Fish children
-
80 కోట్ల చేప పిల్లల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రానున్న వానాకాలం సీజన్లో 80 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఆక్వా ఎక్స్పో ఇండియా–2018 అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను హెచ్ఐసీసీలో నిర్వహించనుందని తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ వేదిక ఇదని వివరించారు. అంతర్జాతీయంగా అభివృద్ధి పరిచిన సాంకేతిక విధానాలు, కొత్త జాతులు, వాటిని ఉత్పత్తి చేసే విధానాలు, మంచి యంత్ర సామగ్రి, నాణ్యమైన ఉత్పత్తులు, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు నాణ్యతపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో మటన్, చికెన్, చేపల మార్కెట్లు ఒకే దగ్గర ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 40 ఫిష్ మార్కెట్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై కక్ష కాదు... బీజేపీ, కాంగ్రెస్‌లపై కక్ష కాదని, జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని తలసాని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచనపై దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందిస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం స్పందించడం లేదన్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం కనిపిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్లో రైతుల కోసం రూ. 2 లక్షల కోట్లు ఎందుకు కేటాయించలేదనేది కేసీఆర్ అభిప్రాయమన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అద్భు తాలు చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు చేయలేరనేది కేసీఆర్ అభిప్రాయమన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపి స్తూ ఇతర రాష్ట్రాలకు కేంద్రం ఏమీ నిధులు కేటాయించడం లేదని తలసాని విమర్శించారు. -
ఆక్వాపోనిక్స్‌తో సత్ఫలితాలు!
ఇంటిపట్టున స్వల్ప ఖర్చుతో, వనరులు వృథా కాకుండా చేపలను సాగు చేయడం, చేపల విసర్జితాలు కలిసిన నీటిని కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరిగే కుండీలు, టబ్‌లకు అందించడాన్ని ఆక్వాపోనిక్స్ (రీ సర్యు్యలేటింగ్ ఆక్వాపోనిక్స్ సిస్టం– ఆర్.ఎ.ఎస్.) వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ పద్ధతిలో మట్టిని వాడాల్సిన అవసరం లేదు. చేపలకు మేత వేస్తే చాలు. మొక్కలకు ఎరువులు వేయనక్కర లేదు. చేపల విసర్జితాలతో కూడిన నీరు సూక్ష్మ, స్థూల పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నీటిని మొక్కల వేళ్లకు అందిస్తే.. అందులోని పోషకాలను గ్రహించి కూరగాయలు, ఆకుకూరలు చక్కగా పెరుగుతాయి. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు అమ్మోనియాను నైట్రైట్‌గా, తదనంతరం నైట్రేటుగా మార్చి మొక్కలకు అందిస్తాయి. ఇందులో వాడే నీటిలో 90%, పోషకాలలో 100% వృథాపోకుండా ఉపయోగించడానికి అవకాశం ఉంది. తద్వారా పూర్తిగా సేంద్రియ చేపలు, ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవచ్చని మహారాష్ట్ర పుణే జిల్లా పబల్‌లోని ‘విజ్ఞాన ఆశ్రమం’ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కొత్త ఆలోచనతో ఈ ఆశ్రమానికి వచ్చే వ్యక్తికి తదనంతర పరిశోధనకు సహాయపడి.. ఆ పరిశోధనా ఫలితాల ద్వారా ఆ వ్యక్తి ఉపాధి పొందేలా తోడ్పాటునందించడం విజ్ఞాన ఆశ్రమం ప్రత్యేకత. గత 5 నెలలుగా ఆక్వాపోనిక్స్‌పై అధ్యయనం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2 గ్రాముల గ్రాస్ కార్ప్ చేప పిల్లలు వేస్తే.. 5 నెలల్లో 30–450 గ్రాముల వరకు బరువు పెరిగాయి. చేపలకు అజొల్లా/బెర్సీమ్‌తోపాటు నీటిలో తేలియాడే బలపాల మేతను (40:40:10 నిష్పత్తిలో) వేస్తున్నారు. 50 వేల లీటర్ల నీటి ట్యాంకులో వెయ్యి చేప పిల్లలు వేశారు. కొన్ని పిల్లలు తీసేస్తే చేపల పెరుగుదల మరింత బాగుంటుందని భావిస్తున్నారు. చేపల నీటితో టమాటాలు, కలబంద, పాలీహౌస్లో గులాబీలను సాగు చేస్తున్నారు. జూన్ నాటికి పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. వివరాలకు.. Email: vigyanashramvideo@gmail.com -
మత్స్యకారులకు చేయూత
మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని కోమటి చెరువులో 1.20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేవలం నీటి పారుదల శాఖ చెరువుల్లో మాత్రమే చేప పిల్లలను వదిలే వారన్నారు. ఈ ఏడాది ఐబీ చెరువులతో పాటు కుంటలు, చెక్‌డ్యామ్‌లు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేపపిల్లలను అందిస్తున్నామని చెప్పారు. 50 శాతం నీరు చేరిన చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరల కోసం రూ.222 కోట్లు వెచ్చిస్తున్నామని, రాష్ట్రంలో కోటి మందికి అందించాలని లక్ష్యమన్నారు. -
చేపల కేంద్రంపై నిర్లక్ష్యం
కడెం : జిల్లాలోనే పెద్దది కడెంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ఏటా రూ.మూడు కోట్ల వరకు చేప పిల్లల ఉత్పత్తి జరిగేది. కేంద్రంలో అధికార్లు,సిబ్బంది కూడా పూర్తిస్థాయి లో ఉండేవారు. దశాబ్దకాలంగా కేంద్రం నిరాదరణకు గురవుతోంది. అధికార్లు,సిబ్బంది మూడేళ్లక్రితం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కేంద్రం అధికారి పోస్టును లక్షెట్టిపేటలోని అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో దాదాపుగా 55 వరకు నీటి తొట్టిలు, చేప పిల్లలను ఉత్పత్తి చేసే హాచరీలు, జనరేటర్ గది, అధికారి కార్యాలయం,సిబ్బంది గదులు,మ్యూజియం హాలు,సమావేశం గది ఉన్నాయి. వీటన్నింటినీ గాలికి వదిలేశారు. తల్లి చేపలుండే నాలుగు పెద్ద కుంటలున్నాయి. వాటికీ రక్షణ లేదు. కేంద్రంలో ఇద్దరు మత్య్సకేంద్రాభివృద్ధి అధికార్లు, క్షేత్ర సహాయకులు ఐదుగురు, ఇతర సిబ్బంది ముగ్గురు స్థాని కంగా ఉండడంలేదు. కేంద్రానికి ఇన్చార్జి ఎఫ్‌డీవోలు ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. మత్స్య కార్మికుల ఉపాధికోసం గతంలో రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాల నుం చి చేప పిల్లలను తెచ్చి ఇక్కడ పెంచి కడెం రిజర్వాయర్‌లో వేసేవారు. మూడేళ్లుగా తెప్పించడం లేదు.