founds release issue
-
రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి హక్కుగా, గ్రాంట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇవే కాకుండా జీఎస్టీ కింద రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, ఇంకా మరిన్ని నిధులు రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా గత 5 నెలల్లో రూ.55,638 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శాసనమండలిలో ఆర్థికశాఖకు సంబంధించిన మూడు బిల్లులపై వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఆయా అంశాలు ప్రస్తావించారు. షరతులు ఒప్పుకోం.. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లుపై హరీశ్ మాట్లాడుతూ అప్పు కోసం కేంద్రం విధించే షరతులకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. గోడౌన్లు కట్టుకుని, ఉచిత కరెంటు అందించి రైతును సంపన్న వర్గాలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా షరతులు పెట్టింది. వీటిని అమలు చేసేది లేదు. వ్యవసాయ పంపుసెట్లు వాడే చోట మీటర్లు పెట్టాలని అప్పుడే అప్పు ఇస్తామని మెలిక పెట్టింది. ఇలాంటివి సరికాదని ప్రధానికి, ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పెంపునకు కేంద్రం అనుమతిచ్చినా.. రాష్ట్రానికి నష్టం జరిగే షరతులకు తలొగ్గేది లేదని సీఎం చెప్పారు. అప్పులను చూసే ముందు.. రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కలిపి చూడాలి. మన రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల 2014కు ముందు రూ.4 లక్షల 52 వేల కోట్లయితే ఈనాడు రూ.11 లక్షల 5 వేల 349 కోట్లు. ప్రస్తుత సవరణ ద్వారా వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది. గతంలో కార్పొరేషన్లకు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీ ఇచ్చే అవకాశముంది. దాన్ని 200 శాతానికి పెంచడం జరుగుతుంది. కరోనా కంటే ముందు మన దేశ జీడీపీ క్రమేపీ గత 8 క్వార్టర్లు తగ్గుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మైనస్ 24 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం మాత్రం డబుల్ డిజిట్ ఉంది. ఫెర్టిలైజర్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రూ.లక్షా 85 వేల కోట్లు తెస్తే ఆ డబ్బు రాయితీల కోసం ఖర్చు చేశారు. కాళేశ్వరం మీద డబ్బులు ఖర్చు చేయడం ద్వారా లక్ష కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చయింది’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
‘పవర్’ లేని పదవి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సర్పంచులు గెలిచి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వారికి చెక్‌పవర్ ఇవ్వలేదు. హామీలిచ్చి గెలిచిన నాయకులు మాట నిలబెట్టుకోలేక.. ప్రజలకు సమాధానం ఇవ్వలేక లోలోన మదన పడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు చేయిద్దామని ముందుకు వచ్చే సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. కావాల్సిన నిధులు ఖాతాల్లో పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సొంత ఖర్చులతో పనులు.. గెలిచిన ఆనందంలో కొత్త సర్పంచ్‌లు సొంత ఖర్చులతో గ్రామాల్లో కొన్ని పనులు చేయించారు. పంచాయతీ కార్యాలయాల్లో ఫర్నీచర్ కొనుగోలు, వీధి లైట్ల మరమ్మతులు, తాగునీటి అవసరాల ఏర్పాట్లు, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం, సిబ్బందికి జీతాలు, మరుగుదొడ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వంటికి చేతినుంచి ఇచ్చి చెక్‌పవర్ వచ్చాక బిల్లులు చేసుకుందామని అనుకున్నారు. కానీ ఆ అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల వసూలైన పన్నులతో సిబ్బందికి కొంత వరకు జీతాలు ఇస్తుండగా, మరుగుదొడ్ల నిధులు జీపీల ఖాతాల్లో ఉన్నా విడిపించలేక పోతున్నారు. పెరిగిన అదనపు ఖర్చులు గెలిచిన సర్పంచ్‌లంతా ఫిబ్రవరి 2వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. సీట్లో కూర్చొగానే వారికి సమస్యలు స్వాగతం పలికాయి. వీధి లైట్లు, గేట్‌వాల్వ్‌లు లీకవుతున్నాయని, నెలల తరబడి మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలని ప్రజలనుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం పాడైన విద్యుత్ మోటార్ల స్థానంలో కొత్తవి బిగించాలని కోరారు. దీంతో గెలిచిన ఉత్సాహంతో సర్పంచ్ ప్రజల విన్నపాలకు స్పందించి సొంత ఖర్చులతో పనులు చేయించారు. తెలిసిన వారి దుకాణాల్లో ఖాతాలు తెరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. చెక్‌పవర్ రాబోతుందని తెలిసి నిధులు డ్రా చేసి బకాయిలు చెల్లించవచ్చని భావించారు. తీరా నెలలు గడుస్తున్నా సర్పంచ్‌లకు చెక్ పవర్ రాలేదు. దీంతో బిల్లుల చెల్లింపు పెండింగ్ పడింది. సిబ్బంది వేతనాలకూ ఇబ్బంది మండల కేంద్రాలుగా పంచాయతీల్లో సుమారు 10 మంది వరకు సిబ్బంది పని చేస్తుంటారు. చిన్న పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు పని చేస్తారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, విద్యుత్ మెకానిక్‌లు, రోడ్లు, మురికి కాల్వలు శుభ్రం చేసే కార్మికులు ఉంటారు. పన్నుల రూపేన వసూలు చేసిన డబ్బులను ఉద్యోగులు ఏ రోజుకారోజు జీపీ ఖాతాలో జమ చేస్తారు. వీరందరికి ప్రతి నెల పంచాయతీ నుంచే జీతాలు చెల్లించాలి. కొత్త సర్పంచ్‌లు తమ జీపీ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించ లేకపోతున్నారు. కొన్ని చోట్ల పన్నుల రూపేన వసూలు చేసిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఒక్కొక్కరికి జీతాలు చెల్లిస్తారు. అభివృద్ధిపై ప్రభావం కొత్త పాలకులు కొలువుదీరినా అధికారాలు బదిలీ కాకపోవడంతో గ్రామ పాలన పూర్తిగా గాడి తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ప్రకటించినట్లుగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ అప్పగించిన కొంత మేరకు గ్రామ సర్పంచ్‌లకు చెక్ పవర్ అప్పగించిన కొంత మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కానీ చెక్ పవర్ సర్పంచ్‌లకు ఇస్తే నిధులు దుర్వినియోగం జరుగుతుందన్న వాదన కూడా లేక పోలేదు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో తాగునీరు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పనులకు సర్పంచ్‌లు సొంత ఖర్చులతో చేయిస్తుండడంతో వారి బేబులకు చిల్లు పడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులకు బ్రేక్ కేంద్రం ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టింది. పంచాయతీల ద్వారా ఒక్కో మరుగుదొడ్డి నిర్మించినందుకు గాను రూ.12 వేలు అందిస్తోంది. లబ్ధిదారులకు మొదటి దఫా 6 వేలు, రెండో దఫా 6 వేల చెక్కుల రూపంలో అందుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్ధిదారుల పేర్లపై బిల్లులు చేసి జీపీ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేని కారణంగా కూడా బిల్లులకు బ్రేక్ పడినట్లవుతోంది. కారణాలేంటో? కొత్త సర్పంచ్‌లకు చెక్‌పవర్ రాకపోవడానికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మాట్లాడగా కొన్ని కారణాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన పంచాయతీ రాజ్ చట్టం–2018లో తొలుత సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి చెక్‌పవర్ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ స్థానంలో పంచాయతీ కార్యదర్శలకు చెక్‌పవర్ ఇవ్వాలని పేర్కొనలేదు. దీంతో సర్పంచ్‌లతో కలిపి ఎవరికీ చెక్‌పవర్ ఇవ్వాలో తేలలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్పా తామేమి చేయలేమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పుల పాలవుతున్నాం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిధుల్లేక చేతినుంచి పెట్టుకుని అప్పుల పాలవుతున్నాం. ఎన్నో ఆశలతో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యాం. కానీ చెక్ పవర్ లేక ప్రజల సమస్యలను పరిష్కరించలేక పోతున్నాం. కనీసం నీటి సమస్య, వీధి లైట్ల సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. చెక్ పవర్‌ను త్వరగా ఇస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాపూర్ సర్పంచ్ ఓపిక పట్టండి.. తప్పదు సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే ఎంపీడీఓలకు ఆదేశాలు ఇస్తాం. ఎంపీడీఓలు తమ పరిధిలో గల బ్యాంకులకు లేఖలు రాస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేదాక సర్పంచ్‌లు ఓపిక పట్టాలి తప్పదు. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
క్వారీ మార్కెట్ రోడ్డుకు రాజకీయ గ్రహణం
ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కీలక మార్గం పుష్కరాల నిధులు రూ.11.5 కోట్లు కేటాయింపు మోకాలడ్డుతున్న ప్రజాప్రతినిధి సాక్షి, రాజమహేంద్రవరం : క్వారీ మార్కెట్ రోడ్డు అభివృద్ధికి ఓ ప్రజాప్రతినిధి మోకాలడ్డుతున్నారు. దీంతో అనుమతులు, నిధులు మంజూరైనప్పటికీ ఏడాదిన్నరగా పనులు ప్రారంభంకావడం లేదు. వివరాలివి...గోదావరి పుష్కరాల సమయంలో ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీలు, భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీరందరి రాకపోకలకు వీలుగా క్వారీ మార్కెట్ నుంచి లాలాచెరువు జంక్ష¯ŒS వరకూ ఇందుకు రూ.11.5 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. కానీ ఈ మార్గం ప్రతిపక్ష కార్పొరేటర్ల పరిధిలో ఉండడంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న ఉద్ధేశంతోనే ఆ ప్రజాప్రతినిధి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు పక్కనబెట్టారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తుందన్న నెపంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేశారని విమర్శిస్తున్నారు. పుష్కరాల సమయంలో 100 అడుగుల మేర ఈ రోడ్డును నిర్మించాలని రూ.11.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దానవాయిబాబు గుడి నుంచి సుబ్బారావుపేట వరకూ కొంత మంది పేదలు నివాసముంటున్నారు. దీంతో అప్పటి కమిషనర్ ఈ రోడ్డు నిర్మాణాన్ని 80 అడుగులకు కుదించారు. పుష్కరాల అనంతరం కమిషనర్ బదిలీ అయ్యారు. తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎంతో కీలకంగా మారిన రోడ్డు సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి క్వారీ మార్కెట్ జంక్ష¯ŒS మీదుగా లాలాచెరువు చెరుకుని నగరం, రూరల్ ప్రాంతాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మధురపూడి విమానాశ్రయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ధవళేశ్వరం, వేమగిరి నుంచి 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా లాలాచెరువు వచ్చి క్వారీ మార్కెట్ రోడ్డు మీదుగా వెళతారు. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డుకు ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదు. ఇటీవల ఈ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలు కూడా పూర్తి చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం వచ్చిన ప్రతిసారి నగరపాలక సంస్థ రూ.లక్షలు వెచ్చించి గుంతలు పూడ్చేందుకు తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేయిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.