Fatima Students
-
ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డాని గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యం తప్పు వల్ల అడ్మిషన్లు కోల్పోయి రోడ్డున పడ్డ 100 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని జేపీ నడ్డాను వైవీ సుబ్బారెడ్డి మరోసారి కోరారు. అడ్మిషన్లు కోల్పోయిన 100 మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేసేందు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి 100 సూపర్ న్యూమరీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విధమైన ఆర్డినెన్స్ ద్వారా గతంలో కేరళ, పాండిచ్చేరిలో విద్యార్థులకు సీట్లు సర్దుబాటు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వీలైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఒప్పించి ఫాతిమా కళాశాలకు 100 సీట్లు అదనంగా కేటాయించేలా సిఫార్సు చేయాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రమంత్రి ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
'ఫాతిమా విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదు'
బి.కొత్తకోట: ఫాతిమా వైద్య విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆ విద్యార్థులకు న్యాయం జరగడం కష్టమేనని, అయినప్పటికీ మరోమారు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విన్నవించడం జరిగిందన్నారు. విద్యార్థులు నష్టపోకుండా వారికి నీట్లో నారాయణ విద్యాసంస్థలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, కళాశాల యాజమాన్యం నుంచి విద్యార్థులు చెల్లించిన డొనేషన్లను తిరిగి ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రమంత్రి గడ్కరీ భరోసా ఇచ్చారని, ఈనెల 26న ఆయన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలూ చర్చిస్తామన్నారు. -
ఫాతిమా విద్యార్థులకు షాక్
-
నీట్ రాయాల్సిందే..
సాక్షి, అమరావతి: ఫాతిమా విద్యార్థుల సమస్య చాలా జఠిలమైనదని, కేంద్ర అధికారులు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు మేరకు వీళ్లందరూ నీట్ రాయాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో సచివాలయంలో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరం, ఆర్థిక లోటుతో పాటు ఫాతిమా విద్యార్థుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. ఫాతిమా విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, అయినా సరే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ ప్రతిపాదననూ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఫీజులు ఇప్పిస్తామని, దీనిపై యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఫాతిమా బాధిత విద్యార్థులకు పోరంకిలోని నారాయణ కళాశాలలో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని, దీనికి మూడొంతుల మంది విద్యార్థులు అంగీకరించారన్నారు. నీట్ పరీక్షలో అర్హత సాధించి సీటొచ్చిన వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, ఇది జరగాలంటే ఫాతిమా నుంచి ఫీజు తీసుకోకూడదని అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలి ఫీజులు అందరికీ వెనక్కు ఇప్పించి అందరూ తిరిగి కళాశాలలో చేరి చదువుకునేలా ఆర్డినెన్స్ తీసుకు రావాలని ఫాతిమా విద్యార్థులు డిమాండ్ చేశారు. మంత్రి వద్ద చర్చలు అనంతరం ఫాతిమా విద్యార్థులు సాక్షితో మాట్లాడారు. లాంగ్‌టర్మ్ కోచింగ్, ఫీజులు కట్టి చదివించడం వంటివన్నీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. -
ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పండి
సాక్షి, అమరావతి: ‘మీడియాకు ఎవరు సమాచారమిచ్చారో చెప్పాలి. లేదంటే మాదగ్గర ఇంటెలిజెన్స్ అధికారులున్నారు. వారి ద్వారా ఎవరు సమాచారమిచ్చారో తెలుసుకోగలం’అని ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులను మళ్లీ బెదిరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మర్యాదగా కోచింగ్‌లో చేరండి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై సీఎం పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులపై భగ్గుమంటున్నారు. కోచింగ్‌లో చేరండి అంటే మీరు మీడియాకు ఎందుకు సమాచారమిచ్చారంటూ పలువురు అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరించారు. సీఎం పేషీలో ఉన్నతాధికారి గిరిజాశంకర్ వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణ నుంచి ఫోన్లు వచ్చాయని, ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పాలని, లేదంటే మీ నెంబర్లన్నీ మా ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా విచారించి తెలుసుకోగలమని హెచ్చరించినట్లు బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేందుకు సీఎం పేషీ ఉన్నతాధికారి గిరిజాశంకర్ బుధవారం అపాయిం ట్మెంట్ ఇచ్చారు. కానీ సాక్షిలో వార్త ప్రచురితమయ్యాక తాను ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పినట్టు విద్యార్థులు తెలిపారు. -
ఫాతిమా విద్యార్థుల సమస్య పట్టదా?