శంకుస్థాపన వేదిక వద్ద పటిష్ట భద్రత
ప్రాంగణంలో నిఘా పెంచిన ప్రభుత్వం
వేదిక వద్ద ఎంఐపీ, వీవీఐపీ, మీడియా గ్యాలరీ ఏర్పాటు
తాడికొండ : అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్దండ్రాయునిపాలెంలో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఉన్నతాధికారులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. దేశ ప్రధానితో సహా సింగపూర్, జపాన్ దేశాల ప్రముఖులు రానున్నందున శంకుస్థాపన వేదిక వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ వేదికపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
బీఫ్ శబ్ధంతో కంగారుపడ్డ అధికారులు
ఒక దశలో వేదిక వద్ద మిషన్లకు బీప్ శబ్దం రావటం తో కంగారుపడి మొత్తం పరిశీలించారు. అనంతరం ఇనుపముక్క ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. వేదిక కింద మోస్ట్ వీఐపీ, వీవీఐపీలతో పాటు మీడి యా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. లక్ష మంది సాధారణ ప్రజలు కూర్చునేందుకు పందిళ్లు సిద్ధం చేస్తున్నారు.
50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
శంకుస్థాపన వేదిక సమీపంలోనే సాధారణ ప్రజలు వచ్చే వాహనాలు నిలిపేందుకు 50 ఎకరాల పొలం లో పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నారు. పార్కింగ్‌ల బాధ్యతను గృహ నిర్మాణశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సారి వేదికకు కేవలం 200 మీటర్ల దూ రంలోనే సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్ స దుపాయం కల్పిస్తున్నారు. ప్రధాని కోసం ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ప్రాంతంలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.