former presidents
-
Trump: యూఎస్ సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్ 5 లోగా ట్రంప్ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే. ‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్ సోనియా సొటోమేయర్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్ డిబేట్ తర్వాత మళ్లీ బైడెన్ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం. -
వస్త్ర‘దారుణాలు’
వీరంతా అమెరికా మాజీ అధ్యక్షులు.. ఓ పత్రిక వీరి డ్రెస్సులు చూసి.. చీ.. తూ.. యాక్.. అనేసింది. ‘డెయిలీ మెయిల్’ రూపొందించిన ‘‘ఫ్యాషన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు పాల్పడిన వస్త్ర‘దారుణాలు’-20’’ జాబితాలో వీరు టాప్-3లో ఉన్నారు. నంబర్-1: రోనాల్డ్ రీగన్.. 1984లో అయోవాకు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్నప్పుడు తన సిబ్బంది ఉద్దేశించి.. ప్రసంగిస్తున్న దృశ్యమిదీ.. ఇందులో ఆయన రెగ్యులర్ షర్ట్, షూ వేసుకున్నా.. నైట్ డ్రెస్ కింద వాడుకునే ప్యాంట్లాంటిదాన్ని వేసుకున్నారు. అదీ.. నడుముకి ఎంతెత్తున కట్టారో చూడండి.. ఇంత చండాలమైన కాంబినేషన్ వేసుకున్నారు కాబట్టే.. ఈయనకు జాబితాలో మొదటి ప్లేసు దక్కింది. నంబర్-2: మన గూఢచారి చిత్రాల్లోని హీరోలు వేసుకున్న డ్రెస్‌లా బాగుందనే అనిపిస్తోంది కానీ.. అమెరికాలో అధ్యక్షుడి స్థాయి వ్యక్తి ఇలా టెక్సాస్‌లోని కౌబాయ్‌లా టింగురంగా అంటూ తయారవడం బాగోలేదట. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ డ్రెస్ వేశారు. నంబర్-3: షార్ట్స్‌కు తక్కువ.. చెడ్డీకి ఎక్కువలా కనిపిస్తున్న ఈ పొట్టి షార్ట్స్‌ను 1992లో బిల్ క్లింటన్ వేసుకున్నారు. ఉదయం జాగింగ్‌కు వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న ఈ డ్రెస్ చాలా మందికి పెద్దగా నచ్చలేదట. టాప్-3లో వీరున్నా.. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా సహా పలువురు మాజీ అధ్యక్షులు టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నారు.