Floop cinema
-
అప్పుడు బాధపడతా
‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్’ వంటి చిత్రాల్లో నటించి వెండి తెరపైకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత ‘ఛత్రపతి, దేవదాసు, శివాజీ’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్గా దాదాపు 16ఏళ్ల కెరీర్‌ను కంప్లీట్ చేశారు. ఇన్నేళ్ల జర్నీలో ఫ్లాప్ అయిన సినిమాల గురించి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అన్న ప్రశ్నను శ్రియ ముందు ఉంచితే– ‘‘నా సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నేను నిరుత్సాహపడలేదు అని చెబితే అది అబద్ధం అవుతుంది. ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు కెరీర్‌పై కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఫెయిల్యూర్ సినిమాకి చాలా ఫీలవుతాను. సినిమా ఫీల్డ్‌లో తప్పులను కరెక్ట్ చేసుకోవడం కష్టం. పుస్తకాలను ఎంచుకున్నంత బాగా నేను స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకోలేను. అలాగే నాకు బాగా కనెక్ట్ అయిన వారితోనే నేను ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చారు శ్రియా. ప్రస్తుతం ఆమె చే సిన సినిమాల విషయానికొస్తే సౌత్‌లో ఆమె నటించిన ‘నరగాసురన్, వీరభోగ వసంతరాయలు’, హిందీలో ‘తడ్కా’ మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చివ్‌తో శ్రియ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
సినిమా ఫ్లాపయినా... హిట్ సంబరాలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల సినిమా ఫ్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వందరోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అంబటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్నిచోట్ల బొగ్గులేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే విద్యుత్ వెలుగులు అంటూ బాబు గొప్పలు చెబుతున్నారన్నారు. రుణమాఫీపై చంద్రబాబు చేశారా అని ఈ సందర్భంగా అంబటి సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్ధానాలు చేశారని, పాదయాత్రలో మరో 300 వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్క వాగ్దానాన్నీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా అన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు ...మద్యం అమ్మకాలు ఎక్కడైనా తగ్గాయా .... పదవీ విరమణ వయస్సును ఎవరికి పెంచారని అంబటి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పరిపాలన అధ్వాన్నంగా ఉందే తప్ప...ఏమాత్రం మెచ్చుకోదగ్గ పాలన కొనసాగలేదన్నారు. రుణమాఫీ చేస్తానన్న బాబు... మాఫీ అమలు కోసం కమిటీ వేశారని, మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మళ్లీ తను ఒక కమిటీ వేసి చంద్రబాబే ఏపీ రాజధానిని ప్రకటించారని అంబటి విమర్శించారు. శాసనసభలో చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.