మొదటి ముస్లిం మహిళా జడ్జి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: అమెరికాలో మొట్టమొదటి ముస్లిం మహిళా జడ్జి షీలా అబ్దుస్ సలాం (65) అనుమానాస్పద స్థితిలో మరణించారు. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. న్యూ యార్క్స్ అత్యున్నత కోర్టులో పనిచేసిన మొట్టమొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా ముస్లిం న్యాయమూర్తిగా ఆమె కీర్తి గడించారు. న్యూయార్క్ పోలీసుల సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆమె అపస్మారక స్థితిలో పడివుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు.
న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జి గా ఉన్న ఆమె హార్లిం ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెపై దాడి జరిగినట్టు తాము భావించడం లేదని, ఆమె దుస్తులు చెక్కు చెదరకుండా ఉన్నాయని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. 2013 నుంచి న్యాయమూర్తి గా ఉన్న షీలా అబ్దుస్ సలాం గతంలో 15 ఏళ్ళు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అప్పిలేట్ డివిజనల్ గా పని చేశారని న్యూయార్క్ డైలీ న్యూస్ నివేదించింది. అయితే సలాంను హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మంగళవారం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది
సలాం మరణంపై న్యూయార్క్ మేయర్ సహా , పలువురు న్యాయవాదులు, నిపుణులు ట్విట్టర్ ద్వారా తీవ్ర సంతాపాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆమె రచనలు, ఆమె జ్ఞానం , అపార నైతిక నిబద్ధతో ప్రముఖంగా నిలిచారని మరో ప్రముఖ జడ్జి జానెట్ డిఫియోర్ సంతాపం ప్రకటించారు. వ్యక్తిగతంగా తనకు ఇది తీరని లోటన్నారు. రాజీలేని ఆమె తత్వం, న్యాయశాస్త్రం పరిణతమకు ప్రేరణగా నిలిచిందని ఆమె చెప్పారు.
కాగా వాషింగటన్ లో జన్మించిన సలాం ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. 1991 లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన ఆమెన ఈస్ట్ బ్రూక్లిన్‌లో లీగల్ సేవలు అందించారు. అనంతరం 2009లో న్యూయార్క్ న్యాయవాద శాఖకు చెందిన సివిల్ హక్కులు, రియల్ ఎ స్టేట్ ఫైనాన్సింగ్ బ్యూరోకి అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా ఎంపికయ్యారు.