అమెరికా జాతీయ జెండాను దగ్ధం చేసిన వ్యక్తి అరెస్టు
న్యూయార్క్: అమెరికా జాతీయ జెండాకు నిప్పంటించడమే కాకుండా సదరు ఫొటోలను ఫేస్బుక్లో పోస్టుచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లినాయిస్కు చెందిన బ్రైటన్ మెల్లోట్ ఈ వారం ఆరంభంలో అమెరికా జాతీయ జెండాకు నిప్పంటించడమే కాకుండా సదరు ఫోటోలను సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
అంతటితో ఆగకుండా అమెరికా జాతీయుడినైనందుకు తనకు ఏమాత్రం గర్వంగా లేదని అందులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫాక్స్59.కామ్ సంస్థ వెల్లడించింది.