'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది' | Fifth candidate win in MLC elections, says G Jagadish reddy | Sakshi
Sakshi News home page

'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది'

Published Thu, May 21 2015 1:12 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది' - Sakshi

'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది'

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా తమకు ఉందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఎవరికి ఓటు వేయాలో ఎమ్మెల్యేల ఇష్టమని... అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రహస్యంగానే జరుగుతాయన్నారు.

పోటీ చేస్తున్న ఇతర పార్టీల కన్నా తమ పార్టీకే బలం అధికంగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులను కొన్ని పక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అన్ని ఆలోచించే అభ్యర్థులను బరిలోకి దించామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో కేసీఆర్కు బాగా తెలుసున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement