టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌లు నూతన ఎమ్మెల్సీలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావును మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచరం.