Final Test
-
Border-Gavaskar Trophy: మన బ్యాటర్లపైనే భారం
భారత్, ఆస్ట్రేలియా ఆఖరి టెస్టు పరుగుల బాట పట్టింది. గ్రీన్ శతకం సహాయంతో కంగారూలు భారీ స్కోరు నమోదు చేశారు. ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు రావడం ఈ సిరీస్‌లో ఇదే మొదటిసారి. ఇక మన జట్టు ఎన్ని పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన పది ఓవర్లలో చక్కటి షాట్లతో ఎలాంటి ప్రమాదం లేకుండా రెండో రోజును ముగించిన టీమిండియా... మూడో రోజూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చెలరేగాల్సి ఉంది. అహ్మదాబాద్: ఈ సిరీస్‌లో స్పిన్ మాయలో, వికెట్ల వేటలో విజయవంతమైన బౌలర్లకు చివరి టెస్టు కఠినమైన సవాల్ విసురుతోంది. బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించిన మోదీ మైదానంలో రెండో రోజూ పరుగుల జోరు కొనసాగింది. అశ్విన్ (6/91) ఆరు వికెట్లతో ఆకట్టుకోగా... అప్పటికే పర్యాటక ఆసీస్ భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (422 బంతుల్లో 180; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ అవకాశం కోల్పోగా, కామెరాన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) టెస్టు కెరీర్లో తొలి శతకం బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ పది ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17 బ్యాటింగ్; 2 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ద్విశతక భాగస్వామ్యం... రెండో రోజు తొలి సెషన్లో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగింది. 255/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఉస్మాన్ ఖాజా– గ్రీన్ జోడీ భారత బౌలింగ్‌పై పైచేయి సాధించింది. దీంతో జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. లంచ్ బ్రేక్‌కు ముందే ఖాజా 150 మార్క్‌ను దాటగా, గ్రీన్ సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచాడు. 347/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగియగా, రెండో సెషన్ మొదలైన కాసేపటికే గ్రీన్ టెస్టు కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. ఐదో వికెట్‌కు ఉస్మాన్ ఖాజా, గ్రీన్ 208 పరు గులు జోడించారు. 1979 తర్వాత భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జోడీ నమోదు చేసిన ద్విశతక భాగస్వామ్యం ఇదే! ఆతిథ్య జట్టును అష్టకష్టాలు పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు అశ్విన్ విడగొట్టాడు. గ్రీన్‌ను అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ ఆఖరి బంతికి క్యారీ (0)ని కూడా పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్టార్క్ (6)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఈ పర్యటనలో తొలిసారి 400 పరుగుల మైలురాయిని చేరుకోగా, 409/7 వద్ద టి విరామానికి వెళ్లారు. విసిగించిన మర్ఫీ, లయన్ ఆఖరి సెషన్లో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న ఖాజాకు అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. ఇంకేం మిగతా రెండు వికెట్లను కూల్చేయడం సులభమే అనుకున్న భారత్‌కు టెయిలెండర్లు టాడ్ మర్ఫీ (61 బంతుల్లో 41; 5 ఫోర్లు), లయన్ (96 బంతుల్లో 34; 6 ఫోర్లు) చెమటలు పట్టించారు. ఇద్దరు 19.2 ఓవర్లు ఆడటంతో ఆతిథ్య బౌలర్లు శ్రమించక తప్పలేదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై ఈ స్పెషలిస్టు బౌలర్లు చక్కగా బ్యాటింగ్ చేశారు. వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించారు. ఇక ఒక దశలో 500 పరుగులు దాటిస్తారనిపించింది. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ వరుస ఓవర్లలో మర్ఫీ, లయన్‌ను అవుట్ చేయడంతో ఆసీస్ ఆలౌటైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32; ఖాజా (ఎల్బీ) (బి) అక్షర్ 180; లబుషేన్ (బి) షమీ 3; స్మిత్ (బి) జడేజా 38; హ్యాండ్స్కాంబ్ (బి) షమీ 17; గ్రీన్ (సి) భరత్ (బి) అశ్విన్ 114; క్యారీ (సి) అక్షర్ (బి) అశ్విన్ 0; స్టార్క్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 6; లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 34; మర్ఫీ (ఎల్బీ) (బి) అశ్విన్ 41; కునెమన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (167.2 ఓవర్లలో ఆలౌట్) 480. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–151, 4–170, 5–378, 6–378, 7–387, 8–409, 9–479, 10–480. బౌలింగ్: షమీ 31–3–134–2, ఉమేశ్ 25–2–105–0, అశ్విన్ 47.2–15–91–6, జడేజా 35–5–89–1, అక్షర్ 28–8–47–1, అయ్యర్ 1–0–2–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ బ్యాటింగ్ 17; గిల్ బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: స్టార్క్ 3–1–7–0, గ్రీన్ 2–0–11–0, లయన్ 3–0–14–0, కునెమన్ 2–0–3–0. 611: ఖాజా బ్యాటింగ్ చేసిన నిమిషాలు. భారత్‌లో ఒక ఆసీస్ బ్యాటర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఇదే. ఆసీస్ తరఫున బంతులపరంగా (422) కూడా ఖాజాదే రికార్డు. గతంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు (యూనిస్‌ఖాన్, ఆమ్లా, జయవర్ధనే) మాత్రమే భారత్‌లో 10 గంటలకు పైగా బ్యాటింగ్ చేయగలిగారు. 32: ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టడం ఇది 32వ సారి. భారత గడ్డపై కుంబ్లే (25 సార్లు) పేరిట ఉన్న రికార్డును అతను (26) అధిగమించాడు. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు (113) తీసిన భారత బౌలర్‌గా కూడా కుంబ్లే (111) రికార్డును అశ్విన్ సవరించాడు. -
టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్ కోచ్
వెల్లింగ్టన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వాలని ఆసీస్ తాత్కాలిక హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోరుకుంటున్నాడు. ఆసీస్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కాలంటే మొటేరా మైదానంలో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను ఇంగ్లీష్ జట్టు ఓడించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే న్యూజిలాండ్ ఫైనల్ ఆశలు గల్లంతై ఆసీస్ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు జూన్‌లో లార్డ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడే అవకాశం ఆసీస్‌కు లభిస్తుంది. ఇందుకే ఆసీస్ తాత్కాలిక కోచ్ టీమిండియా ఓటమిని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టుతో పాటు ఉన్న మెక్‌డొనాల్డ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ ఫైనల్ బెర్తు అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు కష్టమే అయినప్పటికీ.. తాము మాత్రం రూట్ సేన అద్భుతాలు చేసైనా మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, ఆసీస్ రెగ్యులర్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ విశ్రాంతి తీసుకోవడంతో మెక్‌డొనాల్డ్ ఆసీస్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు, వరుసగా రెండు, మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు మార్చి 4న ఉదయం 9:30కు ప్రారంభంకానుంది. -
వానతో విరామం...
ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవుట్... తర్వాతి 37 బంతుల్లో వచ్చినవి 2 పరుగులే... మరింత ఉత్సాహంతో ఆసీస్ కనిపిస్తుండగా ఒత్తిడిలో భారత జట్టు... మూడో సెషన్లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్‌లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మరో 307 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా ఆదివారం ఎలా పుంజుకుంటుందో చూడాలి. అంతకుముందు కనీసం 400 పరుగుల చేయాలనే లక్ష్యంతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను అంతకంటే చాలా ముందుగా నిలిపివేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చే పోరుకు వాన ఆటంకంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (8 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్య రహానే (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉండగా... దూకుడుగా ఆడబోయిన రోహిత్ శర్మ (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 274/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 369 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (104 బంతుల్లో 50; 6 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (107 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ తలా 3 వికెట్లు తీశారు. 4 పరుగులకు 3 వికెట్లు... శుక్రవారం సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియా ఆట ముగిద్దామని భావించిన భారత్ సఫలం కాలేకపోయింది. ఆసీస్ లోయర్ ఆర్డర్ మరోసారి చెప్పుకోదగ్గ పోరాట పటిమ కనబర్చింది. ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం పైన్‌ను అవుట్ చేసి భారత్ రెండో రోజు తొలి వికెట్ సాధించింది. 102 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఆసీస్ కెప్టెన్ వెనుదిరిగాడు. మరో రెండు పరుగుల వ్యవధిలోనే గ్రీన్, కమిన్స్ (2) కూడా పెవిలియన్ చేరడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం లభించింది. అయితే మిషెల్ స్టార్క్ (20 నాటౌట్), కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లయన్ (24) దీనికి అడ్డు పడ్డారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఆ తర్వాత హాజల్‌వుడ్ (11) సహకారంతో స్టార్క్ తమ జట్టుకు మరికొన్ని పరుగులు అందించాడు. గిల్ విఫలం... భారత జట్టుకు ఈసారి చెప్పుకోదగ్గ ఆరంభం అందించడంలో ఓపెనింగ్ జోడి విఫలమైంది. కమిన్స్ తన తొలి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ (7)ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. అయితే రోహిత్ శర్మ చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే రోహిత్ మూడు ఫోర్లు కొట్టగా... గ్రీన్ బౌలింగ్‌లో కొట్టిన స్క్వేర్ డ్రైవ్ బౌండరీ హైలైట్‌గా నిలిచింది. ఇదే జోరులో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన షాట్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పుజారా, రహానే 6.1 ఓవర్లలో 2 పరుగులే జోడించారు. టీ విరామం సమయంలో వచ్చిన వర్షం కారణంగా ఆపై ఆట సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా అసంతృప్తి వర్షం పూర్తిగా ఆగిపోయి దాదాపు గంట అయింది. బ్రిస్బేన్ మైదానంలోని అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ వల్ల అవుట్ ఫీల్డ్‌లో నీరు మొత్తం తోడేశారు. కవర్లు కూడా తొలగించారు. ఇక కొద్ది సేపట్లో ఆట జరగడం ఖాయమని భావించిన ఆసీస్ ఆటగాళ్లు వార్మప్ కూడా చేస్తున్నారు... ఈ దశలో అనూహ్యంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడక్కడా తడి ఉండటంతో గ్రౌండ్ అనుకూలంగా లేదని వారు భావించారు. అయితే అంపైర్ల నిర్ణయం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను అసంతృప్తికి గురి చేసింది. స్థానిక సమయం ప్రకారం ఆట నిర్దేశిత ముగింపు సమయంలో మరో 45 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కనీసం 10 ఓవర్లు లేదంటే అరగంట ఆటైనా జరగవచ్చని ఆస్ట్రేలియా ఆశించింది. ఒత్తిడిలో ఉన్న భారత్‌ను మరింతగా ఇబ్బంది పెట్టి మరో వికెట్ సాధించగలిగినా కంగారూలకు పట్టు చిక్కినట్లే. పైగా రోహిత్‌ను అవుట్ చేసి లయన్ అప్పుడే లయ అందుకున్నాడు. ఈ సమయంలో ఆటను నిలిపివేయడంతో నిరాశకు గురైన పైన్... అంపైర్ పాల్ విల్సన్‌తో వాదించడం కనిపించింది. వాన కారణంగా కోల్పోయిన సమయాన్ని పూడ్చేందుకు మిగిలిన మూడు రోజుల్లో ప్రతీ రోజు ఆట నిర్ణీత సమయంకంటే అర గంట ముందుగా ప్రారంభమవుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్‌షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బి) సుందర్ 47; పైన్ (సి) రోహిత్ (బి) శార్దుల్ 50; కమిన్స్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; స్టార్క్ (నాటౌట్) 20; లయన్ (బి) సుందర్ 24; హాజల్‌వుడ్ (బి) నటరాజన్ 11; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (115.2 ఓవర్లలో ఆలౌట్) 369 వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213, 6–311, 7–313, 8–315, 9–354, 10–369. బౌలింగ్: సిరాజ్ 28–10–77–1, నటరాజన్ 24.2–3–78–3, శార్దుల్ 24–6–94–3, సైనీ 7.5–2–21–0, సుందర్ 31–6–89–3, రోహిత్ 0.1–0–1–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లయన్ 44, శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7, పుజారా (బ్యాటింగ్) 8, రహానే (బ్యాటింగ్) 2, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (26 ఓవర్లలో 2 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–11, 2–60. బౌలింగ్: స్టార్క్ 3–1–8–0, హాజల్‌వుడ్ 8–4–11–0, కమిన్స్ 6–1–22–1, గ్రీన్ 3–0–11–0, నాథన్ లయన్ 6–2–10–1. -
చెన్నైలోనే చివరి టెస్టు..
చెన్నై: మరో నాలుగు రోజుల్లో చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు వేదికను మరో చోటకి తరలించే ఆలోచనకు దాదాపు ముగింపు పలికినట్లే కనబడుతోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో మ్యాచ్ వేదికను మార్చాలని తొలుత భావించారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగానే ఉండటంతో వేదిక మార్పును పక్కకు పెట్టాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) భావిస్తోంది. దీనిలో భాగంగానే తమిళనాడు స్పోర్ట్స్ అథారిటి నుంచి కూడా క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా తాజా ప్రకటన కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆ మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి అదే వేదికపై మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు శుక్లా పేర్కొన్నారు. -
పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష రేపే
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో కీలకమైన తుది పరీక్ష ఆదివారం జరగనుంది. 9,281 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 153 (అన్ని పాత జిల్లాల్లో) కేంద్రాల్లో 81,523 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో 13 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని పోలీస్ నియామక సంస్థ సూచించింది. విధి విధానాలు, గుర్తుంచుకోవాల్సిన కీలకాంశాలు.. ⇔ హాల్‌టికెట్‌ను పరీక్ష కేంద్రం ప్రవేశంలో, పరీక్ష హాలులో చూపించాల్సి ఉంటుంది. ⇔ పరీక్ష ప్రారంభానికి గంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు హాలులోనే ఉండాలి. ఎవరినీ బయటకు అనుమతించరు. ⇔ పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. ⇔ ఒరిజి నల్ హాల్ టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకురావాలి. జిరాక్స్ ప్రతులు, స్కాన్డ్ కాపీలు అనుమతించరు. ⇔ డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకున్న హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని హాల్‌టికెట్లతో వచ్చిన వారిని అనుమతించరు. ⇔ ఫోన్లు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని హాలులోకి అనుమతించరు. ⇔ ప్రిలిమినరీ పరీక్షలు, దేహ దారుఢ్య పరీక్షల సందర్భంగా సేకరించిన అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ పద్ధతిలో సరిచూస్తారు. ⇔ ఓఎంఆర్ షీట్లో మార్కింగ్స్ మొదలుపెట్టే ముందు ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్‌ను సరిచూసుకోవాలి. ⇔ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ భాషలో ఉంటాయి. ⇔ ఓఎంఆర్ షీట్లపై ఎలాంటి అసందర్భ రాతలు ఉన్నా తిరస్కరిస్తారు. మాల్ ప్రాక్టీస్ సహా ఎలాంటి చర్యలకు పాల్పడినా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ⇔ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లతో పాటు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను కూడా తిరిగి ఇవ్వాల్సిఉంటుంది. అలా చేయని వారి జవాబు పత్రాలను తిరస్కరించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ⇔ ఓఎంఆర్ షీటుతో పాటు జోడించి ఉన్న డూప్లికేట్ ప్రతిని పరీక్ష ముగిసిన తర్వాత మాత్రమే ఇన్విజిలేటర్ సమక్షంలో వేరు చేసి అభ్యర్థులు తీసుకెళ్లాలి. ⇔ పరీక్ష కేంద్రం మార్గం, చిరునామాలు గుర్తించేందుకు పరీక్షకు ఒక రోజు ముందే అభ్యర్థులు వెళ్లి రావాలని అధికారులు సూచించారు. -
చివరి టెస్టుపై విచారణ!
ట్రినిడాడ్:నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ల చివరి మ్యాచ్ వర్షార్పణం కావడంపై ట్రినిబాడ్-టుబాగో క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. క్వీన్ పార్క్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఆఖరి టెస్టు వర్షం కారణంగా కేవలం 22.0 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ట్రినిడాడ్-టుబాగో క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అజీమ్ బసారత్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజే వర్షం పడినా అవుట్ ఫీల్డ్‌ను పూర్తిగా కప్పి ఉంచడంలో గ్రౌండ్ సిబ్బంది వైఫల్యం చెందారు. దీంతో పాటు క్వీన్ పార్క్ స్టేడియంలో డ్రైనేజ్ విధానం కూడా సరిగా లేకపోవడంతో పరిమిత ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్ నిర్వహణలో కొన్ని లోపాలున్న కారణంగా విచారణకు ఆదేశించామని, ఇదే తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని బసారత్ తెలిపారు. -
వెస్టిండీస్ రాత మారేనా!
నేటినుంచి ఆస్ట్రేలియాతో చివరి టెస్టు సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరమైన ఆటతీరు కనబరుస్తున్న వెస్టిండీస్ జట్టుకు కాస్తయినా పరువు నిలబెట్టుకునేందుకు చివరి అవకాశం మిగిలింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఆదివారం నుంచి సిడ్నీలో జరుగుతుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి ఇప్పటికే ఫ్రాంక్‌వరెల్ ట్రోఫీని నిలబెట్టుకున్న స్మిత్ సేన 3-0పై గురి పెట్టింది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఆసీస్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. నాథన్ లయోన్‌తో పాటు స్టీవ్ ఓ కీఫ్ జట్టులోకి ఎంపికయ్యాడు. గత రెండు టెస్టుల్లో విండీస్ తరఫున డారెన్ బ్రేవో మినహా మిగతా ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. గత టెస్టు చివర్లో కొంత పోరాట పటిమ కనబర్చిన ఆ జట్టు బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ మైదానంలో ఏ మాత్రం మెరుగు పడుతుందో చూడాలి. కీమర్ రోచ్ స్థానంలో యువ పేసర్ మిగల్ కమిన్స్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కవచ్చు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, నిధుల సేకరణలో భాగంగా ఈ టెస్టు మ్యాచ్ మొత్తం గులాబీ రంగుమయం కానుంది. మ్యాచ్ ద్వారా దాదాపు 3 లక్షల 80 వేల డాలర్లు (దాదాపు రూ. 2.5 కోట్లు) సేకరించి మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఉదయం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
సఫారీలు మరో'సారీ'
-
ఫైనల్ టెస్ట్
-
సచిన్ చివరి మ్యచ్‌ను వీక్షించనున్న ఫ్యామిలీ