న్యూజిలాండ్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్యారీ సింక్లెయిర్ (82) ఆదివారం వెల్లింగ్టన్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కివీస్ తొలి తరం బ్యాటర్లలో ముఖ్యుడైన సింక్లెయిర్.. 1963-68 మధ్యలో 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 29.43 సగటున 3 సెంచరీల సాయంతో 1148 పరుగులు చేశాడు. కివీస్ తరఫున బెట్ సట్‌క్లిఫ్, జాన్ రీడ్ తర్వాత 1000 పరుగులు చేసిన ఆటగాడిగా సింక్లెయిర్ రికార్డుల్లో నిలిచాడు.
కివీస్ తరఫున 3 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సింక్లెయిర్.. ఐదేళ్లలోనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. వెల్లింగ్టన్ తరఫున 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్.. ఓవరాల్‌గా 118 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 32.87 సగటున 6 సెంచరీలు, 38 అర్ధ సెంచరీల సాయంతో 6114 పరుగులు చేశాడు. సింక్లెయిర్ మృతి పట్ల క్రికెట్ న్యూజిలాండ్ సంతాపం తెలిపింది. కొద్ది రోజుల కిందటే సింక్లెయిర్‌కు అత్యంత ఆప్తుడు, కివీస్ మాజీ సెలెక్టర్ డాన్ నీలి కూడా కన్నుమూశాడు.
చదవండి: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment