flower show
-
పుష్ప ప్రదర్శనలో సినీ నటి ప్రేమ సందడి (ఫొటోలు)
-
10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే!
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో జనవరి మూడున ప్రారంభమై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక థీమ్‌ను రూపొందించారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన పూల శిల్పాలు, కీర్తి స్తంభం, ఒలింపిక్ టార్చ్, గర్బా నృత్యం లాంటి అందమైన దృశ్యాలు సందర్శకులను సమ్మోహనపరుస్తున్నాయి. హల్క్, డోరేమాన్ తదితర కార్టూన్ పాత్రలను పూలతో తయారు చేశారు. ఇవి పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో సందర్శకులతో నిత్యం రద్దీగా ఉంటోంది.ప్రస్తుతం జరుగుతున్న ఫ్లవర్ షో(Flower Show) కోసం రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నైట్ ఫ్లవర్ పార్క్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో 54 లైటింగ్ డిస్ప్లేలు, జంతువుల బొమ్మలతో పాటు ఇతర ఇంటరాక్టివ్ ఫీచర్లున్నాయి. రాత్రిపూట ఈ పార్క్ ఎంతో సమ్మోహనంగా కనిపిస్తోంది.నెల రోజుల పాటు జరిగే ఈ ఫ్లవర్ షో ఉద్దేశ్యం కేవలం వినోదమే కాకుండా పర్యావరణంపై అవగాహన కల్పించడం. పర్యావరణ విషయంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Ahmedabad Municipal Corporation) చూపుతున్న చొరవకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.ఫ్లవర్ షోను ఈసారి ఆరు విభాగాలుగా మలచారు. పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు పూల మధ్య ఆటలాడుకోవచ్చు. ప్రతి పూల బొమ్మకు క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేసి, దానికి సంబంధించిన సమాచారాన్ని వినవచ్చు. ఈ సాంకేతికత సందర్శకులకు మంచి అనుభూతినిస్తుంది.ఈ ప్రదర్శన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కూడా ఆకట్టుకుంటోంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసుగల పిల్లలకు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో ప్రదర్శనను తిలకించేందుకు చిన్నారులు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ ఫ్లవర్ షో అందరినీ అమితంగా ఆకట్టుకుంతోంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడం సందర్శకులకు ఒక మధురానుభూతిగా మిగులుతుందని నిర్వాహకులు అంటున్నారు.అహ్మదాబాద్‌లోనే కాదు.. తమిళనాడులో కూడా ఫ్లవర్ షో జరుగుతోంది. చెన్నైలోని సెంమొళి పూంగాలో 4వ చెన్నై ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. లక్షలాది పూలతో అందాలను చిందిస్తున్న ఈ ప్రదర్శన జనవరి 11 వరకు కొనసాగనుంది.అహ్మదాబాద్, చెన్నై(Chennai)లలో జరిగే ఈ ప్రదర్శనలు సందర్శకులకు కొత్త లోకాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతిపై ప్రేమను అందరిలో పెంపొందిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఫ్లవర్ షోలను తిలకించేందుకు పలువురు విదేశీయులు కూడా ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడి సుమనోహర దృశ్యాలను చూసి మైమరచిపోతుంటారు. ఇది కూడా చదవండి: భారత్‌లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం -
బంఫర్ ఆఫర్: 15 వరకు ఏ మెట్రోస్టేషన్‌కైనా రూ.30
బెంగళూరు: దేశంలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఆజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా నమ్మ మెట్రో రైలు కార్పోరేషన్ రాయితీలను ప్రకటించింది. లాల్‌బాగ్‌లో జరుగుతున్న ఫ్లవర్‌షో ప్రదర్శనకు 13 నుంచి 15 వరకు సందర్శకుల సౌకర్యార్థం బెంగళూరు మెట్రో రైలు మండలి రాయితీ టికెట్ వ్యవస్థ కల్పించింది. శనివారం నుంచి సోమవారం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు లాల్బాగ్ మెట్రో స్టేషన్ నుంచి నగరంలో ఏ మెట్రోస్టేషన్‌కు ప్రయాణించాలంటే టికెట్ ధర రూ.30 నిర్ణయించింది. దీనికోసం పేపర్ టికెట్ పరిచయం చేసింది. ఈ మూడురోజుల పాటు లాల్బాగ్ నుంచి ఏ మెట్రోస్టేషన్‌కైనా ప్రయాణించవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మెట్రోస్టేషన్లలో పేపర్టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. లాల్బాగ్ మెట్రోస్టేషన్లో పేపర్ టికెట్ రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంటాయని మెట్రోమండలి తెలిపింది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
విశాఖ వాసుల కోసం మూడోరోజు ఫ్లవర్ షో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫ్లవర్ షోను చూడటానికి మూడో రోజు కూడా జనం పోటెత్తారు. డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా రెండురోజులు మాత్రమేనని ప్రకటించినప్పటికీ విశాఖ నగర వాసుల సౌకర్యార్థం ఫ్లవర్ షోను మరో రోజు పొడిగించారు. దీంతో పుష్ప సోయగాలను వీక్షించడానికి విశాఖవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు రూ. 60 లక్షల వ్యయంతో ముంబై, కోల్‌కతా, హిమాచల్ ప్రదేశ్, బెంగళూరు ప్రాంతాల నుంచే కాకుండా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ధాయిలాండ్ వంటి ఇతర దేశాల నుంచి సైతం పూలను తెప్పించారు. 15 టన్నుల వివిధ పుష్పాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మిక్కీమౌస్, నెమలి వివిధ రకాల ఆకృతులు పర్యాటకుల మనసును దోచుకున్నాయి. ఫ్లవర్ షోలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్ట్స్, లిలియమ్స, టులిప్స్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, టెలికోనియా వంటి అరుదైన జాతి పువ్వులను చూసి విశాఖ వాసులు ఆనంద పరవశులయ్యారు. వాటి దగ్గర సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మరోవైపు ఫ్లవర్ షో సమీపంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ కలర్ ఫౌంటైన్ ఆకట్టుకుంది. -
అంతా 'షో'కులే..
సాక్షి, విశాఖపట్నం: అంతన్నారింతన్నారు..చివరకు గ్రామాల్లో తీర్థాల కంటే ఘోరంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. రెండో రోజూ కూడా ఉత్సాహాన్ని పుంజుకోలేదు. విశాఖ జనాన్నే కాదు.. ఇతర ప్రాంతాల వారిలోనూ ఆసక్తిని రేకెత్తించలేదు. గత ఏడాది విశాఖ ఉత్సవ్ మూడు రోజులూ కలిపి నాలుగున్నర లక్షల మంది వచ్చారని అధికారులు అంచనా వేశారు. అంటే సగటున రోజుకు లక్షన్నర మంది హాజరైనట్టు లెక్కకట్టారు. కానీ ఈసారి ఉత్సవ్‌కు తొలిరోజు గురువార, మలిరోజు శుక్రవారం కూడా సందర్శకుల తాకిడి నామమాత్రంగానే ఉంది. ఉత్సవాలను తిలకించడానికి జనం పోటెత్తలేదు. వచ్చిన వారంతా కొత్తగా ఏర్పాటు చేసిన టీయూ–142 యుద్ధవిమానం, సాగరతీరంలో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియాలను చూడడానికే ఆసక్తి చూపారు. దీంతో పలువురు సందర్శకులు, పర్యాటకులు అక్కడికే పరిమితమయ్యారు. వీటికి ఆనుకుని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద ఒకింత కనిపించారు. ఇక సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాల వేదిక వద్ద కూడా జనం అంతగా కనిపించలేదు. అక్కడ సాయంత్రం సద్గురు జగ్గీవాసుదేవన్ కుమార్తె రాధే జగ్గీ శాస్త్రీయ నృత్యంతో పాటు ఫ్యూజన్ రాక్‌బ్యాండ్‌లు ఒకింత ఆకట్టుకున్నాయి. ఇక ఎంతో అట్టహాసంగా ప్రచారం చేసిన ‘పరిమళ’ పుష్ప ప్రదర్శనకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అయితే గురువారంతో పోల్చుకుంటే ఒకింత జనం పెరిగారు. అక్కడ 70–80 రకాల పూలను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో విదేశీ పుష్పాలు కూడా ఉన్నాయి. ఎంజీఎం పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకునే రీతిలో వినూత్న పుష్పాలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏటా ఎంతగానో ఆకట్టుకునే దేవాలయాల నమూనాల వద్ద కూడా సందర్శకుల కనిపించలేదు. ఏటా ఈ ఆలయాల వద్ద జనం క్యూ కట్టేవారు. మరోవైపు ఎప్పట్నుంచో ఊరిస్తున్న హెలిటూరిజం తొలిరోజు ఉత్సవ్‌లో ఆఖరి క్షణంలో రద్దయింది. పరువు పోతుందన్న ఉద్దేశంతో దీనిని శుక్రవారం మధ్యాహ్నం రుషికొండ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది హెలికాప్టర్లో షికారు వెళ్లారు. యధావిధిగా రెండో రోజు కూడా జిల్లా, నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు (గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మినహా) ఎంపీలు, జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు అటువైపు తొంగిచూడలేదు. -
బెంగుళూరులో ఆకట్టుకున్న ఫ్లవర్ షో
-
బెంగళూరులో అలరిస్తున్న ఫ్లవర్ షో!
-
లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షో
-
మనుసు దోస్తున్న కొచ్చిప్లవర్ షో