first phase councelling
-
ఏపీ ఎడ్ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఏపీ ఎడ్ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఎడ్ సెట్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కే రామమోహన్ రావు షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కాన్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టగా.. 26 నుంచి 31 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుందని తెలిపారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న విజయవాడ లయోలా కాలేజ్‌లో సర్టిఫికేట్లు పరిశీలించన్నట్లు పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా.. నవంబర్ మూడో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పుకి అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 5న విద్యార్ధులకు సీట్ల కేటాయించనున్నారు. నవంబర్ 7నుంచి 9లోపు కళాశాలలో చేరేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. నవంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. -
ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఎస్కేయూసెట్–2017 కౌన్సెలింగ్‌కు విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. గత నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. ప్రారంభంలో పీజీ సీట్లు భారీగా మిగిలిపోయాయని భావించారు. ఆతర్వాత విద్యార్థుల హాజరుసంఖ్య పెరిగింది. దీంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు ఊరట లభించింది. మొత్తం 3,403 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. జూలై 8 నుంచి రెండో దఫా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. వెబ్ ఆప్షన్ల ఇవ్వడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో అందుబాటులో 1,084 సీట్లు అందుబాటులో ఉండగా, అనుబంధ పీజీ కళాశాలల్లో 3,490 సీట్లు, మొత్తం 4,574 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సర్టిఫికెట్ల పరిశీలనకు 3,403 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,090 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి 2వతేదీ (1వతేదీ ఉన్నప్పటికీ ఒక రోజు పొడిగించారు)చివరి తేదీగా నిర్ణయించారు. రెండో దఫా కౌన్సెలింగ్ ఈనెల 8వతేదీ ప్రారంభం అవుతుంది. -
నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, పీజీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 తొలి దఫా కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. జులై 6వ తేదీలోపు ఆన్లైన్ విధానం ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు. -
'జయశంకర్'లో ముగిసిన మొదటి విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల మొదటి విడత కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. బీఎస్సీ అగ్రికల్చర్లో 312 సీట్లకుగాను 285 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే బీఎస్సీ హార్టికల్చర్‌లో 100 సీట్లకు గాను 59 సీట్లు భర్తీ అయ్యాయి. బీఎస్సీ సీఏబీఎంలో 15 సీట్లు భర్తీ అయ్యాయి. ఫుడ్ టెక్నాలజీలో 15 సీట్లకు గాను 4 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. బీఎస్సీ ఫిషరీస్‌లో 2 సీట్లు భ ర్తీ అయినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.వీ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.