
చివరి టెస్టుపై విచారణ!
ట్రినిడాడ్:నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ల చివరి మ్యాచ్ వర్షార్పణం కావడంపై ట్రినిబాడ్-టుబాగో క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. క్వీన్ పార్క్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఆఖరి టెస్టు వర్షం కారణంగా కేవలం 22.0 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ట్రినిడాడ్-టుబాగో క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అజీమ్ బసారత్ తెలిపారు.
మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజే వర్షం పడినా అవుట్ ఫీల్డ్ను పూర్తిగా కప్పి ఉంచడంలో గ్రౌండ్ సిబ్బంది వైఫల్యం చెందారు. దీంతో పాటు క్వీన్ పార్క్ స్టేడియంలో డ్రైనేజ్ విధానం కూడా సరిగా లేకపోవడంతో పరిమిత ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్ నిర్వహణలో కొన్ని లోపాలున్న కారణంగా విచారణకు ఆదేశించామని, ఇదే తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని బసారత్ తెలిపారు.