former officers
-
పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు. ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్ యాదవ్ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేశారు. పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్ పన్నూ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోనూవాషింగ్టన్: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అలియాస్ నిజ్జర్ హత్యతోనూ వికాస్ యాదవ్ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్–టైమ్ వీడియోను వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్ హత్య కేసులో వికాస్ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని 7వ తేదీన ప్రారంభించనున్నారు. పథకం కింద వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్ హార్వెస్టర్స్ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేళా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హరికిరణ్ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్ హార్వెస్టర్స్‌ను పంపిణీ చేస్తారని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ జరిగే ప్రాంతానికి రవాణా సౌకర్యం, తాగునీరు, వసతి వంటి సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేళా ప్రాంతానికి ముందుగానే యంత్రాలు చేరేలా కంపెనీ ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. (చదవండి: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ) -
కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్‌మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
రైల్ నీల్ కుంభకోణంలో చార్జిషీటు
న్యూఢిల్లీ: సంచలనం రేపిన రైల్ నీల్ కుంభకోణంలో సీబీఐ శుక్రవారం చార్జ్‌షీటు దాఖలుచేసింది. మంచినీటి సీసాల సరఫరా వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టింది. నార్తరన్ రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు ఎం.ఎస్. ఛలియా, సందీప్ సిలాస్లపై చార్జిషీటు నమోదు చేసింది. వివిధ ప్రైవేటు కంపెనీ అధిపతులు సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఉన్నతాధికారి దేవ్ ప్రీత్ సింగ్ తెలిపారు. భారతీయ రైల్వేల ద్వారా సరఫరా చేసే నాణ్యమైన మంచినీటి సీసాలకు బదులుగా చౌకరకం బాటిళ్లు సరఫరా చేసిన విషయంలో అప్పట్లో చీఫ్ కమర్షియల్ మేనేజర్లుగా ఉన్న అధికారులిద్దరిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి భారతీయ రైల్వే సంస్థకు సుమారు 20 కోట్ల మేర నష్టం కలిగించినట్టు ఆరోపణలున్నాయి. రాజధాని, శతాబ్ది లాంటి ప్రధాన రైళ్లలో తప్పనిసరి చేసిన 'రైల్ నీర్'ను కాకుండా చౌకరకం బాటిళ్లను సరఫరా చేసిన వ్యవహారంలో సీబీఐ శుక్రవారం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఆర్కే అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యం కేటరర్స్, అంబుజ్ హోటల్ అండ్ రియల్ ఎస్టేట్, పీకే అసోసియేట్స్, సన్‌షైన్ ప్రైవేట్ లిమిటెడ్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్, ఫుడ్‌వరల్డ్ సంస్థలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసింది. మంచినీటిని సరఫరా చేసిన ఆర్కే అసోసియేట్స్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్‌ల యజమానులైన శ్యాంబిహారీ అగర్వాల్, ఆయన కుమారులు అభిషేక్, రాహుల్‌ల నివాసాల నుంచి రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులకు భారీ ముడుపులు అందాయని, ప్రైవేటు క్యాటరర్లు చౌకరకం బాటిళ్లతో భారీగా లాభాలను ఆర్జించారని సీబీఐ ఆరోపిస్తోంది. తద్వారా ఖజనాకు భారీనష్టం కలిగిందని సీబీఐ అధికారి తెలిపారు. తమ విచారణను మిగతా 16 జోన్లకు కూడా విస్తరిస్తామమన్నారు.