Finance ministers meeting
-
మౌలిక రంగంపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవరోజు వర్చువల్ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది. -
జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారానికి మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం (2022–23) బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాట్ వంటి స్థానిక పన్నులను ఉపసంహరించుకోవడం జరిగింది. దీనివల్ల ఏర్పడే ఆదాయ లోటు కోసం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తుంది. కరోనా కష్టకాలంలో మరో ఐదేళ్లు పరిహార కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాలు తాజాగా డిమాండ్ చేశాయి. పలు వర్గాలతో భేటీ... 2022–23 వార్షిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు వీరిలో ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్‌గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్దీకరణ, డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్ స్టోరేజ్‌కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.మోడీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్. ఇక్కడి విజ్ఞాన్ భవల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు తమ డిమాండ్లు ఏమిటన్నది మీడియాకు వెల్లడించారు. ఆయా అంశాలు పరిశీలిస్తే... బంగారం దిగుమతి సుంకాలు తగ్గాలి 2027 వరకూ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్ సరైందే. దీనిని కేంద్రం పరిశీలించాలి. దీనికితోడు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి. కేంద్ర పథకాల్లో కేంద్రం వాటా క్రమంగా తగ్గుతూ, రాష్ట్రాల వాటా పెరగాలనేది మా అత్యంత ముఖ్యమైన డిమాండ్. ఇంతకుముందు షేరు 90–10గా ఉండేది. మరియు ఇప్పుడు అది 50–50 లేదా 60–40గా ఉంది. అది 90–10కి తిరిగి వెళ్లాలని మా అభ్యర్థన. కోవిడ్ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇది అత్యవసరం. నీటిపారుదల, నీటి పనుల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని అలాగే కేంద్ర పథకాలుగా ప్రకటించాలని కూడా కోరుతున్నాం. – సుభాష్ గార్గ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి లేకపోతే కష్టమే... పలు రాష్ట్రాలు పరిహారం కొనసాగింపును కోరాయి. మేము కూడా పొడిగించమని కోరాము. పొడిగించకపోతే, అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాం జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయానికి గండి పడింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రం దాదాపు రూ. 5 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి జీఎస్టీ పరిహారం మంజూరును కొనసాగించాలని కోరుతున్నాం. మూడే ళ్లలో కేంద్ర బడ్జెట్లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.13,089 కోట్ల తక్కువ కేంద్ర పన్నుల వాటా వచ్చింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కోల్ బ్లాక్ కంపెనీల నుంచి బొగ్గు తవ్వకాలకు సంబంధించి టన్నుకు రూ.294 చొప్పున కేంద్రం వద్ద జమ అయ్యింది. దీనికి సంబంధించి రూ.4,140 కోట్లను కూడా వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు బదలాయించాలి. భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అదనపు రుణ సౌలభ్యత కావాలి కరోనా సవాళ్లతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచకతప్పదు. దీనితోపాటు రాష్ట్ర రుణాలకు సంబంధించి, ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా అదనపు రుణాల సౌలభ్యతను కల్పించాలి. – చంద్రిమా భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి -
నేడు అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం అమరావతిలో సమావేశమవుతున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల్లో ప్రధానంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను సిఫార్సు చేయాలని ఉంది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతాయని, ఏటా 8000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇదే తరహాలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల కారణంగా ఏ విధంగా రాష్ట్రాలను అన్యాయం జరుగుతుంతో కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 5.05 శాతంగా ఉంటుంది. అదే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 4.09 శాతమే ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలి: యనమల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. విభజన అనంతరం ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని యనమల తెలిపారు. కేంద్రం ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర పథకాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని దీని వల్ల రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం పడుతోందని అన్నారు. -
కొత్త పన్నుతో రూ.8,552 కోట్ల నష్టం!
- జీఎస్టీ పన్నుతో రాష్ట్ర ఆదాయానికి భారీగానే చిల్లు - నేడు తిరువనంతపురంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన వస్తువులు.. సేవల పన్ను (జీఎస్టీ)తో తెలంగాణకు ఏటా రూ.7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఇప్పటివరకు ప్రతిపాదనల్లో ఉన్న ఈ పన్నుకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. దీంతో జీఎస్టీ పన్నుల ప్రభావమెలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వరి, పొగాకు ఉత్పత్తులు, పెట్రోలు, ఎక్సైజ్ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్టీ పాత బకాయిలు చెల్లించటంతో పాటు తాము సూచించినవాటిని మినహాయిస్తే.. జీఎస్టీని స్వాగతిస్తామని ఇప్పటికే ప్రకటించింది. గత నెలలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగా, జీఎస్టీపై చర్చిం చేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ గురువారం కేరళలోని తిరువనంతపురంలో మరోమారు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం జీఎస్టీతో ప్రస్తుతం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో తగ్గిపోతోంది. వరి, ఆహార ఉత్పత్తులపై వచ్చే సెస్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు రూ.700 కోట్లు వసూలవుతోంది. దీంతో పాటు పొగాకు, పొగాకు అనుబంధ ఉత్పత్తులపై అత్యధికంగా 20 శాతం పన్ను అమల్లో ఉంది. దీన్ని జీఎస్టీలో కలపటంతో ఏటా దాదాపు రూ.500 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పుడు అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. క్రమంగా కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) ఎత్తివేత కారణంగా ఏటా పన్నుల ద్వారా రూ.4,840 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2013-14 వార్షిక ఆదాయం లెక్కల ఆధారంగా ఈ అంచనా వేసింది. వ్యాట్‌ను సైతం జీఎస్టీలో విలీనం చేయటంతో మరో రూ.2,113 కోట్లకు పైగా నష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషించాయి. లగ్జరీ పన్ను, ఎంట్రీ టాక్స్‌లను సైతం జీఎస్టీలో కలిపితే తెలంగాణకు మరో రూ.399 కోట్లు నష్టం వాటిల్లుతుంది. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.8,552 కోట్ల రెవెన్యూను కోల్పోయే ప్రమాదముంది. అంత మేరకు రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిహారంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్టీ బిల్లుకు సంబంధించి చేయాల్సిన సవరణలను సూచించింది. జీఎస్టీ అమల్లోకి వస్తే రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయమని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎంత పరిహారం చెల్లిస్తుంది.. ఏయే ఉత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది.. అనేది వేచి చూడాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. -
రేపు ఆర్థిక మంత్రుల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈటెల రాజేందర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.