Fish Haleem: ఇంట్లోనే ఫిష్ హలీమ్ తయారీ ఇలా!
Recipes In Telugu- బలవర్థక ఆహారంలో హలీమ్ కూడా ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే ఫిష్ హలీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం!
ఫిష్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చేప ముక్కలు – అరకేజీ, గోధుమ రవ్వ – కప్పు(రాత్రంతా నానబెట్టుకోవాలి), పచ్చిశనగపప్పు – పావు కప్పు (మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి), పెసరపప్పు – పావు కప్పు (దోరగా వేయించి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి), మినపప్పు – పావు కప్పు (మూడు గంటపాటు నానబెట్టుకోవాలి), అల్లం పేస్టు – టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్టు – ముప్పావు టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి
(సన్నగా తరుక్కోవాలి)
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – అరటేబుల్ స్పూను, గరం మసాలా – టేబుల్ స్పూను, మిరియాలపొడి – టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – అరకప్పు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని నిమ్మచెక్కలు – రెండు మూడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – పావు కప్పు, వేయించిన జీడిపప్పు – టేబుల్ స్పూను.
తయారీ:
►చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, అరటేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టులు, కారం వేసి కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ∙నానబెట్టిన చేపల్లో ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసి ఉడికించి దించేయాలి ∙ఉడికిన చేపముక్కలను ఖీమాలా రుబ్బుకోవాలి.
►పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాలను పేస్టుచేసుకోవాలి.
►కుకర్‌లో పప్పులన్నింటిని వేసి మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి.
►ఇప్పుడు కుకర్ గిన్నెలో రాత్రంతా నానబెట్టుకున్న గోధుమరవ్వ, రబ్బుకున్న పప్పు మిశ్రమం, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, ►మిరియాలపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలో వేసి కలుపుకోవాలి.
►ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న చేపమిశ్రమాన్నివేసి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు సన్నని మంటమీద ఉడికించాలి.
►మందపాటి పాత్రను స్టమీద పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి.
►ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి, ఉడికిన చేప మిశ్రమంలో వేయాలి. నిమ్మరసం, కొత్తిమీర తరుగు, నెయ్యి, నిమ్మ చెక్కల, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఫిష్ హలీమ్ రెడీ.
చదవండి👉🏾Haleem Recipe In Telugu: రంజాన్ స్పెషల్.. ఎవరైనా సింపుల్‌గా చేసుకోగలిగే మటన్ హలీమ్