'నలుగురి నరబలి'
మదురై: తమిళనాడులో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ గ్రానైట్ కుంభకోణం కేసులోని వ్యక్తులు అంతకుముందు నలుగురు వ్యక్తులను బలిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 1999లో జరిగిన ఈ ఘటన ఆ కుంభకోణంలో ఉన్న వ్యక్తి కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పరిష్కారం అయింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మధురైలోని ఓ స్మశాన వాటికలో పోలీసులు తవ్వకాలు జరిపి చూడగా అందులో నాలుగు పుర్రె భాగాలు బయల్పడ్డాయి.
అంతకుముందు ఆ డ్రైవర్ మాత్రం ఇద్దరినీ పాతిపెట్టేందుకు తాను సహాయపడ్డానని చెప్పడం గమనార్హం. అందులో పూడ్చినవారు ఇద్దరు మానసిక వికలాంగులని, పాతిపెట్టేముందు వారి గొంతుకోసినట్లు పోలీసులకు వెల్లడించారు. వీరిద్దరిని కూడా పుదుక్కోటి నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా గ్రానైట్ క్వారీ నిర్వాహకుడు మాత్రం తనకు ఏ సంబంధం లేదని, కావాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు.