖగా పేరుందని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నామని పోలీసు సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి సిబ్బంది సంక్షేమంపై డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని డీజీపీకి అందచేశారు. -
తీరనున్న పోలీస్ కానిస్టేబుళ్ల కష్టాలు