Female director
-
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్‌లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
స్త్రీలోక సంచారం
కోల్‌కతాలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ పూర్వ విద్యార్థిని అంజు సేత్ ఆ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ఆమె యు.ఎస్.లోని వర్జీనియా టెక్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2008లో అక్కడ చేరడానికి ముందు ఇల్లినాయిస్ యూనివర్సిటీలో డైరెక్టర్‌గా, హ్యూస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 25 ఏళ్ల తన కెరీర్లో అంజు సేత్ ఎక్కువ భాగం విదేశాలలోనే గడిపారు. సేత్ ఢిల్లీలో పట్టభద్రులయ్యారు. 1978లో కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో ఎం.బి.ఎ. చేశారు. ఇండియాలో ఎక్కువలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 83 శాతం మంది, తమిళనాడులో 63 శాతం మంది మహిళలు అవాంఛిత గర్భాన్ని పోగొట్టుకోడానికి డాక్టర్ల అనుమతి లేకుండానే, సొంతంగా ఫార్మసీలకు వెళ్లి అబార్షన్ పిల్స్ కొని తెచ్చుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని గట్మాకర్ ఇన్స్టిట్యూట్, ముంబైలోని ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు అస్సాం, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ‘అవాంఛిత గర్భం – గర్భవిచ్ఛిత్తి మాత్రల వాడకం’ అనే అంశంపై అధ్యయనం జరిపిన ఈ రెండు సంస్థలు.. ప్రమాదకరమైన ఈ ధోరణిని నివారించడానికి, ప్రభు త్వం సురక్షితమైన విధానాలను మహిళలకు అందుబాటులోకి తేవాలని తమ అధ్యయన ఫలితాల నివేదికలో సూచించాయి. ప్రముఖ బెంగాలీ నటి నఫీసా అలీ (61) తను స్టేజ్ త్రీ క్యాన్సర్‌తో ఉన్నట్లు వెల్లడించారు! ఇటీవలే ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’లో కనిపించిన నఫీసా ఈ వార్తను తన అభిమానులు, ఫాలోవర్లను ఉద్దేశించి ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, దాని కింద.. ‘ఇప్పుడే నా అపురూపమైన స్నేహితురాలిని కలిసి వచ్చాను. నా స్టేజ్ త్రీ క్యాన్సర్ నుంచి నేను కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు’’ అని రాశారు. నఫీసా అలీ మోడల్, పొలిటీషియన్, సామాజిక కార్యకర్త కూడా. మొదట కాంగ్రెస్‌లో ఉండి, తర్వాత సమాజ్‌వాదిలో చేరి, తిరిగి ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. -
ఇంద్రా నూయీకి అరుదైన గౌరవం
దుబాయ్: పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం తీవ్ర స్థాయిలో పరిశోధించి అన్నివిధాల అర్హురాలైనందున నూయీని ఎంపిక చేశామని ప్రకటించారు. నూయీ మాట్లాడుతూ... ‘క్రికెట్‌ను నేను అమితంగా ఇష్టపడతా. యుక్త వయసులో కళాశాలలో క్రికెట్ ఆడా. బృంద స్ఫూర్తి, సమగ్రత, గౌరవం, ఆరోగ్యకర పోటీ వంటి లక్షణాలను ఈ ఆటలోనే నేర్చుకున్నా. నా నియామకంతో ఆశ్చర్యానికి గురయ్యా. బోర్డు సహచరులతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డైరెక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. -
ఐసీసీలో తొలి సారిగా..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పేరొందిన ఇంద్రానూయి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పెప్సికో సంస్థకు ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మరో కీలక పదవిని చేపట్టనున్నారు. ఈ ఐసీసీ బోర్డులోఇంద్రానూయి తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఆమె జూన్‌లో ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె నియామకాన్ని బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు ఐసీసీ వెల్లడించింది. పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో బోర్డులోకి కొత్తగా ఒక స్వతంత్ర డైరెక్టర్‌ను తీసుకోవాలని అది కూడా మహిళే అయి ఉండాలని 2017 జూన్‌లో నిర్వహించిన ఐసీసీ మండలి సమావేశంలో పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగానే ఆమెను స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమించారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో వరుసగా ఇంద్రా నూయి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. పెప్సికో సీఈఓగా ఇంద్రానూయి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను కొత్తపుంతులు తొక్కించారు. ప్రస్తుతం ఈ సంస్ధ నుంచి మొత్తం 22 రకాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తున్నాయి. పెప్సికో సంస్థ ఆదాయం ఏడాదికిగాను $1 బిలియన్గా ఉంది. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ మాట్లాడుతూ 'ఇంద్రా నూయి ఐసీసీలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. పరిపాలనలో మహిళా డైరెక్టర్‌ను భాగస్వామ్యం చేయబోతున్నాం. ఇదొక కీలక నిర్ణయం. ప్రపంచ వ్యాపార రంగంలో ఆమెకున్న అపార అనుభవం తమకు ఉపయోగపడుతుంది' అని ఆయన అభిప్రాయపడ్డారు. -
యథార్ధ సంఘటనల ఆధారంగా అమ్మణి
ఆరోహణం వంటి మంచి విలువలతో కూడిన ఉత్తమ కథా చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్. ఓ వైపు నటిగా నటిస్తూనే తన దర్శక తృష్ణను తీర్చుకుంటున్న లక్ష్మీరామకృష్ణన్ దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుందనడానికి ఆమె గత చిత్రాలే సాక్ష్యం. అలాంటి నటి,దర్శకురాలు తాజాగా తెరపై ఆవిష్కరించిన చిత్రం అమ్మణి. టాగ్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెణ్.గోవింద నిర్మించిన ఈ చిత్రంలో లక్ష్మీరామకృష్ణన్‌తో పాటు ప్రధాన పాత్రల్లో నితిన్‌సత్య, సుబ్బులక్ష్మి, రోబోశంకర్, జార్జ్మరియన్, శ్రీబాలాజీ, రెజిన్ రోస్, సి.రేణుక, ఎస్.అన్న తదితరులు నటించారు. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి వీ.శివరాజ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ మాట్లాడుతూ బిడ్డను 10 నెలలు కడుపులో మోసి కన్న తల్లిలా ఉంది తన పరిస్థితి అని పేర్కొన్నారు. అమ్మణి లాంటి చిత్రాలను చేయడానికి చాలా తక్కువ మంది నిర్మాతలు ఉంటారన్నారు. ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెణ్.గోవిందకు కృతజ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు. సినిమాలో ఒక్క ఎంటర్టెయిన్ మాత్రమే కాకుండా చాలా అంశాలు ఉంటాయన్నారు. అలాంటి చిత్రాలు చేసేటప్పుడు పర్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమాజంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం అమ్మణి అని తెలిపారు. ఒక మంచి నవల చదివిన భావన అమ్మణి చిత్రం చూసినప్పుడు తనకు కలిగిందని నిర్మాత వెణ్.గోవింద పేర్కొన్నారు. వాస్తవ సంఘటనలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు.