గవర్నర్ హంతకుడిని ఉరితీశారు
లాహోర్: పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తాసిర్ను హత్య చేసిన పాకిస్థాన్ పోలీసు కమాండర్ ముంతాజ్ ఖాద్రిని పాక్ పోలీసులు సోమవారం ఉదయం ఉరితీశారు. రావల్పిండి జైలులో అతడిని ఉరి తీసినట్లు అధికారులు చెప్పారు. 2011లో గవర్నర్ సల్మాన్ ను ఆయన ఇంటికి సమీపంలోని ఓ మార్కెట్ వద్ద ముంతాజ్ హత్య చేశాడు.
దేశ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఆయనను చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు అప్పగించగా అది ఉరి శిక్షను విధించింది. దీంతో రావల్పిండిలోని అడియాల జైలులో అతడిని ఉరి తీశారు. 2015లో ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లిన అతడికి క్షమాభిక్ష దొరకలేదు.