జలాంతర్గామిలో పొగలు.. ఐదుగురికి అస్వస్థత
ముంబై తీరంలో ఓ జలాంతర్గామిలో ప్రమాదం సంభవించింది. జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న నుంచి పొగ రావడంతో నౌకాదళ సిబ్బంది ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. మొత్తం ఐదుగురు సెయిలర్స్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. కేవలం నావికులు మాత్రమే కాక, పశ్చిమ కమాండ్ లోని సీనియర్ అధికారి కూడా జలాంతర్గామిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
గతంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అందులో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం కూడా సంభవించడంతో 18 మంది సిబ్బంది మరణించారు. ఇది కూడా ముంబై తీరంలోనే జరిగింది.