'ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటాం'
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఐదో అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకుంటామని, అన్ని ఆలోచించే నిలబెట్టామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. శని, ఆదావిరాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఆరు స్థానాలకుగాను టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్ ఓ స్థానానికి, టీడీపీ బీజేపీ కూటమి మరో స్థానానికి పోటీ పడుతున్నాయి.