Food and Agriculture Organization - FAO
-
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
ధరాఘాతం నుంచి ఊరట.. అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు మరో శుభవార్త ! వరుసగా రెండో నెల కూడా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) తగ్గింది. ద్రవ్యల్బణానికి ముఖ్యమైన సూచీల్లో ఒకటిగా చెప్పుకునే డబ్ల్యూపీఐ తగ్గనుండటంతో క్రమంగా ధరలు దిగివస్తాయనే ఆశలు కలుగుతున్నాయి. 2021 జులైకి సంబంధించి డబ్ల్యూపీఐ 11.12 శాతంగా నమోదు అయ్యింది. గతేడాది ఇదే నెలకు సంబంధఙంచి డబ్ల్యూపీఐ 12.07 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్రం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే ఒక శాతం పెరగాల్సి ఉండగా తగ్గింది. ఇక ఆహర ధాన్యాలకు సంబంధించి గతేడాది 6.66 శాతం ఉండగా ఈసారి అది 4.46 శాతానికి పడిపోయింది. ఫ్యూయల్, పవర్ సెక్డార్లో 32.85 శాతం నుంచి 2602 శాతానికి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. -
ఆహార భద్రతకు ఆ రెండూ కీలకం
న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతకు ఈ రెండు అంశాలు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు. అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు. ‘‘ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు’’అని వివరించారు. కోవిడ్–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను 80 కోట్ల మందికి అందించిందని మోదీ తెలిపారు. ఈ ఉచిత రేషన్ అనేది యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను మోదీ విడుదల చేశారు. 2023 సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఆచరించేందుకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంగీకరించడం అధిక పోషక విలువలున్న ఆహారానికి ప్రోత్సాహమివ్వడంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. వంగడాలతో కొత్త వెరైటీలు ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. ► ఇనుము, జింక్, కాల్షియం, ప్రొటీన్, లైసీన్, ట్రిప్టోఫాన్, విటమిన్లు ఏ, సీ, యాంథోసైనిన్, ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ల వంటి పోషకాలను వీటితో పొందవచ్చు. ► సాధారణ వంగడాల్లో పోషకాలకు వ్యతిరేకంగా పనిచేసే యురుసిక్ ఆసిడ్, ట్రిప్సిన్ నిరోధకం తదితరాలు కొత్త వంగడాల్లో తక్కువగా ఉంటాయి. ► కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ –4, గిర్నార్ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు. ► జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది. ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం ఆడపిల్లల కనీస వివాహ వయో పరిమితిపై కేంద్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాహానికి తగిన వయసు ఏమిటన్న విషయంపై ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, కనీస వయో పరిమితిని సవరించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా బాలికలు ఎక్కువ సంఖ్యలో బడిలో చేరుతున్నారని ఫలితంగా స్థూల నమోదు నిష్పత్తిలో తొలిసారి బాలికలు పై చేయి సాధించారని వివరించారు. స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో భాగంగా మోదీ ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, పురుషుల విషయంలో ఇది 21 ఏళ్లుగా ఉంది. -
భారత్‌పై మరోసారి మిడతల దాడి
న్యూఢిల్లీ: కరోనాతో కకావికలమైన ఇండియా త్వరలోనే మిడతల రూపంలో మరోసారి ప్రమాదాన్ని ఎదుర్కొబోతున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుభంద సంస్థ వ్యవసాయ ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) హెచ్చరించింది. పంటను నాశనం చేసే ఎడారి మిడతలు జూలైలో మరోసారి భారత్‌పై దాడి చేయనున్నట్లు తెలిపింది. మిడతల వల్ల బాగా నష్టపోయిన రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా మరో 16 రాష్ట్రాలపై మిడతలు మరోసారి దాడి చేయనున్నట్లు కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వర్షాకాలం ముందు మే నెలలో నైరుతి పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌కు వసంత-జాతి మిడుత సమూహాలు వలసలు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. 1962 తరువాత ప్రస్తుతం మొదటిసారి వీటిలో కొన్ని సమూహాలు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించాయని ఎఫ్ఏఓ వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వ్యవసాయ భూముల్లో వృక్షసంపద ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ సమూహాలు ఏప్రిల్‌లో పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. ఇవి కూడా ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ నుంచి వచ్చాయని తెలిపారు. తూర్పు ఆఫ్రికాలోని వాయవ్య కెన్యాలో ప్రస్తుతం రెండో దశ బ్రీడింగ్ జరుగుతుందని.. ఫలితంగా జూన్ రెండవ వారం నుంచి జూలై మధ్య వరకు అపరిపక్వ సమూహాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. సోమాలియా, ఇథియోపియాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. కొత్త సమూహాలు చాలా వరకు కెన్యా నుంచి ఇథియోపియాకు, జూన్ మధ్యకాలం తరువాత దక్షిణ సూడాన్ నుంచి సుడాన్ వరకు ప్రయాణిస్తాయి. మరికొన్ని సమూహాలు ఉత్తర ఇథియోపియాకు వెళతాయి. ఈశాన్య సోమాలియాకు చేరుకున్న సమూహాలు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉంది అని ఎఫ్ఏఓ తెలిపింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) మిడతలు రోజులో 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయి. ఒక చదరపు కిలోమీటర్ మేర ఉన్న సమూహం.. 35,000 మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తింటాయి. రాజస్థాన్‌లోని బార్మెర్, జోధ్‌పూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు మిడతల దాడులను చూస్తూనే ఉన్నాయని భారత ప్రభుత్వ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ (ఎల్‌డబ్ల్యూఓ) కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం 65,000 హెక్టార్ల ప్రాంతంలో మిడతలు నియంత్రించబడ్డాయని.. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కొత్త మిడతల సమూహాలు లేవని ఆయన అన్నారు. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతల దాడులను నియంత్రించడానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వాడకాన్ని చూసే అవకాశం ఉందని ఎల్‌డబ్ల్యూఓ తెలిపింది. రాత్రిపూట చెట్లపైకి చేరిన తర్వాత మిడతలు మీద రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లు, ఫైర్ టెండర్లు, ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో కదులుతున్న మిడతల దండును నియంత్రించడానికి హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తాము అని గుర్జార్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాల్లో శుక్రవారం మిడతలు కనిపించాయన్నారు. రాజస్థాన్‌లో, బార్మెర్, పాలి, జోధ్‌పూర్, జలూర్, నాగౌర్, బికనేర్ వంటి ప్రదేశాల్లో మిడుత సమూహాలు కనిపించాయన్నారు. -
మిడతల దండుపై దండయాత్ర
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) హెచ్చరించింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్ఏవో వెల్లడించింది. -
పొలం పనికి ఎండ దెబ్బ!
ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా. ► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ. ► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి. ► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది. ► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. ► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది. ► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది. ► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది. ► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. ► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. -
ఈ కలబంద కడుపు నింపుతుందా?
జనాభా పెరిగిపోతోంది.. ఇంకొన్నేళ్లు పోతే తినే తిండికీ పోటీ వచ్చేస్తుందన్న అనుమానాలు బలపడుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ వినూత్న ఆలోచనకు తెరతీసింది. ఎడారుల్లో మాత్రమే పండే కలబంద మొక్కలతో భవిష్యత్ తరానికి ఆహార భద్రత ఇవ్వవచ్చునని ఈ సంస్థ అంటోంది. ముళ్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కలబంద (పియర్స్ కాక్టస్) మాత్రమే సుమా! మెక్సికోలో పండే ఈ మొక్కలను ఏదో గాలికి పెరిగేవాటిగా కాకుండా ఆహార పంటగా పండించాల్సిన అవసరముందని ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని సూచిస్తోంది. రెండేళ్ల క్రితం మడగాస్కర్‌లో కరువు వచ్చినప్పుడు కలబంద మొక్కలే ఆదుకున్నాయని, మనుషులకు ఆహారంగా.. దప్పికతీర్చే తీరుగా, పశుదాణాగానూ విస్తృతంగా వాడారని తెలిపింది. మెక్సికన్లు ఈ మొక్కలను ఆహారంగా మాత్రమే కాకుండా షాంపూ మాదిరిగా, రకరకాల వ్యాధులకు మందులుగానూ వాడుతున్నారట. తన ఆకుల్లాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయగల ఈ మొక్కలు అటు నేల సారాన్ని పెంచేందుకూ పనికొస్తాయి. దాదాపు మూడు ఎకరాల నేలలో పండే కలబంద మొక్కల్లో ఏడాదికి దాదాపు 180 టన్నుల నీరు నిల్వ చేరుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. విపరీతమైన చలి, వేడి పరిస్థితుల్లో ఎదుగుదల మందగించినా ఈ కలబంద మొక్కలతో మేలే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్ఏవో అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి మొక్కలను ప్రోత్సహించాలని సూచిస్తోంది. -
ఆహార ధరలు తగ్గాయ్
ఐరాస ఎఫ్ఏఓ వెల్లడి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆహారోత్పత్తుల ధరలు మేలో 3.2 శాతం తగ్గాయి. ఇలా ఆహారధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల అని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహారం, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్ఏఓ) తెలిపింది. పాల ఉత్పత్తులు, ధాన్యాలు, వంట నూనెల ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించడమే ధరల తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఎఫ్ఏఓ వెల్లడించిన వివరాల ప్రకారం.., గత ఏడాది మేలో 214.6 పాయింట్లుగా ఉన్న ఎఫ్ఏఓ ప్రైస్ ఇండెక్స్ ఈ ఏడాది మేలో 3.2 శాతం క్షీణించి 207.8 పాయింట్లకు తగ్గింది. ఈ ప్రైస్ ఇండెక్స్‌లో ధాన్యాలు, చమురు విత్తనాలు, పాల ఉత్పత్తులు, మాంసం, పంచదార తదితర ఆహార ఉత్పత్తుల ధరలను కలిపి లెక్కిస్తారు.సాగు పరిస్థితులు సవ్యంగా ఉండడం, మంచి దిగుబడి వస్తుందనే అంచనాలతో మొక్కజొన్న ధరలు క్షీణించడంతో ఆహార ధాన్యాల ధరల సూచీ 13 శాతం తగ్గింది.బియ్యం ధరలు స్వల్పంగా తగ్గాయి. గోధుమ ధరలు ప్రారంభంలో పెరిగినా, రెండు వారాల తర్వాత తగ్గాయి. ఎల్‌నినో కారణంగా ఉత్పత్తి తగ్గుతుందనే అంచనాలతో మే నెల ప్రారంభంలో పంచదార ధరలు పెరిగాయి. అయితే భారత్, థాయ్‌లాండ్‌ల్లో భారీ చక్కెర నిల్వలు చోటు చేసుకుంటాయనే సంకేతాల కారణంగా మూడో వారం నుంచి ధరలు తగ్గాయి.ఆగ్నేయాసియాలో పామాయిల్ ఉత్పత్తి పెరగడం, దక్షిణ అమెరికాలో సోయాబీన్ క్రషింగ్ అధికంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా సోయాబీన్ దిగుబడులు ఆశావహంగా ఉంటాయన్న అంచనాలతో వంటనూనెల ధరల సూచీ వరుసగా రెండో నెల కూడా క్షీణించింది.కాగా మాంసం ధరల సూచీ మాత్రం ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి మార్పులకు గురి కాలేదు.