భారత్‌కు మరో విజయం | india wins second match in fed cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో విజయం

Published Fri, Mar 24 2017 10:42 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

భారత్‌కు మరో విజయం

భారత్‌కు మరో విజయం

న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా జూనియర్‌ ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1తో కజకిస్తాన్‌ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సాల్సా పరాగ్‌ అహీర్‌ (భారత్‌) 6–3, 6–2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్‌ అమ్మాయి షేక్‌ హుమేరా 0–6, 7–5, 7–6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్‌ 2–0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

 

నామమాత్రమైన చివరి డబుల్స్‌ మ్యాచ్‌లో సాల్సా పరాగ్‌– సాయి దేదీప్య (భారత్‌) ద్వయం 3–6, 5–7తో కమిల్యా షాయ్‌లినా–తహ్మినా జనటో వా జంట చేతిలో ఓడిపోయింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో భారత్, కొరియా జట్టుతో ఆడుతుంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement