ఊరికి ఉపకారి
ఉచితంగా ప్రజలకు పిండి పట్టిస్తున్న షేక్షావలీ
శివపురం(కొత్తపల్లి): చిల్లర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలకు తన వంతు చేయూతను అందించేందుకు ఓ జిన్ను నిర్వాహకుడు ముందుకు వచ్చారు. ఒక కుటుంబంలో మూడు పళ్ల జొన్నలు తీసుకుని వస్తే ఉచితంగా పిండి జిన్ను ఆడించి ఇస్తానని గ్రామంలో దండోరా వేయించారు. శివపురం గ్రామానికి చెందిన కొండపల్లి షేక్షావలీ పిండి జిన్ను నిర్వహిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతోగ్రామస్తులు చిల్లర కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కొన్ని కుంటుంబాలు పస్తులు ఉండడం గమనించిన షేక్షావలీ.. గ్రామంలోని పేద, ధనిక తేడా లేకుండా అందరికీ తన పిండి జిన్నులో జొన్నలు పట్టించి ఉపకారం చేయడానికి ముందుకు వచ్చారు. గ్రామంలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.