former cricketer dies
-
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కన్నుమూత
వెస్టిండీస్ మాజీ టెస్టు క్రికెటర్ బ్రూస్ పైరౌడో గురువారం కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల బ్రూస్ పైరౌడో గురువారం ఉదయం న్యూజిలాండ్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. 1931 ఏప్రిల్ 14న అప్పటి బ్రిటీష్ గయానాలో బ్రూస్ పైరౌడో జన్మించాడు. 1953-57 మధ్య కాలంలో విండీస్ తరపున 13 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రూస్ పైరౌడో ఒక సెంచరీ సాయంతో 454 పరుగులు చేశాడు. ఆ ఒక్క సెంచరీ కూడా 1953లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇక ఆయన ఆడిన 13 టెస్టుల్లో ఏడు టెస్టులు స్వదేశంలో.. మిగతా ఆరు టెస్టులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ గడ్డపై ఆడాడు. ఇక 26 సంవత్సరాల వయసులో బ్రూస్ లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు. 1956లో విండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అక్కడే బ్రూస్ ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత బ్రూస్ పైరౌడో వెస్టిండీస్ నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. న్యూజిలాండ్ తరపున దేశవాలీ టోర్నీల్లో ఆడిన బ్రూస్ 1966-67లో అంతర్జాతీయ సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్ మెరిసిన అశ్విన్, హర్షల్.. టీమిండియా టార్గెట్ 163 -
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం.. మాజీ కెప్టెన్ మృతి
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్యారీ సింక్లెయిర్ (82) ఆదివారం వెల్లింగ్టన్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కివీస్ తొలి తరం బ్యాటర్లలో ముఖ్యుడైన సింక్లెయిర్.. 1963-68 మధ్యలో 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 29.43 సగటున 3 సెంచరీల సాయంతో 1148 పరుగులు చేశాడు. కివీస్ తరఫున బెట్ సట్‌క్లిఫ్, జాన్ రీడ్ తర్వాత 1000 పరుగులు చేసిన ఆటగాడిగా సింక్లెయిర్ రికార్డుల్లో నిలిచాడు. కివీస్ తరఫున 3 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సింక్లెయిర్.. ఐదేళ్లలోనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. వెల్లింగ్టన్ తరఫున 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్.. ఓవరాల్‌గా 118 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 32.87 సగటున 6 సెంచరీలు, 38 అర్ధ సెంచరీల సాయంతో 6114 పరుగులు చేశాడు. సింక్లెయిర్ మృతి పట్ల క్రికెట్ న్యూజిలాండ్ సంతాపం తెలిపింది. కొద్ది రోజుల కిందటే సింక్లెయిర్‌కు అత్యంత ఆప్తుడు, కివీస్ మాజీ సెలెక్టర్ డాన్ నీలి కూడా కన్నుమూశాడు. చదవండి: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం -
బాపు నాదకర్ణి కన్నుమూత
ముంబై: భారత మాజీ క్రికెటర్ బాపు నాదకర్ణి (86) శుక్రవారం కన్ను మూశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955–1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 88 వికెట్లు పడగొట్టారు. 1414 పరుగులు చేశారు. 1964లో మద్రాసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 32 ఓవర్లలో 27 మెయిడిన్లు కాగా 5 పరుగులు మాత్రమే (32–27–5–0) ఇచ్చారు. ఇందులో వరుసగా 21 మెయిడిన్ ఓవర్లు ఉండటం ఒక అరుదైన రికార్డుగా నమోదైంది. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) శుక్రవారం ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు చానల్ నైన్ ప్రకటించింది. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వయసు మీరిపోవటంతో ఆయన ఆరోగ్యం వైద్యానికి సహకరించలేదు. ఆయన నిద్రలో ఉండగానే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. 63 టెస్ట్ మ్యాచ్ లో ఆడిన రిచీ బెనాడ్..రెండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీంతో పాటు 27.0కు పైగా సగటుతో 248 టెస్ట్ వికెట్లను తీశారు. బెన్నాడ్ 28 టెస్ట్ లకు నేతృత్వం వహించి అన్నింటా విజయం సాధించిన కెప్టెన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తన టెస్ట్ కెరీర్ లో 122 పరగులు అత్యధిక స్కోరు. కాగా, 16 సార్లు ఐదు వికెట్లను తీసిన క్రికెటర్ గా బెనాడ్ గుర్తింపు పొందాడు. కెర్రీ పాకర్స్ వరల్డ్ సిరీస్ ను ప్రవేశపెట్టడంలో కూడా బెన్నాడ్ ప్రముఖ పాత్ర వహించారు. 1930లో జన్మించిన బెనాడ్..1952 టెస్ట్ క్రికెట్ ను ఆరంభించారు. దశాబ్దానికి పైగా ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలందించారు. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడిన బెనాడ్..1964 లో సౌతాఫ్రికాపై చివరి టెస్ట్ తో తన క్రికెట్ జీవితానికి స్వస్తి చెప్పారు. 1970 లో క్రికెట్ వ్యాఖ్యాతగా తన రెండో ఇన్నింగ్స్ బెనాడ్ ఆరంభించారు.నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ వ్యాఖ్యాతగా సేవలందించిన బెనాడ్ ..2013లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటమే కాకుండా ఆ తదుపరి సంవత్సరం క్యాన్సర్ బారిన పడ్డారు. బెన్నాడ్ మృతిపై పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా దుర్దినంగా ప్రధాని టోనీ ఆబాట్ పేర్కొన్నారు. బెన్నాడ్ నిజంగా గొప్ప క్రికెటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా తనదైన ముద్ర వేశాడని ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతాపం తెలిపాడు.