kirana
-
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
జియోమార్ట్‌కు షాక్ : ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూపు వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ను ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తద్వారా భారతదేశంలో కిరాణా రీటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ కిరణా వ్యాపారంలో ఉన్నపోటీ, జియోమార్ట్ పేరుతో రిలయన్స్ రీటైల్ రంగంలో దూసుకువస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ తాజా డీల్ విశేషంగా నిలిచింది. ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ఆగస్టులో లాంచ్ చేయనున్నామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలకు పైలట్ సేవలను అందిస్తామని పేర్కొంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఆదర్శ్ మీనన్ నేతృత్వం వహిస్తారు. అలాగే వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ కొంతకాలంవరకు సంస్థతోనే ఉంటారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సంస్థ కిరాణా దుకాణాలు, చిన్నవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దృష్టి సారిస్తుందని అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెక్కెన్నా వ్యాఖ్యానించారు. ఒకరి బలాలు, నైపుణ్యాలు పరస్పరం పెంచుకోవడం ద్వారా, కొత్త ఒరవడికి నాంది పడుతుందని పేర్కొన్నారు. -
పరాజయం తెచ్చిన ప్యాకేజీలు!
ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతంలోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవసాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కిందటివారం ప్రకటించడం కూడా ఎన్నికల ప్యాకేజీల్లో భాగమే. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భయాందోళనలోకి నెట్టాయి. వర్తమాన ఘటనలకు స్పందనగా బీజేపీ సర్కారు తన కార్యాచరణను రూపొందించడం విశేషం. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కింద టివారం ప్రకటించింది. ఈ సాయం సమస్యను పరి ష్కరిస్తుందా, కనీసం వాయిదా వేస్తుందా? అంటే జవాబు లేదనే చెప్పాలి. పంచదారతో సమస్య ఏమంటే, ఇండియాలో మాదిరిగానే ప్రపంచంలోనూ దీని ఉత్పత్తి చాలా ఎక్కువ. ప్రభుత్వం ఆదేశించనట్టు చెరకు రైతులకు చక్కెర మిల్లులు కనీస మద్దతు ధర చెల్లిస్తే వాటికి ఖర్చులు కూడా గిట్టవు. రైతులకు ‘మరింత గిట్టుబాటు’ ధరలు దక్కాలని సర్కారు కోరుకుంటే ముందు చక్కెర దిగుమతులు నిషేధిం చాలి. ప్రభుత్వం ఆ పని చేసింది కూడా. అయినా, మిల్లులకు చక్కెర ధరలు ‘గిట్టుబాటు’ కాకుంటే ప్రభుత్వం చక్కెరకు గరిష్ట చిల్లర ధర(ఎమార్పీ) నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది గత కాలపు లైసెన్స్– కోటా పద్ధతి అవశేషంగా కనిపిస్తుంది. 2019 లో ఓటేసే 80 శాతం ప్రజలకు ఇంతకు ముందు చెప్పిన 1960 నాటి ధర నిర్ణయ విధానంగాని, పనికిమాలిన రాజకీయాలుగాని అర్ధం కావు. దేశంలో చెరకు పండించే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. అవసరానికి మించి చక్కెర ఉత్పత్తి అవు తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుత ధరలను బట్టి చూస్తే దేశం నుంచి పంచదార ఎగుమతి చేయలేం. అయితే, చెరకు పంట వేయకుండా రైతులకు ప్రోత్సా హకాలు ఇస్తే మంచిది. ముఖ్యంగా నీటి కొరత ఉన్న మహారాష్ట్రలో రైతులకు చెరకు సాగు చెడు అలవా టుగా మారి, పర్యావరణ సంక్షోభానికి దారితీస్తున్న నేపథ్యంలో అక్కడ రైతులకు చెరకు వేయవద్దని నచ్చజెప్పాలి. రైతులు చెరకుకు బదులు పళ్ల తోటలు పెంచితే ఎంతో బాగుపడతారు. ఇలాంటి సాగు మార్పు కోసం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే మెరు గైన ఫలితాలు వస్తాయి. కాని, చెరకు సాగు తగ్గించి, పళ్ల తోటల పెంపకం ప్రారంభిస్తే ఎన్నికలు జరిగే 2019 మే నాటికి రైతులకు లాభాలు కనిపించవు. అందుకే చెరకు పంట విషయంలో విధానాలేవీ తక్ష ణమే మారవు. మితిమీరిన చెరకు దిగుబడి కొన సాగక తప్పదు. కైరానా ఉప ఎన్నిక తెచ్చిన మార్పు ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతం లోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవ సాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. తాము ఘర్షణ పడిన ముస్లిం లతో కలసి రైతులు తమను ఓడించారనే విషయం బీజేపీకి అర్థమైంది. రైతులకు వచ్చిన కోపం ముస్లిం లతో ఉన్న కలహాన్ని మర్చిపోయేలా చేసింది. అయితే, ఓటర్లను రెండు మత వర్గాలుగా చీల్చి ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికి యూపీ సీఎం యోగీ ఆది త్యనాథ్ చేసిన చౌకబారు ఎత్తుగడ ఫలించలేదు. ఎప్పుడో మరణించిన పాకిస్తాన్ స్థాపకుడు జిన్నా పేరు ఉచ్చరిస్తూ హిందుల ఓట్లను రాబట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీ నేతలు జిన్నా పేరు చెప్పి రైతులను లొంగదీయాలని చూస్తే, ప్రతిపక్షం గన్నా(హిందీలో చెరకు) పేరుతో రైతులను ఆకట్టుకుంది. చివరికి ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. కైరానాలో ఓడిపో యిన మరుసటి రోజే పంజాబ్‌లో మిత్రపక్షమైన శిరో మణి అకాలీదళ్ ఎప్పటి నుంచి చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించింది. అదేమంటే– సిక్కు గురుద్వారాల్లో సమూహిక భోజనాలకు (లంగర్లు) వాడే ఆహార పదార్థాలపై జీఎస్టీని కేంద్రసర్కారు రద్దు చేసింది. అలాగే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీ యాధ్యక్షుడు అమిత్‌షా మధ్య శత్రుత్వమే ఉందనే విషయం తెలిసిందే. మహారాష్ట్రలో సంకీర్ణ భాగస్వా మిని బుజ్జగించడానికి అదే వారం అమిత్‌షా, తను ఎంపికచేసిన సీఎంను వెంటపెట్టుకుని ఉద్ధవ్ ఇంటికి వెళ్లారు. తండ్రి బాల్ ఠాక్రే తెలివితేటలు పుణికి పుచ్చుకున్న ఉద్ధవ్ బీజేపీ నేతలకు కొత్త గుణపాఠం చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ బయటే వేచి ఉండేలా చేశారు. సీఎం ఇంతటి అవమానం ఎందుకు భరిం చాలి? మెజారిటీతో మరుగున పడిన సంకీర్ణధర్మం నాలుగేళ్ల క్రితం బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడా ల్సిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీ దక్కింది. సంకీర్ణ ధర్మం పాటిస్తానని బీజేపీ చెప్పినాగాని అధికారం, జనాదరణ ఈ తరంలో ఎవరికీ లేనం తగా ప్రధానికి ఉండడంతో ఆయన ముందు మిత్ర పక్షాలన్నీ సాగిలపడ్డాయి. పరిస్థితి గమనించిన ‘వాతావరణ నిపుణుడు’ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ లౌకిక కూటమిని వదలి అవినీతి వ్యతిరేక పంథాతో బీజేపీ శిబిరంలో చేరారు. ఇప్పుడేమో ఆయన బిహా ర్లో ఎన్డీఏ అంటే స్థానిక ఎన్డీఏ అనే రీతిలో మాట్లా డుతున్నారు. మగ్గురు ఎంపీలున్న చిన్న బీహార్ పార్టీ ఆరెలెస్వీ నేత, కేంద్ర మంత్రి అయిన ఉపేంద్ర కుశ్వాహా పట్నాలో జరిగిన ఎన్డీఏ విందుకు హాజరు కాకుండా బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు. ‘మీకు మెజారిటీ ఉన్నా మీరు బలహీనపడ్డారు. కాబట్టి మేం గట్టిగానే బేరమాడతామనే విషయం గుర్తించండి,’ అనేది ఈ మిత్రపక్షాల సందేశంగా కని పిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కొద్ది నెలల క్రితం బీజేపీకి కంచుకోటలని భావించిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోయిన ప్పుడే మోదీ సర్కారు వేగానికి మొదటి దెబ్బతగి లింది. బీజేపీని ఎన్నికల్లో ఓడించడం సాధ్యమయ్యే పనేననే సూచనలు అందరికీ కనిపించాయి. అప్పటి నుంచి బీజేపీ కంగారుతో అనేక తప్పులు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అవినీతిపై యుద్ధం ప్రక టించిన ఈ పార్టీ కర్ణాటకలో బళ్లారి సోదరులతో చేతులు కలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే బీజేపీతో ఈ పని చేయించింది. వాస్తవానికి కర్ణాటకలో శాసనసభ ఎన్నికల నాటికి నరేంద్రమో దీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీజేపీకి సాధా రణ మెజారిటీ సాధించిపెట్టే స్థాయిలో మోదీకి జనా కర ్షణ శక్తి ఉంది. అయితే, బళ్లారి సోదరుల రంగ ప్రవేశంతో ఓటర్లలో అనుమానాలు రేకెత్తాయి. ఫలి తంగా, వారు తమ పలుకుబడితో 15 సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని అంచనావేయగా, చివరికి కమలం పార్టీకి మూడు సీట్లే లభించాయి. దీంతో 2019 ఎన్నికల్లో బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం కోల్పోయింది. కేంద్ర వ్యవ సాయ మంత్రిగా నియమించిన బీజేపీ నేతకు ఆ పదవి ఆయన తెలివితేటల వల్ల రాలేదు. ఫలితంగా, నాలుగేళ్లలో దేశ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు యూపీఏ పదేళ్ల అభివృద్ధితో పోల్చితే దాదాపు సగా నికి పడిపోయింది. యూపీఏ హయాంలో 3.7 వార్షిక సగటు వృద్ధిరేటు ఉన్నాగాని అప్పుడు కూడా వ్యవ సాయంలో సంక్షోభం కొనసాగింది. వ్యవసాయశాఖ కొత్త తరహా సేంద్రియ ఎరువును రైతులకు అంద జేస్తోంది. మనమంతా ‘మాత’గా పిలిచే దేశవాళీ ఆవు పేడలో మాత్రమే లభించే మంచి బాక్టీ రియా(సూక్ష్మజీవులు)తో ఈ ఎరువు రూపొందించి కేంద్ర వ్యవసాయశాఖ నామమాత్రపు ధరకు రైతు లకు సరఫరా చేస్తోంది. ఈ రకమైన వినూత్న ఎరు వులు ఉపయోగించి 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమా? అంటే, అనుమానమే. చెరకు లేదా చక్కెర సమస్య హఠాత్తుగా ఊడిపడినది కాదు. గత నాలుగేళ్లుగా నానుతూ ఇప్పటికి ముదిరి పోయింది. ఇంతకు ముందే ఈ సమస్యను గుర్తించి, పరిష్కరించే తీరిక పాలకులకు లేకపోయింది. రెండోది.. పెద్దగా విలువ లేని కొత్త ముఖ్యమంత్రుల నిర్లక్ష్యపూరితమైన ఎంపిక. వీరిలో ప్రతిఒక్కరూ ఇప్పుడు తమను తాము నిరూపించుకోవల్సి ఉంది. తమ తమ రాష్ట్రాలలో అన్ని స్థానాల్లోనూ ప్రజామోదాన్ని గెల్చుకున్న ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురైనవారే. ఇక మూడో అంశం ఏదంటే, పరమ అహంభావపూరిత వైఖరితో మిత్రపక్షాలతో వ్యవహరించినందుకు అది చెల్లిస్తున్న మూల్యం. ఈ తరం రాజకీయనేతలు పూర్తి మెజారిటీతో పాలన సాగించే అనుభవాన్ని కోల్పోయారని మనకు బాగా తెలుసు. ప్రజలు రాజకీయాల్లో ఎందుకు చేరుతున్నారనే కారణానికి సంబంధించిన వాస్తవాన్ని బీజీపే ఇప్పుడైనా నమ్రతతో అంగీకరించాలి. అధికార కుమ్ములాటలో తమకూ వాటా కావాలని అందరూ కోరుకుంటున్నారు. మిత్రపక్షాలకు ఎలాంటి మంత్రిపదవులనూ బీజేపీ ఇవ్వలేదు. అకాలీలు బీజేపీకి చాలా విశ్వసనీయమైన మిత్రపక్షం. ఆ పార్టీలోని పాలకకుటుంబానికి చెందిన ఒక కోడలికి మాత్రమే మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ కల్పించారు. అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కట్టబెట్టారు. ఆమె స్వరాష్ట్రంలో ఆమెను చట్నీ, జామ్ మురబ్బాలు వడ్డించే మంత్రిగా పేరుపడింది. శివసైనికుడైన అనంత్ గీతే పోర్ట్ ఫోలియో మీకు తెలుసా? ఏ మిత్రపక్షానికీ తమ స్వంత విశ్వాసంతో పాలించగలిగే అవకాశం దక్కలేదు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది కానీ ఆ పార్టీ మాత్రమే పాలనా పగ్గాలను గుప్పిట్లో పెట్టుకుంది. దాని చర్యలే దాని ఫలితాలను నేడు నిర్దేశిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితులలో పరిణిత రాజకీయ పార్టీలాగా కాకుండా శైశవదశలో మరో అతిపెద్ద విజయాన్ని సాధించడానికి అది కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
తొలి ముస్లిం లోక్‌సభ సభ్యురాలు
లక్నో: కైరానా (యూపీ) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన తబస్సుమ్ హసన్ చరిత్ర సృష్టించారు. 2014 నుంచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టిన యూపీ ముస్లింగా ఆమె చర్రిత సృష్టించారు. బీజేపీ అభ్యర్థి మృగంకా సింగ్‌పై తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో కైరానా నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి ముస్లింగా తబస్సుమ్ నిలిచారు. 2014లో బీజేపీ-ఆప్నాదళ్ కూటమి మోదీ హవాతో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన సీట్లను కాంగ్రెస్-ఎస్సీ కూటమి సొంతం చేసుకుంది. వీరిలో ఒక్క ముస్లిం కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్సీ- బీఎస్సీ కూటమి ముస్లిం అభ్యర్ధులను బరిలో నిలపలేదు. ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్ నిలవగా, రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్ అలీ ఖాన్, తన్జీమ్ ఫాట్మాలు ఎస్సీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కిరాణ షాపులకు తక్కువ ధరకే సరుకులు
–రూరల్ రిటైల్ చైన్‌తో ప్రయోజనం –డీపీఎం వసంత కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కిరాణాషాపుల్లో విక్రయించేందుకు అవసరమైన సరుకులను తక్కువ ధరకే రూరల్ రిటైల్ చైన్ ద్వారా అందజేయనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు డీపీఎం వసంత చెప్పారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రూరల్ రిటైల్ చైన్ కింద జిల్లాలో జూపాడుబంగ్లా, కొత్తపల్లి, బేతంచెర్ల, పెద్దకడుబూరు, దేవనకొండ మండలాలను ఎంపిక చేశారన్నారు. ఈ మండలాల్లో చిన్న చిన్న కిరాణాషాపులను గుర్తించి 50 మందికి పైగా సభ్యులతో మండల నోడల్ స్టోర్‌గా ఏర్పాటు చేసి మేనేజర్‌ను నియమిస్తారన్నారు. ఆ మేనేజర్ ద్వారా ఎంపికైన వారిచే రూ.5000ల చొప్పున వాటాధనం కట్టిస్తారన్నారు. అనంతరం జిల్లా కో ఆపరేటివ్ కార్యాలయంలో ఎంపికైన బాడీని రిజిస్టర్ చేయిస్తారని తెలిపారు. ఈ సంఘానికి వ్యాట్, పాన్‌కార్డు తీసుకున్న అనంతరం ప్రభుత్వం రూ.10లక్షలు మూలధనం ఇస్తుందన్నారు. వాటాధనం, ప్రభుత్వ మూలధనం కలిపి సరుకులను ఉత్పత్తి చేసే కంపెనీల నుంచే టోకుగా సరుకులు కొనుగోలు చేస్తారన్నారు. సంఘంలో సభ్యులైన కిరాణాషాపుల వారు మండల నోడల్ స్టోర్ నుంచి తక్కువ ధరకు సరుకులను కొనుగోలు చేసి విక్రయించవచ్చన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానం జూపాడుబంగ్లాలో అమలు చేస్తున్నామని, మిగిలిన మండలాల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు.