పుట్టపర్తిలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులు ఒడిశా మంత్రిపై కాల్పులకు పాల్పడిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. పట్టణంలోని ఓ లాడ్జిలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు లాడ్జిలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అందులోభాగంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సదరు వ్యక్తులు తాము మావోయిస్టులమని ఒప్పుకున్నారని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 21న ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వరీ మహంతిపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.