fed cup tennis
-
భారత్‌కు ‘హ్యాట్రిక్’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అండర్–16 బాలికల జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. తెలంగాణ క్రీడాకారిణులు సంజన సిరిమల్ల, భక్తి షా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సంజన 1–6, 4–6తో అనా తమానిక (న్యూజిలాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. సింగిల్స్ రెండో మ్యాచ్‌లో భక్తి షా 3–6, 2–6తో జేడ్ ఓట్వే (న్యూజిలాండ్) చేతిలో పరాజయం పాలైంది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 4–6తో అబిగెయిల్ మేసన్–జేడ్ ఓట్వే (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఇక 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. -
భారత్‌కు మరో విజయం
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో కజకిస్తాన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్‌ల్లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6–3, 6–2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా 0–6, 7–5, 7–6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్ 2–0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నామమాత్రమైన చివరి డబుల్స్ మ్యాచ్‌లో సాల్సా పరాగ్– సాయి దేదీప్య (భారత్) ద్వయం 3–6, 5–7తో కమిల్యా షాయ్‌లినా–తహ్మినా జనటో వా జంట చేతిలో ఓడిపోయింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో భారత్, కొరియా జట్టుతో ఆడుతుంది.