తబస్సుమ్ హసన్ (ఫైల్ ఫోటో)
లక్నో: కైరానా (యూపీ) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన తబస్సుమ్ హసన్ చరిత్ర సృష్టించారు. 2014 నుంచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టిన యూపీ ముస్లింగా ఆమె చర్రిత సృష్టించారు. బీజేపీ అభ్యర్థి మృగంకా సింగ్‌పై తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో కైరానా నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి ముస్లింగా తబస్సుమ్ నిలిచారు.
2014లో బీజేపీ-ఆప్నాదళ్ కూటమి మోదీ హవాతో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన సీట్లను కాంగ్రెస్-ఎస్సీ కూటమి సొంతం చేసుకుంది. వీరిలో ఒక్క ముస్లిం కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్సీ- బీఎస్సీ కూటమి ముస్లిం అభ్యర్ధులను బరిలో నిలపలేదు.
ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్ నిలవగా, రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్ అలీ ఖాన్, తన్జీమ్ ఫాట్మాలు ఎస్సీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment