2017లో నాలుగు గ్రహణాలు
ఇండోర్: కొత్త సంవత్సరం 2017లో నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని ఖగోళ పరిశోధకులు పేర్కొంటున్నారు. వీటిలో రెండు చంద్ర గ్రహణాలు కాగా మిగతా రెండు సూర్యగ్రహణాలు అని ఉజ్జయినిలోని శివాజీ పరివోధనా సంస్థ తెలిపింది. అయితే వీటిలో రెండు గ్రహణాలు మాత్రమే భారత్లో కనిపిస్తాయని, 2017 ఫిబ్రవరి 11న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారతీయులు చూడగలరని, అదే నెల 26న ఏర్పడే సూర్యగ్రహణాన్ని చూడలేరని ఇనిస్టిట్యూట్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆగస్టు 7న ఏర్పడే పాక్షిక చందగ్రహణం భారత్లో కనిపిస్తుందంటూ ఆగస్టు 21న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత్లో కనిపించదని పేర్కొన్నారు.