బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లావ్యాప్తంగా బెల్ట్‌షాపులు, నియమిత వేళలు పాటించని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం విస్తృతంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.బి. భాస్కరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఏలూరు, భీమవరం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురం ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని బెల్ట్‌షాపులు, నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై దాడులు చేసినట్టు వివరించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 47మద్యం బాటిళ్లు, పది బీరు సీసాలు స్వా«ధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదే సందర్భంలో సారా విక్రయిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈదాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీలత నేతృత్వంలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసచౌదరి, కె. శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారని వివరించారు.