the four-Test series
-
భారత్‌కు తొలి విజయం
అమెరికాతో మహిళల హాకీ న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల హాకీ జట్టు త్వరగానే కోలుకుంది. అమెరికాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 2-1 తేడాతో నెగ్గింది. నేడు (శుక్రవారం) కెనడాతో భారత జట్టు తలపడుతుంది. తొలి క్వార్టర్లో హోరాహోరీ ప్రదర్శన ఎదురుకావడంతో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 19వ నిమిషంలో అమెరికా తొలి గోల్‌ను సాధించింది. ద్వితీయార్ధంలో విజృంభించిన భారత్‌కు 45వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించగా ప్రీతి దూబే గోల్ చేసింది. చివరి క్వార్టర్లోనూ అమెరికాపై ఒత్తిడి పెంచడంతో 55వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్‌తో విజయం ఖాయమైంది. -
2016లో విండీస్ పర్యటన
► నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్ సెయింట్ జాన్స్ (అంటిగ్వా): ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభణకు ఎట్టకేలకు గురువారం తెరపడింది. విండీస్‌తో సిరీస్‌ను పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జూలై-ఆగస్టులో కరీబియన్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) నుంచి ఓ ప్రకటన వచ్చింది. ‘బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. 2016లో విండీస్‌లో సిరీస్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందానికి మా బోర్డుతో పాటు ప్లేయర్స్ అసోసియేషన్ కట్టుబడి ఉంది. గతేడాది అర్ధంతరంగా టూర్ ముగిసింది. కాబట్టి ఇప్పుడు మరో సిరీస్ నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాం’ అని డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామోరాన్ తెలిపారు. అయితే కామోరాన్ ఎక్కువ చొరవ చూపడంతో మనోహర్ హామీ ఇవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. -
గిరగిరా తిరగాల్సిందే..!
టెస్టులన్నింటికీ స్పిన్ పిచ్లే స్పష్టం చేసిన రవిశాస్త్రి మొహాలి: సొంతగడ్డపై తమకు అనుకూల పిచ్‌లను ఆయా జట్లు సిద్ధం చేయడంలో తప్పేమీ లేదని, ఇదేమీ రహస్యం కూడా కాదని భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కుండబద్దలు కొట్టారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం అన్ని వేదికల్లోనూ తమకు అనుకూలమైన స్పిన్ పిచ్లే ఉంటాయని ఆయన గట్టిగా చెప్పేశారు. ‘ఏ జట్టయినా తమ బలాన్ని బట్టి వికెట్‌ను సిద్ధం చేస్తుంది. స్వదేశంలో అందరూ అలాగే ఆశిస్తారు. చాలా ఏళ్లుగా జరుగుతోంది ఇదే. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వెళ్లి తొలి రోజే బంతి తిరగాలని ఆశించలేం కదా’ అని పరోక్షంగా మొహాలి పిచ్ గురించి శాస్త్రి వ్యాఖ్యానించారు. 2001లో భారత్, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఆ స్థాయి పోరుగా శాస్త్రి ప్రస్తుత భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌ను అభివర్ణించారు. శ్రీలంకపై సిరీస్ గెలిచిన కోహ్లి సేన రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉందని, సఫారీలాంటి నంబర్‌వన్ జట్టును ఎదుర్కోవడం అనుభవం పరంగా యువ ఆటగాళ్లకు మేలు చేస్తుందన్న శాస్త్రి... ఇది గెలిస్తే గొప్ప ఘనత అవుతుందన్నారు. ‘గత ఏడేళ్లుగా దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోలేదు. ఆ రికార్డును అడ్డుకునే అవకాశం ఇప్పుడు టీమిండియా కు ఉంది. టి20, వన్డేలు గెలిచినా సఫారీలకు టెస్టులు కూడా గెలిచే అవకాశం ఇవ్వరాదని మేం పట్టుదలగా ఉన్నాం’ అని శాస్త్రి చెప్పారు. ఇటీవల వాంఖడే మైదానంలో క్యురేటర్ సుధీర్ నాయక్‌తో వివాదానికి సంబంధించి చాలా మాట్లాడానని, ఇక చెప్పేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మరో ఇద్దరు ఉన్నారు... ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్టుకు సిద్ధమయ్యాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని రవిశాస్త్రి వెల్లడించారు. మంగళవారం జట్టుతో పాటు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన అశ్విన్, వార్మప్‌గా ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అశ్విన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టి దక్షిణాఫ్రికా తమ వద్ద మరో ఇద్దరు స్పిన్నర్లు (జడేజా, మిశ్రా)కూడా ఉన్నారనే విషయాన్ని మరచిపోతోందని ఈ సందర్భంగా రవిశాస్త్రి హెచ్చరించారు. 4-0 గెలిస్తే రెండో ర్యాంక్‌కు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది. ఫేవరెట్లం కాదు: స్టెయిన్ టెస్టు సిరీస్‌లో తాము ఫేవరెట్లం కాదని దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ‘మేం భారత గడ్డపై ఆడుతున్నాం. వారిపై ఆధిక్యం ప్రదర్శించడం చాలా కష్టం’ అని స్టెయిన్ అన్నాడు. భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్ చివరి రోజుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోతోందని, కాబట్టి టాస్ గెలవడం కీలకం అని బ్యాట్స్‌మన్ ఎల్గర్ అన్నాడు. -
సానుకూల ఫలితమే!
సాక్షి క్రీడావిభాగం: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరిగిన విధానం చూస్తే 0-2తో ఓడిపోవడం భారత్‌కు సానుకూల ఫలితంగా భావించాలి. గత నాలుగు సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో ఒకసారి ఎదురైన ఘోర పరాజయాల దృష్ట్యా ఈ ఫలితం కాస్త మెరుగైందిగా భావించాలి. చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు (2011-12) సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్న బ్యాటింగ్ లైనప్ ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డి నిలువలేకపోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-4తో ఘోరంగా ఓడిపోయింది. ఈసారి పర్యటన ఆరంభమైనప్పుడు ఈ యువ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై నిలబడలేదనే అభిప్రాయం క్రికెట్ ప్రపంచంలో ఉంది. తొలి టెస్టులో కోహ్లి సారథ్యంలోని యువ క్రికెటర్లు చూపించిన తెగువ ఈ అభిప్రాయం కాస్తా మారేలా చేసింది. అడిలైడ్ టెస్టులో ఓటమి పాలైనా... సరైన స్ఫూర్తితో బ్రిస్బేన్‌లో రెండో టెస్టుకు వెళ్లారు. ఆ మ్యాచ్‌లో మూడు రోజుల పాటు బాగా పోరాడిన భారత్ చివర్లో చేతులెత్తేసి ఓటమిని 2-0కు పెంచుకుంది. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో పోరాట పటిమ కనబరచి రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ఇటీవల కాలంలో స్వదేశంలో ఆస్ట్రేలియా ప్రతి సిరీస్‌నూ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తోంది. కానీ భారత యువ జట్టు ఆ ప్రమాదం జరగకుండా అడ్డుకుంది. నాలుగు టెస్టుల్లో రెండు జట్లు కలిపి 5870 పరుగులు చేయడం ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ ప్రభావం ఎంతలా ఉందో చెప్పడానికి నిదర్శనం. ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారత్‌తో సిరీస్‌లో సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం మంచినీళ్ల ప్రాయమే. గతంలో దాదాపు అన్ని సందర్భాల్లోనూ ఇది చేశారు. అయితే భారత్ వైపు నుంచి మాత్రం దీనికి బదులు ఉండేది కాదు. కానీ ఈసారి అనూహ్యంగా భారత బ్యాట్స్‌మెన్ నుంచి ఆసీస్ బౌలర్లకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కోహ్లి (692 పరుగులు), ఓపెనర్ మురళీ విజయ్ (482 పరుగులు), రహానే (399 పరుగులు) భారత్‌ను నిలబెట్టారు. గతంలో అనేక సిరీస్‌లలో లేనిది, ఈ సిరీస్‌లో భారత్ సాధించిన గొప్ప ఘనత భాగస్వామ్యాలు. మురళీ, కోహ్లి... కోహ్లి, రహానేల జోడీలు ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాయి. పుజారా, రోహిత్, రైనా, ధావన్ ఈ నలుగురూ కూడా విఫలమయ్యారు. వరుసగా మూడు టెస్టుల్లో వచ్చిన అవకాశాలను ధావన్ వినియోగించుకోలేకపోయాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లోకేశ్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాల్సి వచ్చింది. కొత్త కుర్రాడే అయినా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రాహుల్ సెంచరీ చేశాడు. తన టెక్నిక్‌ను బయటపెట్టి భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించాడు. ఇక వన్డే స్టార్ రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. కానీ అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం రైనా గురించి. వన్డే ఆటగాడిగా ముద్రపడినా... రైనాలో టెస్టులు ఆడే సత్తా ఉందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి నమ్మారు. నిజానికి ఆయన సిఫారసు వల్లే రైనా టెస్టు జట్టులోకి వచ్చాడు. అయితే తుది జట్టులో చోటు కోసం మాత్రం నిరీక్షించాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్ కోహ్లి వచ్చాక, జట్టు మేనేజ్మెంట్ ఏం ఆలోచిం చిందో గానీ రైనాకు ఓ అవకాశం ఇచ్చారు. దీన్ని ఎంతలా వృథా చేసుకున్నాడంటే... టెయిలెండర్లు కూడా పరుగులు చేసిన సిడ్నీ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో నిలబడి జట్టును గట్టెక్కించాల్సిన సమయంలో మూడే బంతులకు పెవిలియన్‌లో కూర్చున్నాడు. ఇంతకంటే దారుణ వైఫల్యం మరోటి లేదు. నిజానికి విజయ్, కోహ్లి, రహానేలకు మద్దతు ఏ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఓ మోస్తరుగా ఆడినా ఫలితం మరోలా ఉండేది. ఈసారి భారత బౌలర్లలో ఎవరూ పూర్తిగా నాలుగు టెస్టులు ఆడలేదు. షమీ (15 వికెట్లు), అశ్విన్ (12 వికెట్లు), ఉమేశ్ యాదవ్ (11 వికెట్లు), ఇషాంత్ శర్మ (9 వికెట్లు) అందరూ మూడేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ పుంజుకున్న స్థాయిలో సగం బౌలర్ల నుంచి సానుకూల ప్రదర్శన వచ్చి ఉంటే సిరీస్ ఫలితం మరోలా ఉండేది. ప్రత్యర్థి జట్టులో స్మిత్ (769 పరుగులు) కొరకరాని కొయ్యలా తయారైతే... ఓపెనర్లు వార్నర్ (427 పరుగులు), రోజర్స్ (417 పరుగులు) కామ్‌గా తమ పని తాము చేసుకుపోయారు. వీరి ముగ్గురి ఫామ్‌ని బట్టి చూస్తే ఎంత బలమైన బౌలింగ్ లైనప్ అయినా ఇబ్బంది పడక తప్పదు. అయితే ప్రత్యర్థులు దూకుడు మీద ఉన్నప్పుడు పరుగులు రాకుండా నియంత్రించి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని మన బౌలర్లు అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా బౌలింగ్ లీడర్ ఇషాంత్ శర్మ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. షమీ మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లయోన్ 23 వికెట్లు తీసిన పిచ్‌లపై భారత స్పిన్నర్లంతా కలిపి 17 వికెట్లు తీయగలిగారు. ఇది కూడా గమనించాల్సిన అంశమే. మొత్తానికి భారత బౌలర్ల వైఫల్యం, ఆస్ట్రేలియా నిలకడ కారణంగా సిరీస్ ఫలితం ఇలా వచ్చింది. గతంతో పోలిస్తే ఇది సానుకూల ఫలితమే. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ చాలా భవిష్యత్తు ఉంది. అందరూ కుర్రాళ్లే. ఈ పర్యటన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వచ్చేసారి ఆస్ట్రేలియా పర్యటనకు వీరంతా ధీమాగా వెళ్లగలుగుతారు. భారత్‌లో టెస్టులు ఆడటం, గెలవడం జట్టులో ఎవరు ఉన్నా సాధ్యమే. విదేశాల్లో, ముఖ్యంగా ఉపఖండం బయట టెస్టులు గెలవడం ముఖ్యం. కోహ్లి సానుకూల దృక్పథం, యువ బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు చూస్తే... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్ విజయాలు సాధ్యమే అనిపిస్తోంది. -
కంగారు పడతారో పెడతారో!
సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, కోహ్లి... చివరిసారిగా భారత్ 2012లో ఆస్ట్రేలియాలో టెస్టు ఆడినప్పుడు బ్యాటింగ్ లైనప్ ఇది.విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్... ఈసారి భారత బ్యాటింగ్ లైనప్ ఇది. ఈ రెండు లైనప్‌లకు ఏ మాత్రం పొంతన లేదు. నాడు తుది జట్టులో అతి కష్టమ్మీద చోటు దక్కించుకున్న విరాట్, ఇప్పుడు జట్టుకు సారథి. రెండేళ్లలో భారత క్రికెట్లో వచ్చిన మార్పునకు ఈ లైనప్ అద్దం పడుతోంది. రెండేళ్ల క్రితం మొత్తం దిగ్గజాలంతా ఉన్న జట్టు 0-4తో చిత్తుచిత్తుగాఓడిపోయింది. మరి ఈ యువ జట్టు ఏం చేయనుంది? కుర్రాళ్లంతా కొత్త ఉత్సాహంతో ఉన్నారంటున్న కోహ్లి మాటలు మైదానంలో ఏ మేరకు ఆచరణలోకి వస్తాయి. భారత టెస్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో తేలిపోనుంది. ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో కలిపి రోహిత్ 264 పరుగులు చేయగలడా? శ్రీలంకపై వన్డేలో రోహిత్ శర్మ అన్నే పరుగులు చేయగానే... ఒక ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఇది. ఉపఖండం ఆవల భారత యువ క్రికెటర్ల టెస్టు సత్తాపై ఉన్న అభిప్రాయం ఇది. ఇది తప్పని నిరూపించాల్సిన అవసరం రోహిత్‌పై ఉంది. ఒక్క రోహిత్ అనే కాదు... భారత కుర్రాళ్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో ఆడలేరనే భావన పోగొట్టాల్సిన సమయం ఇది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో సుదీర్ఘ సమయం గడపనున్న భారత్... ఆ మెగా టోర్నీ గురించి ఇప్పుడు ఆలోచించకపోవడమే మంచిది. ముక్కోణపు వన్డే టోర్నీ రూపంలో ప్రపంచకప్‌కు సన్నాహాలు ఉన్నాయి. దానికంటే ముందు టెస్టు సిరీస్‌ను గనక గెలిస్తే... బోలెడంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సొంతగడ్డపై పులి భారత్ స్వదేశంలో ఎంత బలమైన జట్టో... ఆస్ట్రేలియా కూడా అంతే బలమైన జట్టు. దీనికి తోడు స్వదేశంలో చివరిసారిగా ఆడిన టెస్టు సిరీస్ యాషెస్‌లో ఆసీస్ స్టార్స్ ఏకంగా 5-0తో ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. సాధారణంగానే అక్కడి పిచ్‌లపై మిగిలిన దేశాల క్రికెటర్లు కాస్త బలహీనంగా కనిపిస్తారు. దీనికితోడు ఆసీస్ ఆటగాళ్లు సొంతగడ్డపై చెలరేగుతూ ఉంటారు. కాబట్టి ఆసీస్‌ను ఓడించాలంటే భారత్ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. రికార్డుల ఆలోచన వద్దు పాత రికార్డులు, ఇంగ్లండ్‌లో ఆడిన టెస్టుల గురించి భారత క్రికెటర్లు ఏ మాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే అవన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో లార్డ్స్‌లో గెలిచిన తర్వాత భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన తీరు ఆందోళనకరం. ఆస్ట్రేలియాలో పరిస్థితులు కూడా ఇంచుమించుగా ఇంగ్లండ్ పరిస్థితులతో సమానంగా ఉంటాయి. కాబట్టి భారత క్రికెటర్లకు ఇది క్లిష్టమే. కానీ అసాధ్యం కాదు. పరిస్థితులు కఠినం పచ్చని పచ్చికతో కళకళలాడే మైదానాలు... కిక్కిరిసిపోయే స్టేడియాలు... ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లు చూడటానికి కూడా బాగుంటాయి. ఇక పరిస్థితులు కూడా పూర్తిగా మనకు భిన్నం. వేగంగా దూసుకెళ్లే బుల్లెట్లలాంటి బౌన్సర్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. మ్యాచ్ నాలుగు, ఐదో రోజు కూడా మంచి బౌన్స్ ఉండటం ఇక్కడి స్టేడియాల ప్రత్యేకత. అయితే సిడ్నీలాంటి కొన్ని వేదికల్లో మాత్రం స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. ఏమైనా పేసర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఈ సిరీస్‌లో కీలకం. గ ంటకు 140 కి.మీ.ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే బౌలర్ లేకపోవడం మనకు లోటు. అయితే మ్యాచ్‌లో 20 వికెట్లు తీయగల సత్తా ఇషాంత్, భువనేశ్వర్, షమీలకు ఉంది. ఆరోన్, ఉమేశ్ యాదవ్‌ల రూపంలో వేగాన్ని నమ్ముకున్న బౌలర్లూ ఇద్దరు ఉన్నారు. కాబట్టి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు. బ్యాటింగ్‌లోనే అనుభవలేమి దెబ్బతీస్తుందనేది ఆందోళన. ఆ రెండు మ్యాచ్‌లు కీలకం నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు ప్రాక్టీస్‌కు సరిపోవు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌లను ఎంత బాగా వినియోగించుకుంటారో చూడాలి. ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా మైదానంలో గడిపే అవకాశం ఇస్తే బాగుంటుంది. - సాక్షి క్రీడావిభాగం టెస్టు సిరీస్ షెడ్యూల్ డిసెంబరు 4-8: తొలి టెస్టు బ్రిస్బేన్ డిసెంబరు 12-16: రెండో టెస్టు అడిలైడ్ డిసెంబరు 26-30: మూడో టెస్టు మెల్బోర్న్ జనవరి 3-7: నాలుగో టెస్టు సిడ్నీ భారత్ నవంబరు 24-25 తేదీల్లో, 28-29 తేదీల్లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. టెస్టుల్లో ముఖాముఖి ఆడినవి భా.గె. ఆ.గె. డ్రా టై భారత్‌లో 46 19 12 14 1 ఆసీస్‌లో 40 5 26 9 0 మొత్తం 86 24 38 23 1 భా.గె: భారత్ గెలిచినవి, ఆ.గె: ఆస్ట్రేలియా గెలిచినవి ‘ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో ఆడటం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంగ్లండ్‌లో వికెట్లపై రోజంతా పేస్, స్వింగ్, బౌన్స్ ఉంటుంది. కానీ ఆసీస్‌లో అలా ఉండదు. కాబట్టి ఒకసారి వికెట్‌పై కుదురుకుంటే సులభంగా పరుగులు చేయొచ్చు. మొత్తానికి ఈ టూర్ భారత్‌కు సవాలే. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ మీద ఆడే కోహ్లి, పుజారాకు అతి పెద్ద చాలెంజ్. ఆసీస్ వికెట్లపై విజయవంతం కావాలంటే బలమైన బ్యాక్‌ఫుట్ గేమ్‌ను ఆడాలి. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్లే బౌన్సర్లను అటాక్ చేయడమే నిజమైన సవాలు. బంతిని ముట్టుకుంటే ఎడ్జ్‌ను తీసుకుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. ఓవరాల్‌గా ఈ పర్యటనలో పరుగులు చేయాలంటే జట్టు మొత్తం బ్యాక్‌ఫుట్ గేమ్‌పై శ్రమించాలి. ప్రస్తుతం ఉన్న జట్టు నుంచి ఫలితాలు రాబట్టాలంటే కాస్త సమయం పడుతుంది. చివరి మూడు సిరీస్‌ల్లో మనవాళ్లు బాగా ఆడారు. కాబట్టి 2011-12తో పోలిస్తే ఈసారి మంచి ఫలితాలే వస్తాయనుకుంటున్నా’ - ద్రవిడ్ (మాజీ కెప్టెన్)