గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురి అరెస్టు
గుర్గావ్: వితంతువుపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ సులు అరెస్టు చేశారు. నిందితులను కృష్ణకుమార్, బల్వంత్‌సింగ్, ధర్మేందర్, పవన్కుమార్లుగా గుర్తించారు. మరో నిందితుడు రికీ పరారీలో ఉన్నా డు. నిందితులంతా 30 నుంచి 35 ఏళ్ల వయస్సులోపు వారేనని, వీరంతా హర్యానాలోని ఖోద్ గ్రామస్తులని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన కృష్ణకుమార్... స్థలం చూపిస్తానంటూ బాధితురాలిని పటౌడీ అనే ప్రాంతానికి రప్పించాడు.
దీంతో నిందితుడిని నమ్మి న బాధితురాలు అతడి వెంట రాగా స్థలం వద్దకు కాకుండా మరోచోటికి తీసుకెళ్లి నలుగురు స్నేహితులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కృష్ణకుమార్ ఓ రియ ల్ ఎస్టేట్ వ్యాపారి అని, బాధితురాలితో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నాడన్నారు. బాధితురాలిని ఢిల్లీ-జైపూర్ మార్గంలో వదిలిపెట్టేశారన్నారు. నిందితులందరినీ జ్యుడిషియల్ మేజి స్ట్రేట్ తరుణ్ సింఘాల్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారని వివరించారు.