'చెట్టున్నపాలెం' ఘటనలో ప్రత్యర్థులు లొంగుబాటు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం చెట్టున్నపాడులో చేపల చెరువుల లీజు వివాదంపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఓ వర్గం వారు శనివారం పోలీసులకు లొంగిపోయారు. గత సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఓ వర్గం వారు ఈరోజు ఉదయం భీమడోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎస్ఐ సుధాకర్ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురైన విషయం తెలిసిందే.